అన్వేషించండి

Car Maintenance Tips: మీ కారు లక్ష కిలోమీటర్లు దాటిందా? ఇంజిన్ లైఫ్ పెంచడానికి ఈ మెయింటెనెన్స్ టిప్స్ తప్పనిసరి!

లక్ష కిలోమీటర్లు తిరిగిన కార్లు సరైన సర్వీసింగ్, ఇంజిన్ కేర్ తో మరో లక్ష కిలోమీటర్లు సునాయాసంగా తిరుగుతాయి. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

Car Maintenance After 1 Lakh KM: చాలామంది తమ కారు ఓడోమీటర్ మీద ఒక లక్ష కిలోమీటర్ల మార్కు కనిపిస్తే చాలు, ఇక ఆ కారు పని అయిపోయిందని భావిస్తుంటారు. వెంటనే దాన్ని అమ్మేసి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తారు. అయితే, ప్రస్తుత టెక్నాలజీతో తయారవుతున్న ఆధునిక కార్లు సరైన నిర్వహణ ఉంటే 2 లక్షల కిలోమీటర్ల వరకు చాలా సులభంగా ప్రయాణిస్తాయి. మన దేశంలోని విపరీతమైన ట్రాఫిక్, గుంతల రోడ్లు, తీవ్రమైన ఎండలను తట్టుకుని కారు ఎక్కువ కాలం మన్నాలంటే కొన్ని కీలక మార్పులు అవసరం. లక్ష కిలోమీటర్లు అనేది కారు ప్రయాణానికి ముగింపు కాదు, అదొక కొత్త దశ మాత్రమే. ఈ సమయంలో కారులోని ముఖ్యమైన భాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా భారీ ఖర్చులను తప్పించుకోవచ్చు.

ఇంజిన్, కూలింగ్ సిస్టమ్ భద్రత..
కారుకు గుండెకాయ వంటి ఇంజిన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. నాణ్యమైన ఇంజిన్ ఆయిల్ వాడటం, సరైన సమయంలో దాన్ని మార్చడం వల్ల పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఆయిల్ ఫిల్టర్ మార్చడం కూడా అంతే ముఖ్యం. అలాగే ఇంజిన్ ఓవర్ హీట్ కాకుండా చూసుకునే కూలింగ్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. రేడియేటర్, హోస్ పైపులు, వాటర్ పంప్ వంటివి లీక్ అవుతున్నాయేమో చూసుకోవాలి. కూలెంట్ లెవల్స్ తగ్గకుండా జాగ్రత్త పడితే ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది.

సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్..
మన దేశంలోని రోడ్ల మీద లక్ష కిలోమీటర్లు తిరిగిన కారు సస్పెన్షన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. షాక్ అబ్జార్బర్లు, బుషింగ్స్, లింక్ రాడ్లు అరిగిపోవడం వల్ల ప్రయాణం సౌకర్యవంతంగా ఉండదు. వీటిని చెక్ చేయించి అవసరమైతే మార్చాలి. అలాగే మాన్యువల్ కార్లలో క్లచ్ ప్లేట్లు, ఆటోమేటిక్ కార్లలో ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ మార్చడం వల్ల గేర్ షిఫ్టింగ్ స్మూత్ గా ఉంటుంది. బ్రేక్ ప్యాడ్లు, డిస్కులు అరిగిపోతే శబ్దాలు రావడం లేదా వైబ్రేషన్లు రావడం జరుగుతుంది. బ్రేక్ ఫ్లూయిడ్ మార్చడం ద్వారా సేఫ్టీని నిర్ధారించుకోవచ్చు.

టైర్లు, బ్యాటరీ మెయింటెనెన్స్..
కారు టైర్లు అరిగిపోతే వెంటనే మార్చడం మంచిది. సరైన టైర్ ప్రెజర్ మెయింటెయిన్ చేయడం, వీల్ అలైన్‌మెంట్, బ్యాలెన్సింగ్ చేయించడం వల్ల ఇతర భాగాలపై ఒత్తిడి తగ్గుతుంది. కారు బ్యాటరీ సాధారణంగా మూడు నుండి ఐదేళ్ల వరకు మాత్రమే పనిచేస్తుంది. బ్యాటరీ హెల్త్, ఎలక్ట్రికల్ కనెక్షన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇంధన వ్యవస్థ (Fuel System) కూడా క్లీన్ చేయించాలి. సిటీలో ఎక్కువగా తిరిగే కార్ల ఇంజెక్టర్లలో మురికి పేరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. మంచి క్వాలిటీ ఇంధనం వాడటం ద్వారా మైలేజీని కాపాడుకోవచ్చు.

డ్రైవింగ్ అలవాట్లు ..
కారు ఎక్కువ కాలం మన్నాలంటే డ్రైవింగ్ పద్ధతిలో కూడా మార్పులు రావాలి. సడన్ గా యాక్సిలరేషన్ ఇవ్వడం, ఒక్కసారిగా బ్రేకులు వేయడం, కారు సామర్థ్యం కంటే ఎక్కువ లోడ్ వేయడం వంటివి చేయకూడదు. కారు లోపల, బయట శుభ్రంగా ఉంచుకోవాలి. ఎండ నుండి రక్షణకు సన్‌షేడ్స్ వాడటం, బాడీ పాలిషింగ్ చేయించడం వల్ల కారు కొత్తదానిలా మెరుస్తుంది. కారు నుండి ఏదైనా వింత శబ్దం వచ్చినా లేదా నడపడంలో మార్పు అనిపించినా వెంటనే మెకానిక్ ను సంప్రదించాలి. లక్ష కిలోమీటర్లు దాటిన కారును కేవలం ఒక యంత్రంలా కాకుండా, ప్రాణప్రదంగా చూసుకుంటే అది మీకు మరిన్ని ఏళ్లపాటు తోడుగా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget