అన్వేషించండి

Evolution of India’s Automotive Aftermarket: మారుతున్న ఆటోమొబైల్ రంగం.. ఆఫ్టర్‌మార్కెట్ యాక్సెసరీలకు పెరిగిన క్రేజ్! 2030 నాటికి రూ. 1.55 లక్షల కోట్ల మార్కెట్!

భారత ఆటోమొబైల్ రంగం వేగంగా మారుతోంది. వాహనాల రక్షణ, కనెక్టివిటీ కోసం కస్టమర్లు ఇప్పుడు స్మార్ట్ యాక్సెసరీలపై మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఆఫ్టర్‌మార్కెట్ ఆదాయం భారీగా పెరగనుంది.

Evolution of India’s Automotive Aftermarket News: ఇండియ‌న్ ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ఒక కీలకమైన మ‌లుపు దశలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో ఒకటిగా ఉన్న మన దేశంలో వాహనాల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో డిజిటల్ టెక్నాలజీ వాడకం, రోడ్డు భద్రతపై అవగాహన కూడా తోడయ్యాయి. ఇక్రా (ICRA) నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 99,500 కోట్లుగా ఉన్న ఆటోమొబైల్ ఆఫ్టర్‌మార్కెట్ ఆదాయం, 2030 నాటికి దాదాపు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ గణాంకాలను బట్టి ఈ రంగంలో ఉన్న అవకాశాలు, పొటెన్షియల్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. వాహనాలను కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లే సాధనంగా మాత్రమే కాకుండా, ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ లాగా కస్టమర్లు చూస్తున్నారు.

కనెక్టివిటీ - స్మార్ట్ కంట్రోల్..
 తమ కారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తమ కంట్రోల్ లో ఉండాలని వినియోగ‌దారులు కోరుకుంటున్నారు. ఇందుకోసం కనెక్టివిటీ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ ట్రాకర్లు, రిమోట్ వెహికల్ మేనేజ్‌మెంట్ వంటి యాక్సెసరీలకు డిమాండ్ పెరిగింది. ఈ టెక్నాలజీ వల్ల కారు యజమానులు తమ వాహనం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందుతున్నారు. ఇది ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా, ఓనర్షిప్ ఎక్స్ పీరియన్స్ ను కొత్త స్థాయికి తీసుకెళ్తోంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

భద్రతకు పెద్ద పీట..
ట్రాఫిక్ పెరగడం, మారుతున్న డ్రైవింగ్ పరిస్థితుల వల్ల భద్రత అనేది ఇప్పుడు ప్రాధాన్యత అంశంగా మారింది. ప్రివెంటివ్ సేఫ్టీ కోసం కస్టమర్లు వెనకాడటం లేదు. రియర్ వ్యూ కెమెరాలు, డాష్ కామ్ కెమేరాలు, పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్స్ (TPMS) వంటి వాటిని బడ్జెట్ కార్లలో కూడా అమర్చుకుంటున్నారు. ఆఫ్టర్‌మార్కెట్ విభాగంలో ఇవి తక్కువ ధరకే అందుబాటు లోకి రావడం వల్ల సాధారణ వాహన దారులు కూడా వీటిని సులభంగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి ప్రమాదాల ముప్పును తగ్గించి డ్రైవర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

పర్సనలైజేషన్ - ఫ్యూచర్ టెక్నాలజీ..
కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా, తమ వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా వాహనం ఉండాలని నేటి తరం కోరుకుంటోంది. అందుకే స్టైల్, కనెక్టివిటీ, సేఫ్టీ అన్నీ కలిసిన ప్రీమియం ఆఫ్టర్‌మార్కెట్ ప్రొడక్ట్స్ కు ఆదరణ పెరుగుతోంది. అడాప్టివ్ లైటింగ్ సిస్టమ్స్, కారు మెయింటెనెన్స్ అవసరాలను ముందే గుర్తు చేసే స్మార్ట్ యాక్సెసరీలు కస్టమర్ల మనసు గెలుచుకుంటున్నాయి. ఇవి వాహనం లైఫ్ పెంచడమే కాకుండా, నిర్వహణ ఖర్చును తగ్గిస్తాయి. ఐఓటీ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ఆఫ్టర్‌మార్కెట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.

భవిష్యత్తులో నమ్మకమైన, సులభంగా దొరికే స్మార్ట్ సొల్యూషన్స్ అందించే కంపెనీలదే ఈ మార్కెట్ లో పైచేయి కానుంది. ఇది ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే కాదు, భారత మొబిలిటీ రంగంలో వస్తున్న ఒక నిర్మాణాత్మక మార్పుగా విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Seltos Modification: పాత సెల్టోస్‌కు కొత్త రూపు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పాత సెల్టోస్‌కు కొత్త రూపు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది?
కొత్త Toyota Hiluxలో వచ్చిన మార్పులేంటి? పాత మోడల్‌తో పోలిస్తే కీలక తేడాలు ఇవే
2026 టయోటా హైలక్స్‌ vs పాత హైలక్స్‌.. డిజైన్‌ నుంచి ఫీచర్ల వరకు పూర్తిగా మారిందా?
2026 Tata Punch EV కి 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో టాప్‌ మార్కులు
ప్రయాణీకుల భద్రతలో మరోసారి టాటా పంచ్‌ EV సత్తా.. భారత్ NCAPలో 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌
E20 Petrol Effect on BS3 Vehicles: మీది E20 పెట్రోల్‌కు అనుకూలమైన వాహనమేనా? ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి?
మీది E20 పెట్రోల్‌కు అనుకూలమైన వాహనమేనా? ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget