Hero Splendor Plus vs Bajaj Platina 100 - GST తగ్గింపు తర్వాత ఏ బండి చౌక?
Hero Splendor Plus vs Bajaj Platina 100: మీరు దసరా నాటికి ఈ రెండు బైక్‌లలో ఏదైనా కొనాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా GST ట్రిమ్మింగ్ గురించి తెలుసుకోవడం ముఖ్యం.

Hero Splendor Plus vs Bajaj Platina 100 Price Comparison: మన మార్కెట్లో, పేద & దిగువ మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండే కమ్యూటర్ బైక్‌ల గురించి మాట్లాడాల్సి వస్తే , హీరో స్ల్పెండర్ ప్లస్ & బజాజ్ ప్లాటినా పేర్లను మనం మరిచిపోము. కొత్త GST రేట్లు 2025 (GST Reforms 2025) తర్వాత, ఈ రెండు బైక్‌లు మునుపటి కంటే మరింత చవకగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై GST రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది, ఇది 22 సెప్టెంబర్ 2025 నుంచి, అంటే వచ్చే సోమవారం నుంచే అమలులోకి వస్తుంది. GST శ్లాబ్ తగ్గించిన తర్వాత, హీరో స్ల్పెండర్ ప్లస్ లేదా బజాజ్ ప్లాటినా లో ఏది కొనుగోలు చేయడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
ఏ బైక్ కొనడం ఆర్థికంగా కలిసివస్తుంది?
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో, హీరో స్ల్పెండర్ ప్లస్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర 80,216 రూపాయలు. GST తగ్గింపు తర్వాత (18 శాతం జీఎస్టీ వర్తింపుతో), ఈ బైక్ కొత్త ధర దాదాపు 73,910 రూపాయలు (Hero Splendor Plus ex-showroom price, Hyderabad Vijayawada) అవుతుంది. ఈ విధంగా, ఈ మోటర్ సైకిల్ కొన్నవాళ్లకు రూ. 6,300 వరకు తగ్గుతుంది.
బజాజ్ ప్లాటినా 100 దగ్గరకు వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ బండి ఎక్స్-షోరూమ్ ధర 70,643 రూపాయలు. GST తగ్గింపు తర్వాత ఈ ధర దాదాపు రూ. 63,620 (Bajaj Platina 100 ex-showroom price, Hyderabad Vijayawada) అవుతుంది. ఈ విధంగా, ఈ బైక్ ధర దాదాపు రూ. 7,000 తగ్గుతుంది.
హీరో స్ల్పెండర్ vs బజాజ్ ప్లాటినా: ఫీచర్లు
హీరో స్ల్పెండర్ ప్లస్‌లో i3S ఫ్యూయల్ సేవింగ్ టెక్నాలజీ, ట్యూబ్‌లెస్ టైర్లు, ముందు-వెనుక డ్రమ్ బ్రేక్‌లు, స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ రోడ్ షాక్స్, ఎలక్ట్రిక్ స్టార్ట్ వంటి ఫీచర్లు (Hero Splendor Plus Features) అందించారు. ఈ బండికి 9.8 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. మీరు ఈ కమ్యూటర్ బైక్‌ను నలుపు, ఎరుపు, వెండి వంటి రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
బజాజ్ ప్లాటినా బైక్‌కు 11 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది & బండి బరువు 117 కిలోల బరువు ఉంటుంది. ప్లాటినాలో DRL, స్పీడోమీటర్, ఇంధన గేజ్, టాకోమీటర్, యాంటీ -స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ & 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు (Bajaj Platina 100 Features) ఉన్నాయి.
ఏ బైక్ కొంటే ఎక్కువ డబ్బు మిగులుతుంది?
GST తగ్గింపు తర్వాత, బజాజ్ ప్లాటినా 100 ధర హీరో స్ల్పెండర్ ప్లస్ కంటే తక్కువగా ఉంటుంది, ఇది అందుబాటు ధరలోని ఆప్షన్‌గా మారుతుంది. అయితే, ఫీచర్లను కూడా పరిగణనలోకి తీసుకుని, మీ అవసరాలు & బడ్జెట్ ప్రకారం బైక్‌ను ఎంచుకోవచ్చు.





















