ఎంతో ఫేమస్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో ప్రత్యేకత ఏముంది

Published by: Shankar Dukanam
Image Source: social media

డిజైన్ పూర్తిగా క్లాసిక్ లుక్ ఆధారంగా రూపొందించారు. రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్, క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు.

ఇందులో 349సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. స్మూత్ రైడింగ్ తో పాటు మంచి టార్క్ అందిస్తుంది

Image Source: social media

హైదరాబాద్‌లో క్లాసిక్ 350 మోడల్ ఎక్స్ షోరూమ్ కనిష్ట ధర రూ. 1,85,854.. ఆన్ రోడ్ ధర రూ. 2,28,334

Image Source: social media

క్లాసిక్ 350 బైక్ లో కొత్త J సిరీస్ ఇంజిన్ అమర్చారు. ఇది పాత ఇంజిన్ తో పోలిస్తే తక్కువ వైబ్రేషన్ ఉత్పత్తి చేస్తుంది

Image Source: social media

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అందించారు. ఇది బ్రేక్ సమయంలో మెరుగైన కంట్రోల్, సేఫ్టీని అందిస్తుంది

Image Source: social media

దీనిలో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అనలాగ్ స్పీడోమీటర్, డిజిటల్ డిస్ప్లే కూడా ఇవ్వగా.. ఇది అవసరమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది

Image Source: social media

బైక్‌లో ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ ఆప్షన్ ఇచ్చారు. ఇది బ్లూటూత్ ద్వారా మొబైల్‌కు కనెక్ట్ అయ్యి టర్న్ బై టర్న్ నావిగేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది

Image Source: social media

Classic 350లో సౌకర్యవంతమైన రైడ్ కోసం సస్పెన్షన్ సెటప్ ఇచ్చారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి