ఓలా ఎస్‌1 ఎక్స్‌ vs హోండా యాక్టివా ఈవీ మధ్య పోలికలు ఏంటీ?

Published by: Khagesh

ఓలా ఎస్‌1 ఎక్స్‌ మోడ్రన్, ఫంకీ, ఫ్యూచరిస్టిక్‌ డ్యూయల్‌ టోన్ డిజైన్‌తో యువతను ఎక్కువగా ఆకట్టుకుంది.

హోండా యాక్టివా ఈవీ తన సిగ్నేచర్‌ యాక్టివా లుక్‌ను ఈవీ టచ్‌తో క్లాసిక్‌గా, ఫ్యామిలీఫ్రెండ్లీగా ఉంటుంది.

ఓలా ఎస్‌1లో ఎక్స్‌లో ఫిక్స్డ్‌ బ్యాటరీ ఉంటుంది. యాక్టివా ఈవీలో రిమూవబుల్‌/స్వాపబుల్ బ్యాటరీలు ఉంటాయి.

ఓలాఎస్‌ 1ఎక్స్‌లో మూడు రకాల బ్యాటరీ కెపాసిటీలలో లభిస్తుంది. యాక్టివా ఈవీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఓలా ఎస్‌1 ఎక్స్‌ పూర్తి ఛార్జింగ్‌పై 190 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. యాక్టివా ఈవీ సింగిల్ ఛార్జింగ్‌పై 102 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

ఓలా ఎస్‌1ఎక్స్‌ కాస్త గరిష్టంగా 85 నుంచి 90 కిలోమీటర్ల స్పీడ్‌తో, యాక్టివా 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లొచ్చు.

ఓలా ఎస్‌1ఎక్స్‌లో 34 లీటర్ల డిక్కీ స్పేస్ ఉంది. యాక్టివా ఈవీలో పెద్దగా బూట్‌స్పేస్ లేదు.

ఓలా స్కూటర్‌లో యాప్ కంట్రోల్‌, రిమోట్‌ అన్‌లా్, వివిధ రైడింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. యాక్టివా ఈవీలో స్మార్ట్‌కి, యాంటీ థెఫ్ట్‌, కీలెస్ స్టార్ట్‌ వంటి ఫీచర్లతో వస్తుంది.

హైదరాబాద్‌లో ఓలా ఎస్‌1ఎక్స్‌ ఆన్‌రోడ్ ధర 89,789 నుంచి 1,20,324 వరకు ఉంది. యాక్టివా ఈవీ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 1,24, 852 నుంచి 1,58, 746 వరకు ఉంటుంది.