News
News
X

కొత్త Alto K10 కారు కొంటున్నారా? ముందుగా ఈ చిన్న కార్లతో పోల్చి చూడండి

తొలిసారి కారు కొనాలి అనుకునే వారు.. మంచి ఫీచర్లతో పాటు తక్కువ ధర ఉండాలి అనుకుంటారు. అలాంటి వారి కోసం తాజాగా ఆల్టో K10 కారు అందుబాటులోకి వచ్చింది. ఈ కారును కొనే ముందు వీటితో ఓసారి పోల్చి చూడండి..

FOLLOW US: 

ధ్యతరగతి ప్రజల బడ్జెట్ కారుగా గుర్తింపు పొందిన ఆల్టో కారు.. తాజాగా మరిన్ని హంగులతో మార్కెట్లోకి అడుగు పెట్టింది. వినియోగదారుల కోసం లేటెస్ట్ డిజైన్ తో పాటు కొన్ని కీలక మార్పులు చేసింది. అయితే కొత్తగా కారు కొనాలి అనుకునే వారు మంచి ఫీచర్లు, తక్కువ ధర ఉండాలి అనుకుంటారు. అయితే ఆల్టో K10 కొనాలి అనుకునేవారు..  ఎస్-ప్రెస్సో, క్విడ్‌ కార్లతో పోల్చి చూసుకోండి. ఏకారు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ కారు పెద్దది?

రెనాల్ట్ Kwid అత్యంత పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది. పొడవు, వెడల్పులో మిగతా కార్లతో పోల్చితే పెద్దగా ఉంటుంది. క్విడ్‌తో పోల్చితే S-Presso కాస్త చిన్నగా ఉంటుంది. Alto K10 మరింత చిన్నగా ఉంటుంది. డిజైన్ వారీగా క్విడ్, S-ప్రెస్సో చిన్న SUV రూపాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు.. S-ప్రెస్సో  బాక్సీ లుక్ కలిగి ఉంటుంది. Kwid ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. SUVతో పాటు.. ఎడ్జియర్ స్టైలింగ్‌తో ఉంటుంది. K10.. సెలెరియో లాంటి వంపు స్టైలింగ్‌తో ఆకట్టుకుంటుంది.

ఏ కారు మంచి ఇంటీరియర్‌ను కలిగి ఉంది?

కొత్త క్విడ్ ప్రీమియం ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. సరికొత్త స్టీరింగ్ వీల్,  డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందింది.  8-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో పాటు Apple CarPlay, Android Auto కనెక్టివిటీ, సెన్సార్‌లతో బ్యాక్ కెమెరా, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVM, LED టెయిల్-ల్యాంప్‌లు సహా పలు ఫీచర్లను కలిగి ఉంది.

S-ప్రెస్సో రౌండ్ సెంటర్ కన్సోల్‌తో ఫంకీ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ప్లస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్టీరింగ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్‌లను కలిగి ఉంది. ఆల్టో K10 మరింత సాంప్రదాయిక డిజైన్‌ను కలిగి ఉంది. అయితే నాణ్యతలో మెరుగుదలతో పాటు S-ప్రెస్సో లాంటి  టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరిన్ని స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ను పొంది ఉంటుంది. ఈ రెండు మారుతీ కార్లు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, AB, వెనుక పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి. కానీ వెనుక కెమెరాను కలిగి ఉండవు.

ఏది ఎక్కువ సమర్థవంతమైనది?

Kwid, S-Presso, K10 కార్లు 1.0l పెట్రోల్ ఇంజన్‌లతో వస్తాయి. అయితే క్విడ్ 91Nm వద్ద కొంచెం ఎక్కువ టార్క్ ను ఇస్తుంది. 72 PS దగ్గర ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. మారుతీ కార్లు 67పిఎస్, 89ఎన్ఎమ్ పవర్ ను జెనరేట్ చేస్తాయి.  అన్ని కార్లు 5-స్పీడ్ MT/AMTని కలిగి ఉంటాయి. S-ప్రెస్సో, ఆల్టో K10,  క్విడ్ 22.25 kmplకి 24.90 kmplతో పాటు 25.30 kmpl వద్ద అత్యంత శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 

ఏ కారుకు ఎంత ధరంటే?

⦿ ఆల్టో K10 ధరలు రూ.5.3 లక్షల నుంచి మొదలవుతాయి. 
⦿ క్విడ్  రూ.4.7 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు ఉంటుంది. 
⦿ ఎస్-ప్రెస్సో రూ.4.25 లక్షల నుంచి రూ.5.4 లక్షల వరకు ఉంటుంది. 
మొత్తంగా ఆల్టో చౌకైనది. హ్యాచ్‌బ్యాక్ డిజైన్ కావాలనుకుంటే, బాక్సీ S-ప్రెస్సోను ఇష్టపడకపోతే K10 కొనుగోలు చేసుకోవచ్చు. అయితే S-ప్రెస్సో బాక్సీగా కనిపించినప్పటికీ ఎక్కువ మైలేజ్, ఎక్కువ స్పేస్ కలిగి ఉంటుంది. క్విడ్ అత్యంత ప్రీమియం కారు. చాలా ఫీచర్లు కలిగి ఉంది. కానీ అంత సమర్థవంతమైనది కాదు. కాబట్టి, మీకు లుక్, ఫీచర్ల వంటి ప్రీమియం SUV కావాలంటే, Kwid కోసం వెళ్లండి. లేకపోతే S-Presso/K10 తీసుకోవచ్చు.

Also Read: కారు సడెన్‌గా బ్రేక్ ఫెయిలైతే ఏం చేయాలి? ఇదిగో ఇలా చేస్తే అంతా సేఫ్!

Also Read: అద్భుతమైన ఫీచర్లు, అందుబాటు ధరలో సామాన్యుడి కారు- Alto K10 ప్రత్యేకతలు ఇవే!

Published at : 22 Aug 2022 02:47 PM (IST) Tags: comparison Alto K10 S-presso KWID

సంబంధిత కథనాలు

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Tata Punch Camo Edition: టాటా పంచ్‌లో కొత్త వెర్షన్ - సూపర్ అనిపించే లుక్!

Tata Punch Camo Edition: టాటా పంచ్‌లో కొత్త వెర్షన్ - సూపర్ అనిపించే లుక్!

Honda Electric Moped: హోండా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్, మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

Honda Electric Moped: హోండా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్, మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

Mahindra XUV700: పండగ సీజన్ లో మహీంద్రా షాకింగ్ న్యూస్.. XUV700 SUV ధరలు భారీగా పెంపు!

Mahindra XUV700: పండగ సీజన్ లో మహీంద్రా షాకింగ్ న్యూస్.. XUV700 SUV ధరలు భారీగా పెంపు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!