అన్వేషించండి

2026 Tata Punch EV కి 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో టాప్‌ మార్కులు

2026 Tata Punch EV ఫేస్‌లిఫ్ట్‌ భారత్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో అడల్ట్‌ & చైల్డ్‌ ఆక్యుపెంట్‌ రక్షణలో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. స్కోర్లు, సేఫ్టీ ఫీచర్లు & పరీక్ష వివరాలు తెలుసుకోండి.

Tata Punch EV Price, Range And Features Telugu: మన మార్కెట్లో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్‌ SUVలలో ఒకటిగా పేరొందిన Tata Punch EV మరోసారి తన భద్రతా ప్రమాణాలను నిరూపించుకుంది. 2026 Tata Punch EV ఫేస్‌లిఫ్ట్‌, తాజాగా నిర్వహించిన భారత్ NCAP క్రాష్‌ టెస్ట్‌లలో అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (AOP) & చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (COP) విభాగాల్లో 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ సొంతం చేసుకుంది. దీంతో, కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులకు ఈ ఎలక్ట్రిక్‌ SUV మరింత ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది.

32 మార్కులకు 31.09 మార్కులు
భారత్ NCAP విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026 Tata Punch EV అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో మొత్తం 32 మార్కులకు 31.09 మార్కులు సాధించింది. చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో 49 మార్కులకు గాను 45 మార్కులు దక్కించుకుంది. ఇదే మోడల్‌ను భారత్ NCAP పరీక్షించడం ఇది రెండోసారి కావడం విశేషం. 2024లో పరీక్షించిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ AOPలో 31.46 మార్కులు సాధించగా, తాజా వెర్షన్‌కు 31.09 మార్కులు వచ్చాయి. అంటే అడల్ట్‌ రక్షణ స్కోర్‌లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, చైల్డ్‌ ఆక్యుపెంట్‌ స్కోర్‌ మాత్రం యథాతథంగా కొనసాగింది.

అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ పరీక్షలో డ్రైవర్‌ & ముందు ప్రయాణికుడి తల, మెడ భాగాలకు మంచి రక్షణ లభించిందని నివేదిక పేర్కొంది. డ్రైవర్‌ ఛాతీ & మోకాళ్ల భాగానికి, అలాగే ముందు ప్రయాణికుడి మోకాళ్లకు తగిన స్థాయిలో రక్షణ లభించినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: రూ.1.23 లక్షల నుంచే Avore EX ఎలక్ట్రిక్‌ బైక్‌.. 260km రేంజ్‌, 114km టాప్‌ స్పీడ్‌

ఫ్రంటల్‌ ఆఫ్‌సెట్‌ డిఫార్మబుల్‌ బ్యారియర్‌ పరీక్షలో Punch EV 16 మార్కులకు గాను 15.28 మార్కులు సాధించింది. సైడ్‌ మూవబుల్‌ డిఫార్మబుల్‌ బ్యారియర్‌ పరీక్షలో 16 మార్కులకు గాను 15.80 మార్కులు సాధించి అత్యుత్తమ రక్షణను అందించింది. సైడ్‌ పోల్‌ ఇంపాక్ట్‌ పరీక్షలో "OK" రేటింగ్‌ను పొందింది. అలాగే ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC) పనితీరు పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

పిల్లల భద్రత
చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో Punch EV మొత్తం 49 మార్కులకు గాను 45 మార్కులు సాధించింది. ఇందులో డైనమిక్‌ పరీక్షలో 24కు 24 పూర్తి మార్కులు, Child Restraint System (CRS) ఇన్‌స్టాలేషన్‌ పరీక్షలో 12కు 12 పూర్తి మార్కులు సాధించింది. వెహికల్‌ అసెస్‌మెంట్‌లో 13కు 9 మార్కులు దక్కాయి. పరీక్షల్లో 18 నెలల & 3 సంవత్సరాల చిన్నారుల డమ్మీలను (బొమ్మలు) వెనుక వైపు తిరిగి ఉండే చైల్డ్‌ సీట్లలో కూర్చోబెట్టి పరీక్షించారు. ఈ సీట్లను ముందు ప్రయాణికుడి సీటులో Isofix యాంకరేజ్‌లు & సపోర్ట్‌ లెగ్‌తో బిగించారు.

భారత్ NCAP ఈ పరీక్షల కోసం Punch EV Adventure 40 & Empowered+ 40 వేరియంట్లను ఉపయోగించింది. అయితే ఈ 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ మొత్తం Punch EV శ్రేణికి వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?

సేఫ్టీ ఫీచర్లు
Tata Punch EVలో అన్ని వేరియంట్లలోనే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక సీట్లకు Isofix మౌంట్లు, అన్ని సీట్లకు 3-పాయింట్‌ సీట్‌బెల్ట్‌లు & సీట్‌బెల్ట్‌ రిమైండర్లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC) వంటి కీలక భద్రతా ఫీచర్లను ప్రామాణికంగా అందిస్తోంది. అలాగే ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ AIS-100 పాదచారుల భద్రతా ప్రమాణాలకు కూడా అనుగుణంగా ఉంది.

ప్రస్తుతం Tata Punch EV ధరలు రూ.9.69 లక్షల నుంచి రూ.12.79 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) వరకు ఉన్నాయి. ఒకసారి పూర్తి ఛార్జ్‌తో గరిష్టంగా 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ, ఇప్పుడు 5 స్టార్‌ భారత్ NCAP రేటింగ్‌తో భద్రత విషయంలో కూడా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. కుటుంబ వినియోగం కోసం సురక్షితమైన ఎలక్ట్రిక్‌ వాహనం కోసం ఎదురుచూస్తున్న వారికి Tata Punch EV మరింత బలమైన ఎంపికగా నిలవనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget