సింపుల్ వన్ vs హోండా యాక్టివా ఇ! ఏ ఈవీ బెటర్‌?

Published by: Khagesh

సింపుల్ వన్ స్కూటర్‌ భారీ 5.0kWh ఫిక్స్‌డ్‌+రిమూవబుల్‌ బ్యాటరీ సెటప్‌తో వస్తుంది. హోండా యాక్టివా ఇ మోడల్‌ రెండు రిమూవబుల్‌ పవర్‌ ప్యాక్‌ బ్యాటరీలతో రన్ అవుతుంది.

సింపుల్‌ వన్ సింగిల్‌ ఛార్జ్‌పై ఏకంగా 265 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. యాక్టివా ఇ పూర్తి ఛార్జింగ్‌పై దాదాపు 102 కిలోమీటర్ల రేంజ్‌ మాత్రమే అందిస్తుంది.

సింపుల్‌ గరిష్ట వేగం 115 కిలోమీటర్ల కాగా, సిటీ రైడింగ్‌కు సరిపోయేలా హోండా యాక్టివా ఇ టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లుగా ఉంది.

సింపుల్ వన్ కేవలం 2.55 సెకన్‌లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. యాక్టివా ఇ పికప్‌ చాలా స్మూత్‌గా, లీనియర‌గా సాగుతుంది.

సింపుల్‌ వన్‌ను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవడానికి ఐదు గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. యాక్టివా ఇ బ్యాటరీలను బయటకు తీసి చార్జ్ చేసుకోవచ్చు. లేదా స్వాపింగ్ చేసుకోవచ్చు.

సింపుల్ వన్ స్పోర్టీ, షార్ప్‌, ఫ్యూచరిస్టిక్‌ కట్‌లో యువతను ఆకట్టుకునేలా ఉంటుంది. యాక్టివా సంప్రదాయ పెట్రోల్‌ యాక్టివా డిజైన్‌ను పోలి ఉంటూ క్లాసిక్‌ ఫ్యామిలీ లుక్‌ను కలిగి ఉంది.

సింపుల్‌ వన్ సీటు కింద హెల్మెట్ పెట్టుకోవడానికి తగినంత విశాలమైన బూట్ స్పేస్‌ ఉంటుంది. యాక్టివా ఇ లో స్టోరేజ్‌ స్పేస్‌ పరిమితంగా ఉంటుంది.

సింపుల్ వన్ డిస్క్‌బ్రేక్‌లను కలిగి ఉంటుంది. యాక్టివా ఇ వేరయంట్‌ను బట్టి డిస్క్‌, డ్రమ్‌ బ్రేక్స్ ఆప్షన్లుతో పాటు కంబైన్డ్‌ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

సింపుల్ వన్ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర 1,99,463 నుంచి 2,04,669 రూపాయలు ఉంటుంది. యాక్టివా 1,22,852 నుంచి 1,60,178 రూపాయల వరకు ఉంటుంది.