హైదరాబాద్‌లో మారుతి ఫ్రాంక్స్‌ ఫేస్ లిఫ్ట్‌ ఆన్‌రోడ్‌ ధర ఎంత?

Published by: Khagesh

మారుతి ఫ్రాంక్స్‌ కూపే తరహా ఎస్‌యూవీ డిజైన్‌తో వస్తోంది. విటారా లాంటి ఫ్రంట్‌ లుక్‌ మంచి ప్రెజన్స్ ఇస్తుంది.

మారుతి ఫ్రాంక్స్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్ ఇప్పుడు టెస్టింగ్‌ దశలో ఉంది. 2026 నవంబర్ నాటికి మార్కెట్‌లోకి రానుంది.

ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం హైదరాబాద్‌లో ఈ ఫ్రాంక్స్‌ ఆన్‌ రోడ్‌ ధ సుమారు 8.19 నుంచి 15.04 లక్షల వరకు పలుకుతోంది.

ఇందులో సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే 1.2ఎల్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్, పర్ఫార్మెన్స్‌ ఇష్టపే వారి కోసం 1.0ఎల్‌ టర్బో బూస్టర్‌ జెట్ ఇంజిన్ కలిగి ఉంది.

ఎక్కువ మైలేజ్‌ కోరుకునే వారి కోసం మారుతి ఇందులో సీఎన్జీ ఆప్షన్ కూడా అందిస్తోంది. దీని ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 9.36 లక్షల నుంచి 10.70 లక్షల వరకు ఉంది.

హైదరాబాద్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే బేస్ వేరియంట్‌ సిగ్మా ఆన్‌రోడ్డు ప్రైస్‌ 8.26 లక్షల నుంచి 8.52 లక్షల మధ్య ఉంటుంది.

టాప్ వేరియంట్‌ ఆల్ఫా టర్బో డీటీ ఏటీ ధర 14.73 లక్షల నుంచి 15.04 లక్షల వరకు ఉంటుంది.

2026 ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధరు కొత్త ఫీచర్ల కారణంగా 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉండవచ్చని అంచనా ఉంది.

ఈ SUV టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ వంటి దిగ్గజాలతో తలపడుతోంది.