బజాజ్ ప్లాటినా 110 బైక్‌లో 115.06 cc సామర్థ్యం గల 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

Published by: Shankar Dukanam

బజాజ్ ప్లాటినా 110 బైక్‌ ఇంజిన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9.5 PS పవర్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనికి 4 స్పీడ్ గేర్ బాక్స్ (అన్నీ కిందకు వేసే గేర్లు) ఉంది.

బజాజ్ ప్లాటినా 110 లాంగ్ రైడ్స్ కోసం తగ్గట్లుగా 11 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

బజాజ్ ప్లాటినా 110 ఒక్క లీటర్ పెట్రోలుతో గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు వెళ్తుంది

హైదరాబాద్‌లో బజాజ్ అత్యంత చవకైన బైక్ ప్లాటినా 110 డ్రమ్ బ్రేక్ ఆన్‌రోడ్ ధర దాదాపు రూ. 85,348 గా ఉంది.

బజాజ్ ప్లాటినా 110 ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే మీరు గరిష్టంగా 750 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు.

ఈ బైక్ ముందు, వెనుక రెండు వైపులా 80/100-17 కొలతలు గల ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది.

ముందు వైపు 130 mm డ్రమ్ బ్రేక్, వెనుక వైపు CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) సాంకేతికతతో కూడిన 110 mm డ్రమ్ బ్రేక్ అమర్చారు.

భారత రోడ్లకు సరిపోయేలా ఈ బైక్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. అలాగే, ఈ బైక్ మొత్తం బరువు 116 కిలోలుగా ఉంది.