మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర ఎంత?
Published by: Khagesh
ఫాటమ్ బ్లాక్ ఎడిషన్ గ్రాండ్ విటారా కోసం మారుతి సుజుకి తీసుకొచ్చిన ప్రత్యేకమైన లిమిటెడ్ కాస్మెటిక్ ప్యాకేజీ.
హైదరాబాద్‌లో ఈ ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ ఆన్‌రోడ్ ధర సుమారు 23.50 లక్షల నుంచి ప్రారంభమై 24.85 వరకు ఉంటుంది.
ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధర 19.57లక్షల నుంచి 20.22 లక్షల వరకు ఉంటుంది.
ఈ ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ ప్యాకేజీని మారుతి సుజుకి కేవలం గ్రాండ్ విటారా టాప్ ఎండ్ మోడ్ అయిన ఆల్ఫా ప్లస్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లలో మాత్రమే అందిస్తోంది.
ఈ ఎడిషన్‌లో మ్యాట్ బ్లాక్ బాడీ కలర్‌తోపాటు డార్క్ క్రోమ్ ఫినిషింగ్ గల ఫ్రంట్ గ్రిల్, గ్లాస్ బ్లాక్ క్లాడింగ్, హెడ్‌ల్యాంప్స్ చుట్టూ స్మోక్డ్ ఎఫెక్ట్ తో కారు పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
ఈ స్పెషల్ ఎడిషన్‌లో లభించే 17 ఇంచుల రేడియంట్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ కూడా పూర్తి బ్లాక్ కలర్ థీమ్‌తో వస్తాయి.
కారు లోపలి భాగం కూడా ప్రీమియం ఆల్-బ్లాక్ లెదరెట్ సీట్ అప్‌హోల్‌స్టరీతో ఉంటుంది.
ఈ ఎడిషన్‌లో ప్రత్యేకంగా క్లారియన్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం సరౌండ్ సౌండ్ సిస్టమ్ అమర్చారు.
ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తోపాటు 59kW ఏసీ ఎలక్ట్రిక్ మోటార్, లిథియం- అయాన్ బ్యాటరీ ఉంటాయి.
ఇది సెల్ఫ్ ఛార్జింగ్‌తో పని చేస్తుంది. అంటే బయట ప్లగ్ పెట్టి ఛార్జ్ చేయాల్సిన పని లేదు.
స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఈ భారీ ఎస్‌యూవీ లీటరుకు ఏకంగా 27.97 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.