అన్వేషించండి

TVS Jupiter: కేవలం రూ.3000 EMI తో టీవీఎస్‌ జూపిటర్‌కు ఓనర్‌ అవ్వండి, ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలంటే?

TVS Jupiter 110 Specifications: TVS జూపిటర్ 110 ఇంజిన్‌ను కంపెనీ అప్‌డేట్‌ చేసింది. ఈ స్కూటర్‌లో 113.3 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీతో పని చేస్తుంది.

TVS Jupiter 110 Price, Down Payment, Loan and EMI Details: రోజూ ఆఫీస్‌కు వెళ్లి రావడానికి లేదా ఇతర పనుల కోసం అప్-డౌన్ చేయడానికి అతికినట్లు సరిపోయే స్కూటర్‌ టీవీఎస్‌ జూపిటర్‌ 110. ఈ స్కూటర్‌ మీ కోసం చక్కగా పని చేస్తుంది & మెరుగైన మైలేజీతో డబ్బు కూడా ఆదా చేస్తుంది. మీరు కూడా TVS Jupitor 110 కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ దగ్గర పూర్తి స్థాయి డబ్బు లేకపోతే, ఈ స్కూటర్‌ను ఫైనాన్స్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీనికోసం, కాస్త డౌన్‌పేమెంట్‌, నెలనెలా కట్టేందుకు మీ దగ్గర దాదాపు రూ. 3000 ఉంటే చాలు.

తెలుగు నగరాల్లో ధర
TVS Jupiter 110 ఎక్స్‌-షోరూమ్‌ ధర (TVS Jupiter 110 ex-showroom price) 81,831 రూపాయలు. మీరు ఈ స్కూటర్‌ బేస్ వేరియంట్‌ను హైదరాబాద్‌ లేదా విజయవాడలో కొనాలంటే, ఆన్-రోడ్ ధర (TVS Jupiter 110 on-road price) దాదాపు రూ. 1,02 లక్షలు. ఇతర తెలుగు నగరాలు/పట్టణాల్లోనూ దాదాపు ఇదే ధర ఉంటుంది. ఆన్-రోడ్ ధర అంటే.. ఇందులో ఎక్స్‌-షోరూమ్‌ ధర, RTO ఛార్జీలు, బీమా & ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. TVS Jupiter ను ఫైనాన్స్‌లో తీసుకోవడానికి, మీరు కనీసం రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఆ తర్వాత, మిగిలిన రూ. 92,000 బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలి. మీకు ఈ లోన్‌ ఇప్పించడానికి, టీవీఎస్‌ షోరూమ్‌లోనే బ్యాంక్‌ ప్రతినిధులు ఉంటారు, అతి తక్కువ సమయంలో పని పూర్తి చేస్తారు.

బ్యాంక్‌, రూ. 92,000 రుణాన్ని మీకు 9 శాతం వడ్డీ రేటుతో ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు EMI ప్లాన్‌ చూద్దాం.

4 సంవత్సరాల్లో రుణం మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు EMI రూ. 2,584 చెల్లించాలి.

3 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే, నెలకు EMI రూ. 3,217 చెల్లించాలి.

2 సంవత్సరాల కోసం లోన్‌ తీసుకుంటే, నెలకు EMI రూ. 4,483 చెల్లించాలి.

1 సంవత్సరంలో లోన్‌ క్లియర్‌ చేయాలంటే, నెలకు EMI రూ. 8,282 చెల్లించాలి.

నెలకు దాదాపు రూ.3000 మీరు చెల్లించగలిగితే, 3 లేదా 4 సంవత్సరాల EMI ఆప్షన్‌తో టీవీఎస్‌ జూపిటర్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. 

బ్యాంక్‌ ఇచ్చే లోన్‌, విధించే వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, బ్యాంక్‌ విధానంపై ఆధారపడి ఉంటాయి.

టీవీఎస్ జూపిటర్ 110 ఫీచర్లు
TVS జూపిటర్‌లో OBD-2B (On-Board Diagnostics, Phase 2) ఉంటుంది, సెన్సార్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. ఈ సెన్సార్ సాయంతో థ్రోటిల్ రెస్పాన్స్, గాలి-ఇంధన మిశ్రమం, ఇంజిన్ ఉష్ణోగ్రత, ఇంధన పరిమాణం & ఇంజిన్ వేగానికి సంబంధించిన డేటా రైడర్‌కు అందుబాటులోకి వస్తుంది. ఆన్‌బోర్డ్ ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాయంతో ఈ డేటాను నిజ సమయంలో పర్యవేక్షించవచ్చు. ఆన్‌బోర్డ్ ఇంటెలిజెన్స్ సాయంతో స్కూటర్‌ను పర్యావరణానికి అనుగుణంగా నడపవచ్చు, ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

TVS జూపిటర్ 110 పవర్
TVS Jupiter 110 ఇంజిన్‌ అప్‌డేట్‌ అయింది. ఈ ద్విచక్ర వాహనంలో 113.3 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ బిగించారు, ఇది ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. స్కూటర్‌లోని ఈ ఇంజిన్ 5,000 rpm వద్ద 7.91 bhp పవర్‌ను ఇస్తుంది & 5,000 rpm వద్ద 9.2 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. దీనిలో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగించినప్పుడు, అది ఎలక్ట్రిక్ అసిస్ట్‌తో టార్క్‌ను 9.8 Nmకి పెంచుతుంది. TVS జూపిటర్‌ 110 స్కూటర్ గంటలకు గరిష్టంగా 82 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget