హైదరాబాద్‌లో మారుతి ఎక్స్‌ఎల్6 ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధరలు ఇవే!

Published by: Khagesh

మారుతి ఎక్స్‌ఎల్6 ఒక లగ్జరీ 6-సీటర్ వాహనం. ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మారుస్తాయి.

ఇందులో 1.5-లీటర్ K15C సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజిన్‌, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది.

5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్, ప్యాడల్ షిఫ్టర్స్ ఆప్షన్లను కలిగి ఉంది.

పెట్రోల్ మాన్యువల్ లీటరుకు సుమారు 20.97కి.మీ, పెట్రోల్ ఆటోమేటిక్ లీటరుకు సుమారు 20.27 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే సీఎన్‌జీ వేరియంట్ అందుబాటులో ఉంది. ఇది 26.32 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

7-ఇంచుల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో పాటు 40కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు గల Suzuki Connect యాప్‌ను సపోర్ట్ చేస్తుంది.

సులభంగా పార్క్ చేయడానికి వీలుగా ఇందులో 360-డిగ్రీ వ్యూ కెమెరా ఫీచర్‌ను అందించారు. ముందు వరుసలో సీట్లకు వెంటిలేటెడ్ సీట్స్ సౌకర్యం ఉంది.

4 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ ఉన్నాయి.

ప్రయాణంలో ఉన్నప్పుడు నాలుగు టైర్లలో గాలి ఒత్తిడి ఎంత ఉందో డ్రైవర్ డిస్‌ప్లేలోనే చూసుకునేలా TPMS ఫీచర్‌ను చేర్చారు.

కారు లోపలికి ఎండ వేడి మరియు హానికరమైన యూవీ కిరణాలు రాకుండా నిరోధించే ప్రత్యేకమైన UV Cut Glassesను ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందించారు.

బేసిక్‌ మోడల్ XL6 Zeta ఆన్‌రోడ్డ్ ప్రైస్‌ రూ. 13,75,000 టాప్ వేరియంట్‌ XL6 Alpha Plus రూ. 17,20,000