అన్వేషించండి

Hyundai IONIQ 5: అద్భుతం చేసిన హ్యుందాయ్‌ EV - మూడేళ్లలో రూ.25 లక్షలు ఆదా, బ్యాటరీ ఇప్పటికీ భేషుగ్గా ఉంది

Hyundai Ioniq 5: హ్యుందాయ్ అయానిక్‌ ఎలక్ట్రిక్‌ కారును దాదాపు 6 లక్షల కి.మీ. నడిపిన ఓ వ్యక్తి ఏకంగా రూ.25 లక్షలకు పైగా ఆదా చేశాడు. ఆ EV బ్యాటరీ హెల్త్‌ ఇప్పటికీ 88 శాతం చూపిస్తోంది.

Hyundai IONIQ 5 EV Range: హ్యుందాయ్ అయానిక్‌ 5 ఎలక్ట్రిక్‌ కార్‌ గురించి అంతర్జాతీయ ఆటో మార్కెట్‌లో ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. కార్‌ ఇండస్ట్రీ పెద్దలు, ఔత్సాహికులు ఈ మోడల్‌ గురించి నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. దక్షిణ కొరియాలో నివసిస్తున్న లీ యంగ్-హ్యూమ్ అనే వ్యక్తి, కొంతకాలం క్రితం Hyundai IONIQ 5 EVని కొన్నాడు. కొన్ననాటి నుంచి ఈ ఎలక్ట్రిక్ కారును 5.8 లక్షల కిలోమీటర్లు నడిపాడు. ఇంతదూరం ప్రయాణం తర్వాత కూడా ఈ కారు బ్యాటరీ 87.7% ఆరోగ్యంగా ఉన్నట్లు తేలడం విశేషం.

EV గురించి మాట్లాడినప్పుడల్లా తలెత్తే మొదటి ప్రశ్న/భయం - బ్యాటరీ ఎంతకాలం వస్తుంది?. లీ కథ ఆ భయాన్ని పారదోలింది. లీ, తన Ioniq 5 ని ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఛార్జ్ చేస్తూ దాదాపు 6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ, బండి బ్యాటరీపై పెద్దగా ప్రభావం పడలేదు.

రోజుకు సగటున 586 కి.మీ. ప్రయాణం 
లీ యంగ్-హ్యూమ్ వృత్తి రీత్యా సేల్స్‌మ్యాన్ & రోజుకు సగటున 586 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. అతను 5.80 లక్షల కిలోమీటర్ల ప్రయాణాన్ని దాదాపు 2 సంవత్సరాల 9 నెలల్లో పూర్తి చేశాడు. అంతదూరం ప్రయాణించిన తర్వాత కూడా ఆ కారు బ్యాటరీ, మోటారు లేదా విద్యుత్ వ్యవస్థలో ఎటువంటి సమస్య కనిపించకపోవడం అత్యంత ఆసక్తికరమైన విషయంగా మారింది. సాధారణంగా, ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని వేగంగా దెబ్బతీస్తుందని చెబుతుంటారు, కానీ లీ కథ దానిని విరుద్ధంగా నిరూపించింది. రోజువారీ ప్రయాణంలో లీ తన అయానిక్‌ 5 EVని ఎక్కువ సార్లు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్‌ చేశాడు, అయినప్పటికీ బ్యాటరీ పనితీరు అద్భుతంగా ఉంది.

ఆశ్చర్యపోయిన హ్యుందాయ్-కియా పరిశోధన బృందం
లీ ఉపయోగిస్తున్న కారు గురించి వార్తల్లో రావడంతో, హ్యుందాయ్-కియా పరిశోధన బృందం అతని ఇంటికి వెళ్లింది. కారు బ్యాటరీ & మోటారును అత్యాధునిక పరికరాలతో పరీక్షించింది. ఆ పరీక్ష సమయంలో, 5.80 లక్షల కి.మీ దూరం ప్రయాణం తర్వాత కూడా బ్యాటరీ హెల్త్‌ 87.7% వద్ద ఉందని సైంటిఫిక్‌గా నిర్ధరణ అయింది. ఈ నంబర్‌ కూడా ప్రత్యేకమైనది, ఎందుకంటే సాధారణంగా ఇటువంటి మైలేజ్ టాక్సీలు లేదా వాణిజ్య వాహనాలలో మాత్రమే కనిపిస్తుంది.

పెట్రోల్ కారుతో పోలిస్తే రూ.25 లక్షల పొదుపు
లీ, అయానిక్‌ 5 EVని కొనకుండా 'హ్యుందాయ్ టక్సన్' లాంటి పెట్రోల్ కారులో అదే దూరం ప్రయాణించి ఉంటే, అతను ఇంధనం కోసం దాదాపు రూ. 48.56 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, IONIQ 5తో ఈ ప్రయాణం కేవలం రూ. 30.36 లక్షలలో పూర్తయింది. అంటే, అతని కళ్ల ముందే రూ. 18.2 లక్షలు మిగిలాయి. సాధారణంగా, సాంప్రదాయ ఇంధన కార్లతో పోలిస్తే EVల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. పెట్రోల్ కారులో ఇదే దూరానికి ఆయిల్‌ను 66 సార్లు, బ్రేక్ ఫ్లూయిడ్‌ను 13 సార్లు, స్పార్క్ ప్లగ్‌ను 8 సార్లు & ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌ను 11 సార్లు మార్చాల్సి ఉంటుంది. IONIQ 5లో వీటి అవసరం లేదు. జనరల్‌ సర్వీస్‌లు & కొన్ని కన్జ్యూమబుల్స్‌ను మాత్రమే మార్చాడు. దీని అర్థం దాదాపు మరో రూ. 7 లక్షలు ఆదా. మొత్తం కలిపితే మూడేళ్లలో లీ రూ. 25 లక్షలకు పైగా సేవ్‌ చేసుకున్నాడు.

స్లో ఛార్జింగ్ సమస్య
6.5 లక్షల కి.మీ. తర్వాత, మొత్తం ప్రయాణంలో ఒకే ఒక్కసారి స్లో ఛార్జింగ్ సమస్య కనిపించినట్లు లీ వెల్లడించాడు. ఇది తప్ప కారులో వేరే సాంకేతిక సమస్య లేదని తెలిపాడు. హ్యుందాయ్-కియా పరిశోధన బృందం చెప్పిన ప్రకారం, ఆన్-బోర్డ్ ఛార్జర్ దాని లైఫ్‌టైమ్‌ కంటే ఎక్కువ కాలం పని చేసిందని తేలింది. 

టాప్ హెడ్ లైన్స్

పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget