అన్వేషించండి

India Heatwave Alert: నిప్పుల కొలిమిలా వేస‌వి.. 45 డిగ్రీల భానుడి భగభగ! టూ-వీలర్ రైడర్లకు ఐఎండీ కీలక సూచనలు!

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. శనివారం ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ, వాహనదారులు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

IMD Issues Safety Advisory for Riders: ఇండియాలో ప్రస్తుతం తీవ్రమైన ఎండల ప్రభావంతో అల్లాడిపోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా రాష్ట్రాలకు హీట్‌వేవ్ (Heatwave) హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడం, పొడి గాలుల తీవ్రత ఎక్కువవడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా రోజూ ఆఫీసులకు వెళ్లేవారు, టూ-వీలర్లపై ప్రయాణించే వారు హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం  ఢిల్లీలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

రాష్ట్రాల వారీగా పరిస్థితి:
ఐఎండీ అధికారుల సమాచారం ప్రకారం.. దేశ‌వ్యాప్తంగా శనివారమంతా వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. ఉపరితల గాలులు గంటకు 15 నుండి 25 కిలోమీటర్ల వేగంతో వీస్తుండగా, ఒక్కోసారి గాలి వేగం 35 కిలోమీటర్లకు చేరుకుంటోంది. కేవలం ఢిల్లీలోనే కాకుండా  దేశంలోని కొన్ని ప్రాంతాల‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. అయితే ఆదివారం  నుండి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుతాయని వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

రైడర్లే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
ఎండలో ప్రయాణించే టూ-వీలర్ రైడర్లు నేరుగా సూర్యరశ్మికి గురవుతారు. ట్రాఫిక్ లో ఎక్కువ సేపు వేచి ఉండటం వల్ల బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. హెల్మెట్లు, ఇతర సేఫ్టీ గేర్లు ధరించడం తప్పనిసరి అయినప్పటికీ, అవి లోపల వేడిని ట్రాప్ చేస్తాయి. దీనివల్ల డీహైడ్రేషన్ లేదా హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రయాణంలోనే అస్వస్థతకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది.

వడదెబ్బ నుండి రక్షణ కోసం  టిప్స్:

హైడ్రేటెడ్ గా ఉండండి: దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. ప్రయాణంలో వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవడం మంచిది. కేవలం నీళ్లే కాకుండా కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వల్ల బాడీలో ఎనర్జీ లెవల్స్ మెరుగ్గా ఉంటాయి.

సరైన గేర్ ఎంచుకోండి: ఎండలో ప్రయాణించేటప్పుడు బ్రీతబుల్ (Breathable) మెష్ జాకెట్లు, గాలి ఆడే హెల్మెట్లను వాడాలి. ఇవి గాలి లోపలికి వెళ్లేలా చేసి శరీరాన్ని చల్లబరుస్తాయి.

రద్దీ సమయాలను నివారించండి: వీలైనంత వరకు మధ్యాహ్నం ఎండలో ప్రయాణాలు చేయవద్దు. పనులను తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

విరామం తీసుకోండి: లాంగ్ జర్నీలు చేసేటప్పుడు మధ్యమధ్యలో నీడ ఉన్న చోట ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. దీనివల్ల శరీరం సేద తీరుతుంది.

లక్షణాలను గమనించండి: తల తిరగడం, తలనొప్పి, విపరీతంగా చెమటలు పట్టడం లేదా వాంతులు వచ్చేలా అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే నీడలోకి వెళ్లి డాక్టర్ సలహా తీసుకోవాలి.

ప్రయాణికులకు అడ్వైజరీ..
అవసరం లేని పనుల కోసం మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించడం, సన్ గ్లాసెస్ వాడటం, సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఎండ ప్రభావం నుండి కొంత వరకు తప్పించుకోవచ్చు. వాతావరణ మార్పుల దృష్ట్యా తదుపరి వర్షాలు కురిసే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి.

టాప్ హెడ్ లైన్స్

7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
మీ దగ్గర 1.82 లక్షలు ఉంటే చాలు, టాటా పంచ్ EV ని కొనేయొచ్చు! వడ్డీ రేట్లు, EMI పూర్తి లెక్కలు ఇవిగో!
కొత్త Tata Punch EV కొనడానికి లోన్‌ ఎంత ఇస్తారు? తక్కువ EMI కోసం ఎన్నేళ్ల టెన్యూర్‌ ఎంచుకోవాలి?
2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?
ఫుల్‌ ఛార్జ్‌తో టాటా పంచ్ EV నిజంగా ఎంతదూరం ప్రయాణిస్తుందో తెలుసా? అసలైన రేంజ్ ఇదే!
రూ.1.10 లక్షల ధరతో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!
బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్‌కు పోటీగా కొత్త 'సింపుల్‌ వేవ్‌'.. రూ.1.10 లక్షలకే 243km రేంజ్!

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Vijayawada News: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విషాదం.. దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విషాదం.. దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి
Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
AP SGST Growth: వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
ODI Series Talks: సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
Yash Allu Aravind : అల్లు అరవింద్ Vs యశ్ మదర్ కాంట్రవర్సీ - అసలు రీజన్ ఏంటంటే?
అల్లు అరవింద్ Vs యశ్ మదర్ కాంట్రవర్సీ - అసలు రీజన్ ఏంటంటే?
Embed widget