Kia Carens Clavis EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ MPV బుకింగ్ నేటి నుంచే ప్రారంభం - ధర ఎంతంటే?
Cheapest Electric MPV India: స్టాండర్డ్ కారెన్స్ మోడల్‌తో పోలిస్తే ఈ EVని కొంత మార్చారు, కొద్దిగా భిన్నంగా కనిపించేలా తీర్చిదిద్దారు. ఫీచర్ల పరంగా ఇదొక ప్రీమియం కారు.

Electric Family Car India: కియా మోటార్స్, ఇటీవలే, భారతదేశంలో తన మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ MPV కారెన్స్ క్లావిస్ EV ని లాంచ్ చేసింది. ఈ వాహనం ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Kia Carens Clavis EV ex-showroom price) రూ. 17.99 లక్షలు. హైదరాబాద్ లేదా విజయవాడలో, RTO ఛార్జీలు, అన్ని పన్నులు, ఇతర ఖర్చులు కలుపుకుని ఈ ఎలక్ట్రిక్ MPV ని దాదాపు రూ. 19.10 లక్షల ఆన్-రోడ్ ధరకు (Kia Carens Clavis EV on-road price) కొనుగోలు చేయవచ్చు.
బుకింగ్స్ షురూ
కంపెనీ ఈ రోజు (జులై 22, 2025) నుంచి కియా కారెన్స్ క్లావిస్ MPV బుకింగ్స్ ప్రారంభించింది. ఇది ICE (ఇంజిన్ ఆధారిత) కారెన్స్ క్లావిస్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్. మీ సమీపంలోని కియా షోరూమ్‌లో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కేవలం రూ. 25,000 చెల్లించి ఈ ప్రీమియం & స్మార్ట్ వెహికల్‌ను బుక్ చేసుకోవచ్చు.
డిజైన్ మారిందా?
కియా కారెన్స్ క్లావిస్ EV డిజైన్‌ను, స్టాండర్డ్ కారెన్స్ మోడల్ నుంచి భిన్నంగా కనిపించేలా కొద్దిగా మార్చారు. యాక్టివ్ ఏరో ఫ్లాప్స్, ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్ & కొత్త 17-అంగుళాల ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్‌నుతో లాంచ్ చేశారు. ఈ EVలో చాలా ప్రీమియం & స్మార్ట్ ఫీచర్లు అందించారు. ఇది V2L (వెహికల్ టు లోడ్) & V2V (వెహికల్ టు వెహికల్) టెక్నాలజీని కలిగి ఉంది. అంటే, ఈ కారు ఒక మినీ పవర్‌హౌస్. దీని నుంచి ఉపకరణాలు (లైట్లు, పోర్టబుల్ ఫ్యాన్‌లు వంటివి), ఇతర ఎలక్ట్రిక్ కార్లను కూడా ఛార్జ్ చేయవచ్చు. మీరు ఎక్కడికైనా పిక్నిక్ లేదా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు, మీరు ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు కావలసిన కరెంటును ఈ కారు నుంచే తీసుకోవచ్చు.
కియా కారెన్స్ క్లావిస్ EV పవర్ & పరిధి
కియా కారెన్స్ క్లావిస్ EV రెండు బ్యాటరీ ఎంపికలతో (42 kWh & 51.4 kWh) వచ్చింది. 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఇది దాదాపు 490 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. 42 kWh బ్యాటరీ వేరియంట్ దాదాపు 404 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది.
ఈ కియా కారు 171 hp పవర్ ఇస్తుంది. 4-లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ కారులో ఉంది. అలాగే, కియా 8 సంవత్సరాల వారంటీ & రెండు AC ఛార్జర్ ఆప్షన్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఎక్స్‌టీరియర్ అప్‌డేషన్స్
కియా కారెన్స్ క్లావిస్ EV కొత్త ఫ్లోటింగ్ కన్సోల్, బాస్ మోడ్, పవర్డ్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల స్క్రీన్, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, లెవల్ 2 ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ & 6 ఎయిర్ బ్యాగ్‌లు వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రూపుదిద్దుకుంది.
కారెన్స్ క్లావిస్ అనేది ICE నుంచి రూపాంతరం చెందిన కారు. కాబట్టి, చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర BYD eMax 7 కంటే తక్కువ & భారతదేశంలో అత్యంత తక్కువ ధర 3-సీట్ వరుసల EVగా మారింది.





















