అన్వేషించండి

Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి

Petrol to CNG Conversion: మీ వద్ద ఉన్న పెట్రోల్ కారును CNGకి మార్చాలనుకుంటే ఇందుకు అవసరమైన నిబంధనలు, ఖర్చులు, ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

CNG Car Uses | పెట్రోల్ ధరల పెరుగుదలతో పాటు బంకుల వద్ద క్యూ సమస్యలు లేకుండా ఉండాలని కార్ల ఓనర్లు భావిస్తుంటారు. ఇంధన ధరలతో కార్ల మెయింటైన్స్ మీ బడ్జెట్‌లో మార్పులు తెస్తుంది.  అందుకే తమ పెట్రోల్ కారును సిఎన్‌జి (CNG)లోకి మార్చుకోవాలని కార్ల యజమానులు ఆలోచిస్తున్నారు. పెట్రోల్‌తో పోలిస్తే సిఎన్‌జి(CNG) కారు మెయింటైన్ చేయడానికి ఖర్చు చాలా తక్కువ. మైలేజీ కూడా మెరుగ్గా ఉంటుంది. మీ దగ్గర పెట్రోల్ కారు ఉండి, దానిని సిఎన్‌జిలోకి మార్చుకోవాలనుకుంటే, అందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు తెలుసుకోవాలి. దాంతోపాటు ఆ ప్రక్రియకు అయ్యే, ఖర్చులు, ఇతర విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

అసలు విషయం ఏంటంటే.. అన్ని పెట్రోల్ కార్లలో CNG కిట్‌ను అమర్చలేరని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న వాహనాలలో మాత్రమే సీఎన్‌జి కిట్‌ను ఫిక్స్ చేయవచ్చు. సాధారణంగా చిన్న హ్యాచ్‌బ్యాక్, సెడాన్క, చాలా ఎస్‌యువి (SUV)లలో సిఎన్‌జి కిట్‌ను ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే, చాలా పాత కార్లలో లేదా ఇంజిన్ సరిగ్గా లేని వాహనాలలో సిఎన్‌జి వేయించడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే సీఎన్‌జీ కిట్ వేయించే ముందు కారు కండీషన్, ఇంజిన్‌ను చెక్ చేయించాలి. 

ఈ ప్రక్రియకు ఖర్చు ఎంత అవుతుంది?
ఖర్చు విషయానికి వస్తే, పెట్రోల్ కారులో సీఎన్‌జీ కిట్ సెట్ చేయడానికి సాధారణంగా రూ. 35 వేల నుండి రూ. 80 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ధర కారు మోడల్, ఇంజిన్, ఉపయోగించే కిట్ క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది. మంచి బ్రాండెడ్ సిఎన్‌జి కిట్ కొంచెం ఖరీదు అయినప్పటికీ, ఇది సురక్షితమైనది. ఎక్కువకాలం పాటు మన్నికగా ఉంటుంది. చాలామంది తక్కువ ధరకే లభించే కిట్‌లను తీసుకుని, తరువాత పొరపాటు చేశామని భావిస్తుంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఇంజిన్, సేఫ్టీ పరంగా మీకు ఇబ్బందులు రావచ్చు.

సిఎన్‌జి కిట్‌ను ప్రభుత్వం గుర్తించిన, సర్టిఫైడ్ డీలర్ల వద్ద మాత్రమే అమర్చుకోవాలి. కిట్ వేయించిన తర్వాత దానికి సంబంధించిన బిల్లు, సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి. ఆ తర్వాత కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)లో కూడా మార్పులు చేయించాలి. తద్వారా మీ కారు ఇంధన రకం పెట్రోల్ నుండి CNGగా మారుతుంది. దీనితో పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఈ సమాచారం ఇవ్వాలి. లేకపోతే భవిష్యత్తులో క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బంది పడతారు. 

సీఎన్‌జీ కారు మెయింటనెన్స్ ఖర్చులు ఎలా ఉంటాయి.. 
కారును సిఎన్‌జిలోకి మార్చడం వల్ల కలిగే ప్రయోజనం తక్కువ ఖర్చుతో కారు నడపవచ్చు. పెట్రోల్‌తో పోలిస్తే సిఎన్‌జి చాలా చౌకగా లభిస్తుంది. కారు నడిపే ఖర్చు తగ్గుతుంది. సిఎన్‌జి కారు కిలోమీటరుకు సుమారు రూ. 2 నుంచి రూ. 3 ఖర్చుతో నడుస్తుందని చెబుతుంటారు. సీఎన్‌జీ కారు వల్ల కాలుష్యం తగ్గుతుంది. మీ ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణానికి సైతం ఇది మేలు చేస్తుంది. 

సీఎన్జీ వల్ల కలిగే నష్టాలు..

మీ పెట్రోల్ కారును సీఎన్జీగా మార్చడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. సిఎన్‌జి సిలిండర్ అమర్చడం వల్ల కారు బూట్ స్పేస్ తగ్గిపోతుంది. దాంతో మీరు లగేజీ పెట్టుకునే స్పేస్ పోతుంది. అలాగే కొన్ని కార్లలో పికప్, పెర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు. ఒకవేళ కిట్ సరిగ్గా అమర్చకపోతే ఇంజిన్, ECU సంబంధిత సమస్యలు వస్తాయి. చాలా కంపెనీలు బయట సిఎన్‌జి కిట్ వేయిస్తే కారు వారంటీని రద్దు చేస్తాయి. అందుకే కొత్త కారు కొనేటప్పుడు చాలామంది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి మోడల్ తీసుకోవాలని సూచిస్తారు. 

మరిన్ని ఆటో న్యూస్ కోసం క్లిక్ చేయండి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
ABP Desam Top 10, 6 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 6 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget