అన్వేషించండి

సేఫ్‌గా డ్రైవ్ చేస్తే భారీ డిస్కౌంట్ - టెలిమాటిక్స్‌తో మారిపోనున్న వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం!

వెహికల్‌ ఇన్సూరెన్స్ రంగంలో టెలిమాటిక్స్ కొత్త ట్రెండ్‌గా మారుతోంది. డ్రైవింగ్ స్కోర్‌ను బట్టి ప్రీమియం నిర్ణయించే విధానం, ప్రయోజనాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

Driving score based insurance premium: ఇప్పటి వరకు కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే వాహనం మోడల్, ఇంజిన్ సామర్థ్యం, తయారీ సంవత్సరం, రిజిస్ట్రేషన్ ప్రాంతం వంటి అంశాలే కీలకం. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోతున్నాయి. ఇకపై మీరు ఎంత సేఫ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారన్న విషయమే మీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని నిర్ణయించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. టెలిమాటిక్స్ టెక్నాలజీతో ఇన్సూరెన్స్ రంగం పూర్తిగా కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఒకే మోడల్ కారు ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రాష్‌గా, మరొకరికి జాగ్రత్తగా డ్రైవ్‌ చేసే అలవాటు ఉండొచ్చు. అయినా, ఇప్పటి వరకు, ఆ ఇద్దరికీ దాదాపు ఒకే విధమైన ప్రీమియం ఉండేది. ఈ అసమానతకు చెక్ పెడుతూ ‘యూసేజ్‌ బేస్డ్‌ ప్రైసింగ్‌’ (Usage Based Pricing) & ‘బిహేవియర్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌’ (Behaviour Linked Insurance) ఆప్షన్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

టెలికమ్యూనికేషన్స్‌ & ఇన్ఫర్మేటిక్స్‌ కలయికే టెలిమాటిక్స్. పాలసీ తీసుకున్న తర్వాత, సంబంధిత వాహనంలో ప్రత్యేక పరికరాన్ని అమర్చడం లేదా ఇన్సూరెన్స్ కంపెనీ మొబైల్ యాప్‌ను డ్రైవ్‌ చేసే వ్యక్తి ఉపయోగించడం ద్వారా డ్రైవింగ్ అలవాట్లను నిరంతరం విశ్లేషిస్తారు. ఆ వాహనం ఎంత స్పీడ్‌తో వెళ్తోంది, తరచూ సడన్ బ్రేకింగ్ చేస్తున్నారా, ఒక్కసారిగా వేగం పెంచుతున్నారా, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఉపయోగిస్తున్నారా వంటి అంశాలన్నింటినీ GPS సహాయంతో ఈ సిస్టమ్ రికార్డ్ చేస్తుంది.

ఈ డేటాను AI విశ్లేషించి ప్రతి డ్రైవర్‌కు 1 నుంచి 100 వరకు డ్రైవింగ్ స్కోర్ ఇస్తుంది. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాధ్యతాయుతమైన డ్రైవర్‌గా గుర్తింపు లభిస్తుంది. అదే భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ప్రీమియంపై కూడా ప్రభావం చూపుతుంది.

ఇది కూడా చదవండి: 900 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వనున్న BYD కొత్త EV.. లగ్జరీ ఫీచర్లు చూస్తే షాక్

జునో జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ 2026 ప్రకారం, మన దేశంలోని 17 రాష్ట్రాల్లో 45 లక్షలకుపైగా ప్రయాణాలను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో వయసు లేదా ప్రాంతం కంటే డ్రైవింగ్ అలవాట్లే ప్రమాదాలకు ప్రధాన కారణమని తేలింది. అంటే బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేసే వారికి ప్రమాదాల అవకాశాలు తక్కువగా ఉంటాయని స్పష్టమైంది.

ఇప్పటికే IRDAI కూడా Sandbox విధానంలో యూసేజ్‌ బేస్డ్‌ ప్రైసింగ్‌ & బిహేవియర్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ మోడళ్లకు అనుమతులు ఇచ్చింది. దీంతో త్వరలోనే మరిన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ స్మార్ట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి.

రెండు రకాల ప్లాన్లు
వాహనాన్ని చాలా తక్కువగా ఉపయోగించేవారికి 'పే యాజ్‌ యు డ్రైవ్‌' (Pay As You Drive) ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. అంటే, ఏడాదికి ఎంత దూరం ప్రయాణిస్తారో అంచనా వేసుకుని పాలసీ తీసుకునే సమయంలో దీనిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఏడాదికి 20,000km లేదా 50000km వంటి స్లాబ్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ దూరం తిరిగేవాళ్లకు ప్రీమియంలో తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది. పరిమితి దాటితే అదనపు టాపప్ కూడా కొనుగోలు చేయవచ్చు.

సంవత్సరంలో ఎక్కువ దూరం తిరిగినప్పటికీ, క్రమశిక్షణతో డ్రైవింగ్ చేసేవారికి 'పే యాజ్‌ యు డ్రైవ్‌' (Pay How You Drive) మరింత ప్రయోజనకరం. బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తో మంచి స్కోర్‌ వస్తుంది, చక్కటి డ్రైవింగ్ స్కోర్‌తో పాలసీ రెన్యువల్ సమయంలో ప్రీమియంపై క్యాష్‌బ్యాక్ లేదా ప్రత్యేక డిస్కౌంట్లు అందే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: 5 స్టార్ భద్రత నుంచి అద్భుతమైన మైలేజ్ వరకు - Maruti Dzireలో ప్లస్‌లే కాదు, మైనస్‌లూ ఉన్నాయి!

ఇతర ప్రయోజనాలు కూడా...
టెలిమాటిక్స్ వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గడమే కాదు. వాహనం చోరీకి గురైతే GPS ద్వారా లైవ్ లొకేషన్‌ను గుర్తించవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం చేరుతుంది. ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో వాహనం స్పీడ్‌ ఎంత అనే వివరాలు అందుబాటులో ఉండటంతో క్లెయిమ్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతుంది. అంతేకాదు, క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన ఆదా కూడా పెరుగుతుంది.

అంతర్జాతీయంగా టెలిమాటిక్స్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్న దేశాల్లో రోడ్డు ప్రమాదాలు 20 నుంచి 40 శాతం వరకు తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి, ఇకపై వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ప్రీమియం మాత్రమే కాకుండా టెలిమాటిక్స్ సదుపాయం ఉందా లేదా అనేది కూడా తప్పకుండా చెక్ చేయడం మంచిది. సేఫ్ డ్రైవింగ్ మీ ప్రాణాలను కాపాడటమే కాదు, మీకు డబ్బు కూడా ఆదా చేస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget