మారుతి బ్రెజ్జా 2026 ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో ఎంత? వేరియంట్లు, ఫీచర్ల పూర్తి లిస్ట్ ఇదిగో!
Published by: Khagesh
హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా బేస్ వేరియంట్ LXi Petrol ఎక్స్-షోరూమ్ ధర ₹8,25,900 కాగా, అన్ని పన్నులు కలిపి ఆన్-రోడ్ ధర సుమారు ₹9.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
అన్ని ఫీచర్లు ఉండే బ్రెజ్జా టాప్ వేరియంట్ ZXi Plus AT Dual Tone ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో దాదాపు ₹15.97 లక్షల వరకు ఉంటుంది.
బ్రెజ్జాలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కావాలనుకునే వారికి VXi AT వేరియంట్ ఆన్-రోడ్ ధర ₹13.04 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్స్ వరకు అందుబాటులో ఉంది.
హైదరాబాద్‌లో బ్రెజ్జా CNG మోడల్స్ బేస్ LXi CNG ఆన్-రోడ్ ధర ₹10.85 లక్షల నుంచి ప్రారంభమై ₹13.90 లక్షల వరకు ఉంది.
తెలంగాణ రవాణా శాఖ నిబంధనల ప్రకారం, బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధరపై లైఫ్ టాక్స్ కారు ధర ఆధారంగా 14% వరకు వర్తిస్తుంది.
హైదరాబాద్‌లో కొత్త బ్రెజ్జా కొనుగోలుపై థర్డ్-పార్టీ, ఓన్ డ్యామేజ్ కలిపిన కార్ ఇన్సూరెన్స్ ధర సుమారు ₹35,000 నుంచి ₹45,000 వరకు ఉంటుంది.
మంచి ఫీచర్లు, రీజనబుల్ బడ్జెట్ అనుకునే వారి కోసం Brezza VXi Petrol (M) ఆన్-రోడ్ ధర ₹10.96 లక్షలుగా ఉంది.
బ్రెజ్జాలో 1462 cc K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 102 bhp పవర్, 136.8 Nm టార్క్‌ను అందిస్తుంది.
పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు లీటరుకు 17.38 కిమీ, ఆటోమేటిక్ వేరియంట్లు 19.80 కిమీ వరకు మైలేజ్ ఇస్తుండగా, CNG వేరియంట్ కిలోకు 25.51 కిమీ మైలేజ్ అందిస్తుంది.