అన్వేషించండి

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!

కారు RCని మరో రాష్ట్రానికి బదిలీ చేయడం ఎలా? అవసరమైన పత్రాలు, ఫారం 28, 29, 30, ఎన్‌ఓసీ, ఆన్‌లైన్ విధానం, ఫీజులు & రహదారి పన్ను వివరాలు తెలుసుకోండి.

How to transfer RC online: మీరు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారుతున్నారా? లేదా మీ కారును వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి విక్రయించాలనుకుంటున్నారా? అలాంటప్పుడు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) బదిలీ ప్రక్రియ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా, మీరు మీ కారును వేరొక రాష్ట్రానికి తీసుకెళ్లి, అక్కడ ఎక్కువ కాలం కారును ఉపయోగించాలనుకుంటే రిజిస్ట్రేషన్ మార్పు అవసరం. ఈ ప్రక్రియ కోసం ఏ పత్రాలు కావాలి? ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా చేయాలి? ఫీజులు ఎంత చెల్లించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

RC బదిలీ ఎందుకు ముఖ్యం?

కారును అమ్మినప్పుడు కొత్త యజమాని పేరుపైకి రిజిస్ట్రేషన్‌ను మార్చాలి. అదే విధంగా మరో రాష్ట్రానికి వాహనాన్ని తరలించినప్పుడు అక్కడి రవాణా శాఖ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ మార్పు చేయాలి. బదిలీ ప్రక్రియను ఆలస్యం చేస్తే జరిమానాలు పడే అవకాశం ఉంది. అంతేకాదు, మీరు విక్రయించిన కారు ఇంకా మీ పేరుపైనే ఉంటే, ఆ వాహనం ప్రమాదంలో లేదా చట్టవిరుద్ధమైన పనిలో చిక్కుకున్నప్పుడు మీకే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

సాధారణంగా, ఒకే రాష్ట్రంలో యాజమాన్య బదిలీ కోసం, అమ్మకం జరిగిన 14 రోజుల్లో దరఖాస్తు చేయాలి. మరో రాష్ట్రంలో నమోదైన వాహనానికి యాజమాన్య బదిలీ కోసం 45 రోజుల్లో దరఖాస్తు చేయాలన్నది రూల్‌. రాష్ట్రాల నిబంధనలు మారవచ్చు కాబట్టి సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) వద్ద వివరాలు నిర్ధారించుకోవాలి.

ఏయే పత్రాలు అవసరం?

కారు ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం సాధారణంగా ఈ పత్రాలు అవసరమవుతాయి.

1. ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)
2. యాజమాన్య బదిలీ కోసం ఫారం 29, ఫారం 30
3. చెల్లుబాటులో ఉన్న బీమా పత్రం
4. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం (PUC)
5. కొనుగోలుదారుడి గుర్తింపు, చిరునామా రుజువులు
6. అవసరాన్ని బట్టి పాన్ కార్డు లేదా ఫారం 60
7. పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
8. అమ్మకపు ఒప్పందం లేదా వాహనం అప్పగించిన పత్రం
9. పన్నుల చెల్లింపు రుజువులు
10. రుసుము చెల్లించిన రసీదు
11. రుణం ఉంటే ఆర్థిక సంస్థ అనుమతి పత్రం
12. మరో రాష్ట్రానికి బదిలీ చేస్తే పాత RTO నుంచి నిరభ్యంతర పత్రం (NOC)

కొన్ని రాష్ట్రాల్లో వాహనం ఛాసిస్, ఇంజిన్ నంబర్ల పెన్సిల్‌ ప్రింట్లు లేదా వాహన తనిఖీ కూడా అవసరం కావచ్చు.

ఇది కూడా చదవండి: మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?

ఆన్‌లైన్‌లో RC బదిలీ ఎలా చేయాలి?

పరివాహన్ (Parivahan) అధికారిక వెబ్‌సైట్ ద్వారా చాలా రాష్ట్రాల్లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు.

మొదట పరివాహన్ వాహన సేవల విభాగంలోకి వెళ్లి, వాహనం రిజిస్టర్‌ అయిన రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. అనంతరం వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. ధ్రువీకరణ కోసం ఛాసిస్ నంబర్‌లోని చివరి ఐదు అంకెలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP అవసరం కావచ్చు.

తర్వాత, ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్వీస్‌ను ఎంచుకుని, కొనుగోలుదారుడి వివరాలు, అమ్మకం తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, చూపించిన ఫీజును చెల్లించాలి. దరఖాస్తు నంబర్, చెల్లింపు రసీదును భద్రపరచుకోవాలి.

రాష్ట్రాన్ని బట్టి ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, ఆన్‌లైన్ పరిశీలన లేదా ఆర్‌టీఓ కార్యాలయంలో ప్రత్యక్ష ధ్రువీకరణ అవసరమవుతుంది. దరఖాస్తు స్థితిని పరివాహన్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు. ఆమోదం తర్వాత డిజిలాకర్ లేదా ఎం-పరివాహన్‌లో నవీకరించిన RC అందుబాటులోకి రావచ్చు.

ఆఫ్‌లైన్‌లోనూ బదిలీ చేసుకోవచ్చు

ఆన్‌లైన్ ప్రక్రియ అందుబాటులో లేకపోతే సంబంధిత RTO కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. విక్రేత, కొనుగోలుదారుడు అవసరమైన ఫారాలపై సంతకాలు చేయాలి. అనంతరం అసలు RC, బీమా, PUC, గుర్తింపు పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఫీజు చెల్లించిన తర్వాత అధికారులు దరఖాస్తును పరిశీలిస్తారు. అవసరమైతే వాహనాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేయవచ్చు. పత్రాలు సమర్పించినప్పుడు రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు.

ఇది కూడా చదవండి: Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?

మరో రాష్ట్రానికి మారితే NOC తప్పనిసరా?

మరో రాష్ట్రానికి వాహనాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసేటప్పుడు పాత RTO నుంచి నిరభ్యంతర పత్రం (NOC) అవసరమవుతుంది. దీనికోసం ఫారం 28 ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌లో లేదా RTO కార్యాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

అయితే పెండింగ్ చలాన్లు, చెల్లించని టోల్ బకాయిలు, వాహన పన్నులు ఉంటే NOC పొందడంలో ఇబ్బందులు రావచ్చు. అందువల్ల ముందుగా అన్ని బకాయిలను చెల్లించాలి. జారీ చేసిన NOC సాధారణంగా ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది.

మీ వాహనాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడ 12 నెలలకు మించి నడపాలంటే కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ కోసం దరఖాస్తు చేయాల్సి రావచ్చు. కొత్త రాష్ట్రంలో రహదారి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత రాష్ట్రంలో చెల్లించిన పన్ను వాపసు పొందే ప్రక్రియ మాత్రం వేరుగా ఉంటుంది. దీనికి సంబంధిత రాష్ట్ర నిబంధనలు వర్తిస్తాయి.

కారు రుణంపై ఉంటే ఏం చేయాలి?

కారుపై బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ రుణం కొనసాగుతుంటే, RCలో హైపొథికేషన్ వివరాలు ఉన్నాయో, లేదో చూడాలి. రుణం పూర్తిగా చెల్లించాలి లేదా ఆర్థిక సంస్థ నుంచి అవసరమైన అనుమతి పొందాలి. రుణం ముగిసిన తర్వాత సంస్థ నుంచి బకాయిలు లేవనే ధ్రువపత్రం తీసుకుని, ఫారం 35 ద్వారా RCలోని రుణ వివరాలను తొలగించుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో రుణ వివరాల తొలగింపు, యాజమాన్య బదిలీ ప్రక్రియలను కలిపి దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది.

RC బదిలీ ఫీజు ఎంత?

RC బదిలీ రుసుము వాహనం రకం, రాష్ట్రం, స్మార్ట్ కార్డు ఛార్జీలు, పోస్టల్ ఛార్జీలు, ఇతర సేవలను బట్టి మారుతుంది. కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం, సాధారణ రిజిస్ట్రేషన్ ఫీజులో సగం మొత్తం బదిలీ రుసుముగా ఉండవచ్చు. ఉదాహరణకు, ద్విచక్ర వాహనానికి రూ.150, ప్రైవేట్ కారుకు రూ.300 కావచ్చు.

దరఖాస్తు ఆలస్యమైతే ద్విచక్ర వాహనాలకు నెలకు రూ.300, కార్లకు నెలకు రూ.500 చొప్పున లేట్‌ ఫీజ్‌ విధించే అవకాశం ఉంది. అయితే, ఈ నిబంధన అన్ని రాష్ట్రాల్లో ఒకేలా వర్తించకపోవచ్చు. మరో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మార్పు చేసేటప్పుడు రహదారి పన్ను అదనంగా చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు పరివాహన్ పోర్టల్‌లో లేదా సంబంధిత RTO వద్ద తాజా ఫీజులను నిర్ధారించుకోవాలి.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

RC బదిలీ పూర్తయిన తర్వాత వాహన బీమాను కూడా కొత్త యజమాని పేరుపై మార్చాలి. RC మారినంత మాత్రాన బీమా స్వయంగా బదిలీ కాదు. బీమా సంస్థను సంప్రదించి యాజమాన్య మార్పును పూర్తి చేయాలి. విక్రేతకు చెందిన నో క్లెయిమ్ బోనస్ (NCB) సాధారణంగా విక్రేతకే చెందుతుంది. అర్హత ఉంటే దాన్ని మరో వాహనానికి ఉపయోగించుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget