Honda Cars: హోండా కార్లపై భారీ డిస్కౌంట్‌లు - ఎంత తగ్గనుందో తెలుసా?
Honda Offers: ప్రస్తుతం మనదేశంలో హోండా కార్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Honda Motors: హోండా డీలర్‌షిప్‌లు తమ మొత్తం లైనప్‌పై ఏప్రిల్‌లో ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో ఒకసారి చూద్దాం.
హోండా అమేజ్‌పై తగ్గింపు
హోండా అమేజ్ ఈ నెలలో అతిపెద్ద తగ్గింపును పొందుతోంది. దాని ఎలైట్ ఎడిషన్ రూ. 83,000 వరకు ప్రయోజనాలను పొందుతోంది. ఇందులో రూ. 30,000 స్పెషల్ ఎడిషన్ ప్రయోజనాలు, రూ. 20,000 ప్రత్యేక కార్పొరేట్ స్కీమ్ తగ్గింపు, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 బోనస్, రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్ కూడా చేర్చారు.
అమేజ్ ఎస్, వీఎక్స్ ట్రిమ్‌పై రూ. 53,000 వరకు విలువైన ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎంట్రీ లెవల్ ఈ వేరియంట్‌పై రూ. 43,000 వరకు తగ్గింపు లభిస్తుంది. హోండా ఇటీవల అమేజ్ లైనప్‌ను కేవలం రెండు ట్రిమ్ స్థాయిలకు పరిమితం చేసింది. అంటే స్టాక్ క్లియరెన్స్ కోసం ఈ తగ్గింపు ఇస్తున్నారు. రాబోయే నెలల్లో హోండా అమేజ్‌కు జనరేషన్ అప్‌డేట్‌ను అందిస్తున్నారు.
హోండా సిటీపై కూడా...
హోండా సిటీ ఎలిగెంట్ వేరియంట్‌పై రూ. 71,500 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 4,000 లాయల్టీ బోనస్, రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 6,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు అందించనున్నారు. దీని ZX వేరియంట్‌పై రూ. 45,000 వరకు తగ్గింపు ఉంది. ఇతర వేరియంట్‌లపై రూ. 35,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే హోండా సిటీ హైబ్రిడ్‌ను రూ. 65,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
హోండా ఎలివేట్‌పై ఎంత ఆఫర్
ఈ నెలలో ఎలివేట్ ఎస్‌యూవీపై రూ. 19,000 డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 4,000 లాయల్టీ బోనస్, అన్ని వేరియంట్‌లపై రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. హోండా సిటీ లాగానే ఈ ఎస్‌యూవీ 121 హెచ్‌పీ, 1.5 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందించారు. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్‌తో ఎంపికగా కొనుగోలు చేయవచ్చు. హోండా ఇటీవల భారతదేశంలోని సిటీ, ఎలివేట్‌లను అన్ని ట్రిమ్‌లకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో అప్‌డేట్ చేసింది. అయితే మొత్తం ఐదు సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్‌లు అన్ని హోండా కార్లలో ప్రామాణికంగా వస్తాయి.
మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగలడం దాదాపుగా ఖాయం అయింది. ఇందుకోసం కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు చేతులు కలిపనున్నాయి. చైనీస్ కార్ల కంటే చవకైన, బెటర్ కార్లను మార్కెట్లోకి తీసుకురావడమే ఈ కంపెనీల లక్ష్యం. హోండా, నిస్సాన్ కంపెనీలు కూడా దీని కోసం చేతులు కలుపుతున్నాయి. జపాన్‌కు చెందిన నిస్సాన్, హోండా కంపెనీలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తద్వారా మార్కెట్లో చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డుకట్ట వేయనున్నారు. కార్ల తయారీ వ్యయాన్ని తగ్గించడం ఈ కంపెనీలు కలిసి పని చేయడం వెనక ప్రధాన ఉద్దేశ్యం. దీని ద్వారా మరింత చవకైన కార్లు మార్కెట్లో విడుదల అవుతాయి.
Also Read: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!