అన్వేషించండి

Hyundai Creta Hybrid Features: 30 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ (Hyundai Creta Hybrid ) 2027లో విడుదల కానుంది. 30 kmpl మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. ధర, ఇంజిన్ వివరాలు తెలుసుకోండి.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV Hyundai Creta త్వరలో హైబ్రిడ్ మోడల్ మార్కెట్లోకి రానుంది. తాజా నివేదికల ప్రకారం, హ్యుందాయ్ కంపెనీ ఈ హైబ్రిడ్ మోడల్ వాహనాన్ని 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Hyundai Creta Hybrid మోడల్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని కస్టమర్లకు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ కంపెనీ క్రెటా ఎస్‌యూవీ ఇప్పటికే దాని డిజైన్, ఫీచర్లతో ప్రజాధరణ పొంది విక్రయాల్లో దూసుకెళ్లింది. ఇప్పుడు ఇందులో హైబ్రిడ్ ఇంజిన్‌ను తీసుకురానుండటం వల్ల దాని మైలేజ్, పనితీరు రెండూ మరింత మెరుగ్గా ఉండనున్నాయి.

ఈ కొత్త క్రెటా నేరుగా Toyota Urban Cruiser Hyryder కారు, మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara) వంటి హైబ్రిడ్ SUVలతో పోటీపడుతుంది. రాబోయే Creta Hybridకు సంబంధించిన మార్కెట్ తేదీ, ఫీచర్లు, డిజైన్, ఇంజిన్, ధర గురించి అందుబాటులో ఉన్న వివరాలు ఇవే. 

2027లో Hyundai Creta Hybrid విడుదల 

Hyundai కంపెనీ ఇటీవల తన ఇన్వెస్టర్ మీటింగ్‌లో 2030 నాటికి 8 కొత్త హైబ్రిడ్ కార్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వాటిలో మొదటగా మార్కెట్లోకి Creta Hybrid వస్తుంది. నివేదికల ప్రకారం, నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటాను 2027లో మార్కెట్లోకి తేనుంది. ఇందులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపిక ఉంటుంది. ఇది Creta ని పెట్రోల్, డీజిల్ విభాగంలోనే కాకుండా హైబ్రిడ్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ (Hyundai Creta Hybrid) డిజైన్

నెక్స్ట్-జెనరేషన్ Hyundai Creta Hybrid డిజైన్ముఇప్పటి కంటే చాలా మోడ్రన్, స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో Hyundai  కొత్త పారామెట్రిక్ డిజైన్ ను చూడవచ్చు. SUVలో కనెక్టెడ్ LED DRLలు, పెద్ద పారామెట్రిక్ ప్యాటర్న్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌లైట్‌లు, వర్టికల్ ఫాగ్ ల్యాంప్‌లు ఉంటాయి. సైడ్ ప్రొఫైల్‌లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వాలుగా ఉండే రూఫ్‌లైన్ ఉండవచ్చు. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లు, స్పోర్టీ బంపర్ దీనికి పవర్‌ఫుల్ ప్రీమియం SUV రూపాన్ని ఇస్తాయి. కొత్త డిజైన్ Creta ని దాని విభాగంలో మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

Creta Hybrid ఫీచర్లు, సేఫ్టీ అప్డేట్

Hyundai Creta Hybrid లో కంపెనీ అనేక ప్రీమియం, మోడ్రన్ ఫీచర్లను తీసుకొస్తుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, Bose సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లకు ఛాన్స్ ఉంది. సౌకర్యాన్ని పెంచడానికి 4 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రియర్ సన్‌షేడ్స్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్‌లు ఉండనున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే Creta Hybrid లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉండవచ్చు.

కారు ఇంజిన్, పనితీరు

Creta Hybrid లో 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రావొచ్చు. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి పనిచేస్తుంది. రెండింటి కలయికతో దాదాపు 140 నుండి 150 హార్స్‌పవర్, 250 Nm కంటే ఎక్కువ టార్క్ జనరేట్ అవుతుంది.

Hyundai Creta Hybrid కారు మైలేజ్

Hyundai Creta Hybrid అతిపెద్ద ఆకర్షణ దాని మైలేజ్ అని చెప్పవచ్చు. పెట్రోల్ హైబ్రిడ్ వెర్షన్‌లో దీని మైలేజ్ 25 నుండి 30 kmpl వరకు ఉండవచ్చు. ఈ మైలేజ్ ప్రస్తుత Creta కంటే దాదాపు 30% ఎక్కువ. ఇది 17 నుంచి 21 kmpl ఉంటుంది. Creta Hybrid పర్యావరణ అనుకూలమే కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపికగా మారనుంది. 

హ్యుందాయ్ క్రెటా ధర

Creta Hybrid ధర దాదాపు 20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చు. ఈ ధర ప్రస్తుత టాప్ ఎండ్ Creta వేరియంట్ కు దాదాపు మ్యాచ్ అవుతుంది. ధరను బట్టి, Hyundai దీనిని టయోటా అర్బర్ క్రూజర్ (Toyota Urban Cruiser Hyryder), మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ (Maruti Grand Vitara Hybrid) వంటి కార్లతో పోటీ పడుతుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Starlink India Price: స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
Nagababu As Minister: నాగబాబుకి మంత్రి పదవి ప్రకటించి ఏడాది.. కానీ, పవన్ కళ్యాణే వెనకాడుతున్నారా ?
నాగబాబుకి మంత్రి పదవి ప్రకటించి ఏడాది.. కానీ, పవన్ కళ్యాణే వెనకాడుతున్నారా ?
Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
Advertisement

వీడియోలు

MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko | రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Starlink India Price: స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
Nagababu As Minister: నాగబాబుకి మంత్రి పదవి ప్రకటించి ఏడాది.. కానీ, పవన్ కళ్యాణే వెనకాడుతున్నారా ?
నాగబాబుకి మంత్రి పదవి ప్రకటించి ఏడాది.. కానీ, పవన్ కళ్యాణే వెనకాడుతున్నారా ?
Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
Actor Rajasekhar Injured: నటుడు రాజశేఖర్‌ కాలి సర్జరీ విజయవంతం! గత నెలలో షూటింగ్‌లో గాయపడ్డ యాంగ్రీస్టార్‌!
నటుడు రాజశేఖర్‌ కాలి సర్జరీ విజయవంతం! గత నెలలో షూటింగ్‌లో గాయపడ్డ యాంగ్రీస్టార్‌!
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
Embed widget