గూగుల్ క్రోమ్‌లో పీడీఎఫ్‌ను చదవాల్సిన పని లేదు!

Published by: Khagesh

గూగుల్ క్రోమ్‌లో PDF ఫైళ్లు డౌన్‌లోడ్ చేసిన తర్వాత వాటిని చదవడానికి చాలా సమయం పడుతుంది.

అందుకే వినియోగదారుల టైమ్‌ను సేవ్ చేసేందుకు గూగుల్ క్రోమ్ ఏఐ ఫీచర్‌ పరిచయం చేస్తోంది.

ఈ కొత్త ఏఐ ఫీచర్ వినియోగదారులకు PDF సారాంశాన్ని అందిస్తుంది.

ఈ ఫీచర్‌ యాక్టివేట్ అయినప్పుడు PDF వ్యూయర్‌కు పైన ఉన్న టూల్‌బార్‌లో సమ్మరైజ్‌ విత్‌ Gemini అనే బటన్‌ కనిపిస్తుంది.

ఈ బటన్‌ను నొక్కిన వెంటనే ఫైల్ సారాంశాన్ని ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది.

ప్రశ్నలు ఉంటే టూల్‌బార్‌లో అడగవచ్చు. డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు.

గూగుల్ ప్రస్తుతం క్రోమ్ బీటా వెర్షన్‌లో సమ్మరైజ్ విత్ జెమిని అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ క్రోమ్ ఒక కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టింది.

దీని ద్వారా వారు క్రోమ్‌లో PDF ఫైల్‌ను తెరిచి టెక్స్ట్‌ను హైలైట్ చేయవచ్చు. నోట్స్ యాడ్ చేయవచ్చు.