అన్వేషించండి

₹1.80 లక్షల రేంజ్‌లో Hero Xtreme 250R - ఎందుకు కొనాలి, ఎందుకు వద్దు?, ఆలోచించాల్సిన 4 పాయింట్లు

Hero Xtreme 250R ప్రస్తుతం Hero ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌. దీనిని కొనడానికి 2 కారణాలు, దూరంగా ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ధర, ఫీచర్లు, ఇంజిన్‌ ఫీల్‌, బిల్డ్‌ క్వాలిటీ వివరాలు తెలుసుకోండి.

Hero Xtreme 250R Price, Mileage And Features In Telugu: హీరో మోటోకార్ప్‌ నుంచి వచ్చిన తాజా ఫ్లాగ్‌షిప్‌ బైక్‌ - Hero Xtreme 250R. 250cc ఇంజిన్‌తో వచ్చిన ఈ మోడల్, ఒరిజినల్‌ Karizma XMR 210cc ఇంజిన్‌కి అప్‌డేటెడ్‌ వెర్షన్. ధర విషయంలో ఈ బండి చాలా ఆకర్షణీయంగా ఉన్నా, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఈ బైక్ కొనడానికి 2 కారణాలు, అలాగే దూరంగా ఉండడానికి 2 కారణాలు చూద్దాం.

కొనడానికి 2 కారణాలు

1. మంచి విలువ (Good Value)
Hero Xtreme 250R ధర రూ. 1.80 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇది.. Suzuki Gixxer 250 (రూ. 1.98 - 2.17 లక్షలు), KTM 250 Duke (రూ. 2.28 లక్షలు) కంటే తక్కువ. ఫీచర్లు బేసిక్‌గా ఉన్నా (LCD డిస్‌ప్లే, డ్యూయల్ ఛానల్ ABS, LED లైట్స్), ధర పరంగా మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు.

విజయవాడలో Hero Xtreme 250R ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 2.15 లక్షలు. ఇందులో, దాదాపు రూ. 23,000 RTO ఛార్జీలు, దాదాపు రూ. 12,000 బీమా, ఇతర ఖర్చులు కూడా కలిసి ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 2.20 లక్షలు. ఇక్కడ RTO ఛార్జీలు దాదాపు రూ. 29,000, బీమా దాదాపు రూ. 12,000 అవుతుంది.

2. కాన్ఫిడెంట్ హ్యాండ్లింగ్ (Confident Handling)
హీరో చిన్న బైక్స్‌ (125cc, 160cc) ఎక్కువగా కమ్యూటర్‌ లుక్‌ ఇస్తాయి. కానీ 250R మాత్రం నిజమైన స్పోర్ట్ బైక్‌ ఫీలింగ్ ఇస్తుంది. దీని సస్పెన్షన్ సెటప్ కాస్త హార్డ్‌గా ఉన్నా, హైవేలో రైడ్ చేస్తే కంఫర్టబుల్‌గా, స్టేబుల్‌గా ఫీలవుతారు. ఎర్గోనామిక్స్ కూడా కంఫర్టబుల్‌గా ఉండటంతో కంట్రోల్ బావుంటుంది.

దూరంగా ఉండడానికి 2 కారణాలు

1. ఇంజిన్ రిఫైన్‌మెంట్ లోపం (Engine Refinement Issues)
హీరో ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత శక్తిమంతమైన రోడ్ ఇంజిన్ ఇదే అయినప్పటికీ, రిఫైన్‌మెంట్ పూర్తిగా పక్కాగా లేదు. హ్యాండిల్‌బార్‌, సీటు, ట్యాంక్‌, ఫుట్‌పెగ్‌ల వద్ద వైబ్రేషన్స్‌ కనిపిస్తాయి. దీర్ఘకాలిక రైడ్‌లో ఇది అసౌకర్యంగా మారుతుంది.         

2. ఫినిషింగ్‌ లోపం (Inconsistent Finish)
డిజైన్ మస్క్యులర్‌గా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో ఓవర్‌ స్టైలింగ్‌లా కనిపిస్తుంది. ముఖ్యంగా హెడ్‌స్టాక్ దగ్గర వదులుగా ఉన్న వెల్డ్స్ కంటికి నచ్చదు. ఫ్రేమ్‌ ఫినిషింగ్ కూడా కొన్ని చోట్ల రఫ్‌గా ఉంటుంది. స్విచ్‌ గేర్‌ టచ్‌ పాయింట్స్ మాత్రం బాగానే ఉన్నాయి.         

ఫైనల్‌గా...
Hero Xtreme 250R ధర పరంగా మంచి ఆప్షన్‌. స్పోర్టీ హ్యాండ్లింగ్‌ ఇష్టపడేవారికి ఇది సూట్ అవుతుంది. కానీ రిఫైన్‌మెంట్‌, బిల్డ్ క్వాలిటీ ఇష్యూలు ఉన్నందున, సరైన ప్రీమియం బైక్‌లా అనిపించదు. మీరు బడ్జెట్‌లో 250cc బైక్ కోరుకుంటే ఇది "పర్లేదు" అనుకునే ఆప్షన్‌. కానీ, కచ్చితమైన ప్రీమియం ఫీలింగ్ కావాలంటే మాత్రం Suzuki లేదా KTM బైకుల వైపు చూడాలి.        

టాప్ హెడ్ లైన్స్

రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
గత నెల రోజుల్లో మిడిల్‌క్లాస్‌ వాళ్లు ఎక్కువగా కొన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే
కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే
గుడ్‌న్యూస్‌ బాసూ! టాటా EVలపై భారీ ఆఫర్లు.. కర్వ్‌ కొంటే ఏకంగా రూ.3.35 లక్షల బెనిఫిట్!
మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!
మీరు బ్రేక్ వేయకముందే మీ కారు అలర్ట్.. భారత్‌లోకి వస్తున్న V2V సేఫ్టీ సిస్టమ్ ఇదే!
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Embed widget