అన్వేషించండి

E20 పెట్రోల్ వల్ల కారు ఇంజిన్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చా ?

E20 Petrol Engine: E20 పెట్రోల్ అనేది 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం. అయితే ఈ పెట్రోల్ వాడితే ఇంజిన్ చెడిపోతే ఇన్సురెన్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • E20 పెట్రోల్ వాడకం పెరుగుతుండగా, పాత వాహనాలకు సమస్య.
  • E10 కోసం రూపొందించిన వాహనాల్లో E20 ఇంజిన్ దెబ్బతియ్యవచ్చు.
  • తప్పుడు ఇంధన వాడకం నిరూపితమైతే బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురి.
  • తయారీదారుల వారంటీ, బీమా నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించాలి.

E20 Petrol Engine: భారత్‌లో E20 పెట్రోల్ వాడకం పెరుగుతోంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోంది. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉండే ఈ ఇంధనాన్ని E20 పెట్రోల్ అని పిలుస్తారు. దేశంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వాహనాలు ఉన్నా, ఇవి ప్రత్యేకంగా E10 పెట్రోల్ కోసం డిజైన్ చేశారు. ఈ వాహనాలలో కొందరు E20 పెట్రోల్‌ను నింపుతున్నారు. అలా వాడిన క్రమంలో E20 పెట్రోల్ కారణంగా వాహనాల ఇంజిన్ పాడైపోతే, దానికి ఇన్సూరెన్స్ లభిస్తుందా లేదా అని చాలా మంది కార్ల యజమానులలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. E20 పెట్రోల్ వాడకం వల్ల నార్మల్ కార్ ఇంజిన్ పాడైపోతే ఇన్సూరెన్స్ లభిస్తుందా లేదా అనే విషయానికి సంబంధించి రూల్స్ ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి. 

E20 పెట్రోల్ అంటే ఏంటీ ?
E20 పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్ మరియు 20 శాతం ఇథనాల్ కలుపుతారు. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారు చేస్తున్న ఒక బయోఫ్యూయల్. దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని, విదేశీ చమురుపై ఆధారపడటం బాగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే భారత్‌లోనూ E20 పెట్రోల్ వాడకం వేగంగా పెరుగుతోంది.

E20 పెట్రోల్ వల్ల ఏ వాహనాలపై ప్రతికూల ప్రభావం
ఏప్రిల్ 2023 తర్వాత తయారు చేసిన చాలా కొత్త కార్లు E20 పెట్రోల్ తో నడిచేలా ఉన్నాయి. అంతకంటే ముందు ఉన్న అనేక వాహనాలు E10 అంటే 10 శాతం ఇథనాల్ ఉండే పెట్రోల్ ప్రకారం డిజైన్ చేశారు. అటువంటి పరిస్థితిలో, ఆటో నిపుణుల అభిప్రాయం ప్రకారం పాత వాహనాలలో E20ని నిరంతరం ఉపయోగించడం వల్ల ఫ్యూయల్ లైన్, రబ్బర్ సీల్ గ్యాస్కెట్, ఇంజిన్ కొన్ని భాగాలపై ప్రభావం చూపవచ్చు. అయితే, వెంటనే నష్టం జరగదు. కానీ సమస్య క్రమక్రమంగా బయటపడుతుంది.

Also Read: Petrol Latest News: పెట్రోల్ బంకుల్లో ఇంధన కొనుగోళ్లపై 90 రోజులపాటు ఆంక్షలు.. కేంద్రం కీలక నిర్ణయం

వాహన తయారీ కంపెనీలు ఏం చెబుతున్నాయి
E20 పెట్రోల్‌ గురించి టయోటా సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. E10 కోసం డిజైన్ చేసిన కార్లలో E20ని ఉపయోగించడం నివారించాలి. కంపెనీ ప్రకారం, సెట్ కాని ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల నష్టం జరిగితే, వారంటీ క్లెయిమ్ చెల్లదు. మహీంద్రా కంపెనీ తమ పెట్రోల్ ఇంజిన్లు E20కి అనుకూలంగా ఉన్నాయని,  కేవలం E20 ఉపయోగించడం వల్ల వారంటీ లేదా క్లెయిమ్ తిరస్కరించరని పేర్కొంది. టాటా మోటార్స్ తమ వాహనాలు ఎలాంటి పెద్ద సమస్య లేకుండా E20 పెట్రోల్‌పై నడుస్తాయని క్లెయిమ్ చేస్తోంది.

ఇన్సూరెన్స్ కంపెనీలు
ఇన్సూరెన్స్ కంపెనీల ప్రకారం, వాహనం E20 కోసం డిజైన్ చేయకపోతే.. తప్పుడు ఇంధనాన్ని ఉపయోగించడం వల్లే ఇంజిన్ దెబ్బతిన్నట్లు పరీక్షల్లో తేలితే  ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. సంబంధించి మహీంద్రా ప్రతినిధి మాట్లాడుతూ.. E20 పెట్రోల్‌కు సంబంధించిన ఏదైనా సమస్య తలెత్తితే కంపెనీ తన వారంటీ రూల్స్ ప్రకారం నడుచుకుంటుందన్నారు. అంటే E20 ఉపయోగించడం వల్ల మీ ఇన్సూరెన్స్ అంత ఈజీగా రిజెక్ట్ చేయరు. కంపెనీ రూల్స్, ఇన్సూరెన్స్ పాలసీ రూల్స్ చెక్ చేసి.. రాంగ్ పెట్రోల్ వల్లే ఇంజిన్ పాడయిందని తేలితేనే మీ క్లెయిన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Frequently Asked Questions

E20 పెట్రోల్ అంటే ఏమిటి?

E20 పెట్రోల్ 80 శాతం పెట్రోల్ మరియు 20 శాతం ఇథనాల్ మిశ్రమం. ఇది చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారయ్యే బయోఫ్యూయల్. కాలుష్యాన్ని తగ్గించి, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దీన్ని ప్రోత్సహిస్తున్నారు.

E20 పెట్రోల్ పాత వాహనాలకు నష్టం కలిగిస్తుందా?

ఏప్రిల్ 2023కి ముందు తయారు చేసిన E10-డిజైన్డ్ వాహనాలలో E20ని నిరంతరం వాడితే ఫ్యూయల్ లైన్, రబ్బర్ సీల్ గ్యాస్కెట్, ఇంజిన్ భాగాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అయితే, నష్టం వెంటనే జరగదు, క్రమక్రమంగా బయటపడుతుంది.

E20 పెట్రోల్ వల్ల ఇంజిన్ పాడైతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

మీ వాహనం E20 కోసం డిజైన్ చేయకపోతే, తప్పుడు ఇంధనం వల్లే ఇంజిన్ దెబ్బతిన్నట్లు పరీక్షల్లో తేలితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు. అయితే, అన్ని పాలసీ నిబంధనలు, కంపెనీ రూల్స్ పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటారు.

E20 పెట్రోల్ వాడకం గురించి కార్ల తయారీదారులు ఏమి సూచిస్తున్నారు?

టయోటా E10 కోసం డిజైన్ చేసిన కార్లలో E20 వాడకాన్ని నివారించమని చెబుతుంది. మహీంద్రా, టాటా మోటార్స్ తమ వాహనాలు E20కి అనుకూలంగా ఉన్నాయని, పెద్ద సమస్యలు లేకుండా పనిచేస్తాయని పేర్కొన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget