అన్వేషించండి

Hyundai India: ఐఐటీ హైదరాబాద్‌, కాన్పూర్‌తో హ్యుందాయ్ ఒప్పందం! ఫ్యూచర్ ప్లాన్ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Hyundai India: భారత్‌లో ఈవీ విప్లవం తీసుకొచ్చేందుకు హ్యుందాయ్ భారీగా ప్లాన్ చేస్తోంది. అందుకే ఐఐటీ హైదరాబాద్‌తోపాటు ఐదు విద్యాసంస్థలతో జతకట్టింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్, నాలుగు విద్యాసంస్థలతో EV పరిశోధనకు ఒప్పందం.
  • భారతీయ రోడ్లు, వాతావరణానికి అనువైన EV టెక్నాలజీ అభివృద్ధి.
  • బ్యాటరీ పనితీరు, భద్రత, తక్కువ ఖర్చుతో మైలేజీ పెంపు లక్ష్యం.
  • దేశీయ EV పరిశోధన, అభివృద్ధికి స్వయం సమృద్ధి సాధించాలనేది ఉద్దేశ్యం.

Hyundai India: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(Hyundai EV India) వాడకాన్ని ప్రోత్సహించడమే కాకుండా, ఇక్కడి వాతావరణం, రోడ్ల పరిస్థితులకు అనువైన సాంకేతికత తీసుకొచ్చేందుకు హ్యుందాయ్‌ మోటార్ గ్రూప్ కీలక ముందడుగు వేసింది. హ్యుందాయ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌(Hyundai Center of Excellence) చొరవ కింద తన పరిశోధనా నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ, నాలుగు విద్యాసంస్థలో ఒప్పందం చేసుకుంది. 

గతంలో ఉన్న సంస్థలతోపాటు ఇప్పుడు నాలుగు సంస్థలను తన పరిశోధన టీంలో చేర్చింది. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్‌(IIT Kanpur EV Research), విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాగ్‌పూర్‌, తేజ్‌పూర్‌ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకుంది.

ఈ నాలుగు సంస్థలు చేరడంతో హ్యుందాయ్ పరిశోధనా కూటమి(Hyundai academic partnership)లోని మొత్తం విద్యాసంస్థల సంఖ్య ఏడుకు చేరింది. 202లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు ఐఐటీ మద్రాస్(IIT Madras EV Research), ఐఐటీ ఢిల్లీ (IIT Delhi EV Research), ఐఐటీ బాంబే(IIT Bambay EV Research)లు వ్యవస్థాపక భాగస్వాములుగా ఉన్నాయి. 

Also Read: హ్యాందాయ్‌ నుంచి 10 లక్షల బడ్జెట్‌లో ఉన్న మోడల్స్ ఇవే! కారు కొనే ముందు ఓ లుక్‌ వేయండి!

పరిశోధనలు ఎందుకు?

భారతీయ మార్కెట్‌ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నమైంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు, ట్రాఫిక్ పరిస్థితులు, విద్యుత్ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఈవీ టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. భారతీయ వినియోగదారులు తక్కువ ఖర్చుతో కూడిన, ఎక్కువ మన్నిక ఇచ్చే బ్యాటరీ(Electric Vehicle Battery Technology )లను కోరుకుంటారు. దేశంలో పరిశోధన, అభివృద్ధి పర్యావరణాన్ని బలోపేతం చేయడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడం  ముఖ్య లక్ష్యం. 

హ్యుందాయ్‌ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ప్రధానంగా దృష్టి పెట్టిన అంశాలు పరిశీలిస్తే... బ్యాటరీ సెల్స్ పనితీరు, బ్యాటరీ మేనేజ్మెంట్‌ సిస్టమ్స్‌ మెరుగుదలపై ఫోకస్ చేస్తారు. బ్యాటరీ పరిమాణం తగ్గించి ఎక్కువ మైలేజీ ఇచ్చేలా చేస్తారు. అగ్ని ప్రమాదాలు నివారించడం, కఠినమైన వాతావరణంలో కూడా బ్యాటరీ పాడవకుండా చూడాలి. వాహనంలో తలెత్తే టెక్నికల్ లోపాలను ముందుగానే గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలు సాగుతాయి. 

Also Read: EV త్రీ-వీలర్ మార్కెట్లో సంచలనం.. హ్యుందాయ్, టీవీఎస్ మోటార్స్ Joint Venture! దేశీ రోడ్ల కోసం స్పెషల్ ఎలక్ట్రిక్ ఆటోలు

ప్రస్తుతం ఈ ఏడు విశ్వవిద్యాలయాలలో కలిపి మొత్తం 39 ఉమ్మడి పరిశోధనా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. భారతీయ పరిస్థితులకు తగ్గ బ్యాటరీ మెటీరియల్‌ పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత వెహికల్ టు గ్రిడ్ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి చేయడం వీళ్ల ప్రధాన టాస్క్‌. 

భారతీయ, కొరియా పరిశోధకుల మధ్య విజ్ఞాన మార్పిడి కోసం ప్రత్యేక కార్యక్రమాలను హ్యుందాయ్ నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయి ఇ-కాన్ఫెరెన్స్‌లు, టెక్నాలజీ ఫోరమ్‌లను నిర్వహించడం ద్వారా పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య వారధిని నిర్మించనున్నారు. 

2030 నాటికి భారీ సంఖ్యలో రవాణా వ్యవస్థను విద్యుదీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కేవలం వాహనాలను దిగుమతి చేసుకుంటే, అసెంబ్లీ చేసుకుంటే సరిపోదు. స్థానిక పరిస్థితులకు అవసరమైన విడిభాగాలు, వాహనాలు సిద్ధం చేయాలి. అందుకే దీనిపై పరిశోధనకు కంపెనీలు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి.  

Frequently Asked Questions

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం హ్యుందాయ్ ఏ చర్యలు తీసుకుంటోంది?

హ్యుందాయ్ భారతదేశంలో EVల వాడకాన్ని ప్రోత్సహించడానికి, ఇక్కడి వాతావరణం, రోడ్ల పరిస్థితులకు అనువైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి పరిశోధనా నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

హ్యుందాయ్ పరిశోధన కూటమిలో ప్రస్తుతం ఏయే విద్యా సంస్థలు ఉన్నాయి?

ప్రస్తుతం హ్యుందాయ్ పరిశోధన కూటమిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్, విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాగ్‌పూర్, తేజ్‌పూర్‌ యూనివర్శిటీతో సహా మొత్తం ఏడు విద్యాసంస్థలు ఉన్నాయి.

భారతీయ మార్కెట్ కోసం EV టెక్నాలజీని ఎందుకు అభివృద్ధి చేయాలి?

భారతీయ మార్కెట్‌ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు, ట్రాఫిక్, విద్యుత్ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన, ఎక్కువ మన్నిక ఇచ్చే బ్యాటరీలను అందించడానికి ఈ అభివృద్ధి అవసరం.

హ్యుందాయ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెడుతుంది?

ఈ విభాగం బ్యాటరీ సెల్స్ పనితీరు, బ్యాటరీ మేనేజ్మెంట్‌ సిస్టమ్స్‌ మెరుగుదల, బ్యాటరీ పరిమాణం తగ్గించి ఎక్కువ మైలేజీ ఇవ్వడం, అగ్ని ప్రమాదాలు నివారించడం, కఠినమైన వాతావరణంలో బ్యాటరీ పాడవకుండా చూడటంపై దృష్టి పెడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget