అన్వేషించండి

Cheapest Cars 2025: GST తగ్గింపు తర్వాత టాప్ 5 బడ్జెట్ కార్లు ఇవే - Maruti S-Presso టాప్‌

New GST Rates On Cars: మారుతి S-ప్రెస్సో ఇప్పుడు భారతదేశంలో అత్యంత తక్కువ ధర కారుగా మారింది. మరికొన్ని కార్లు కూడా తక్కువ ధరలకు మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Best Budget Cars India After New GST Rates 2025: దసరా నవరాత్రుల మొదటి రోజు అయిన ఈ రోజు (సెప్టెంబర్ 22, 2025) నుంచి దేశవ్యాప్తంగా కొత్త GST శ్లాబులు అమలులోకి వచ్చాయి. దీంతో, కార్ల రేట్లు గణనీయమైన తగ్గింపులను చూస్తున్నాయి. ఈ మార్పు కొత్త కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, దేశంలోని అత్యంత చవకైన కార్ల జాబితాను కూడా మార్చింది. ఇప్పుడు, భారతదేశంలో అత్యంత చవకైన కారు మారుతి ఆల్టో K10 కాదు, మారుతి S-ప్రెస్సో. దీని ధర కేవలం ₹3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ₹5 లక్షల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఐదు కార్ల (cars under Rs 5 lakh) గురించి తెలుసుకుందాం.

Maruti S-Presso - రూ. 3.49 లక్షల నుంచి ప్రారంభం
మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు దేశంలో అత్యంత తక్కువ ధరలో వచ్చే బడ్జెట్‌ కారు. గతంలో, దీని STD (O) వేరియంట్ ధర ₹4.26 లక్షలు ఉండగా, కొత్త GST తర్వాత, ఇప్పుడు ₹3.49 లక్షలకు తగ్గింది. అంటే, ఈ వేరియంట్‌ కొనే కస్టమర్లకు సుమారు ₹76,600 ప్రయోజనం లభిస్తుంది. చిన్న కార్లపై GST 28% నుంచి 18% కు దిగి రావడంతో, బడ్జెట్ విభాగంలో అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఒకటిగా ఎస్‌-ప్రెస్సో నిలిచింది.

Maruti Alto K10 
మారుతి ఆల్టో K10 ఒకప్పుడు భారతదేశంలో అత్యంత చౌకైన కారు, ఈ రోజు (సెప్టెంబర్ 22, 2025) నుంచి రెండో స్థానానికి పడిపోయింది. దీని STD (O) వేరియంట్ ధర ₹4.23 లక్షల నుంచి ₹3.69 లక్షలకు తగ్గింది, కస్టమర్లకు సుమారు ₹53,100 ఆదా అవుతుంది. ఆల్టో K10, అత్యంత తక్కువ ధర & నమ్మకమైన పనితీరుతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ అయింది.

Renault Kwid
రెనాల్ట్ క్విడ్ ఇప్పుడు దేశంలో మూడో అత్యంత అందుబాటు ధర కారు. గతంలో ₹4.69 లక్షలుగా ఉన్న 1.0 RXE వేరియంట్ ధర ఇప్పుడు ₹4.29 లక్షలకు దిగి వచ్చింది. ఇది సుమారు ₹40,000 తగ్గింపు. దీని SUV లాంటి స్టైలింగ్ & బడ్జెట్-ఫ్రెండ్లీ ధర దీనిని ఎంట్రీ-లెవల్ కస్టమర్లకు మంచి ఆప్షన్‌గా మార్చాయి.

Tata Tiago 
దేశంలోనే అత్యంత చవకైన కార్లలో టాటా టియాగో నాలుగోది. గతంలో, దీని XE వేరియంట్ ధర ₹4.99 లక్షలు ఉండేది, GST తగ్గింపు తర్వాత, ఇప్పుడు అది ₹4.57 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దీని అర్థం వినియోగదారులు సుమారు ₹42,500 ప్రయోజనం పొందుతారు. బలమైన నిర్మాణ నాణ్యత & స్టైలిష్ లుక్స్‌తో, టాటా టియాగో, ఈ ధర వద్ద డబ్బుకు తగిన విలువ కలిగిన కారు.

Maruti Celerio 
తెలుగు రాష్ట్రాల్లో, టాప్‌-5 చవకైన కార్ల జాబితాలో మారుతి సెలెరియో కూడా ఉంది. గతంలో ₹5.64 లక్షలుగా ఉన్న దీని LXI వేరియంట్ ధర ఇప్పుడు ₹4.69 లక్షలకు చేరింది. దీని అర్థం, కొత్త కస్టమర్‌కు సుమారు ₹94,100 ఆదా అవుతుంది. ఇది సుమారు 17% తగ్గింపును సూచిస్తుంది, సెలెరియోను మరింత బడ్జెట్‌-ఫ్రెండ్లీ ఎంపికగా చేస్తుంది.

తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కొనాలని చూస్తున్నవాళ్ల ఎదురు చూపులు ముగిశాయి, ఇప్పుడు సరైన సమయం వచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget