అన్వేషించండి

Diesel vs Petrol Efficiency: డీజిల్‌ కార్ల మైలేజ్‌ రహస్యం ఇదే - పెట్రోల్‌ కంటే ఎందుకు ఎక్కువ సామర్థ్యం?

డీజిల్‌ ఇంజిన్‌ మెకానికల్‌గా, కెమికల్‌గా పెట్రోల్‌ ఇంజిన్‌ కంటే శక్తిమంతమైనది. ఎక్కువ కంప్రెషన్‌, అధిక టార్క్‌ కారణంగా డీజిల్‌ వాహనాలు మైలేజ్‌లో ముందు ఉంటాయి.

Diesel Cars vs Petrol Cars Fuel Efficiency: భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో డీజిల్‌ & పెట్రోల్‌ వాహనాల మధ్య పోటీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. పెట్రోల్‌ కార్లు స్మూత్‌గా, తేలికగా ఉంటే... డీజిల్‌ వాహనాలు మైలేజ్‌ విషయంలో స్పష్టమైన ఆధిక్యం చూపిస్తాయి. "డీజిల్‌ ఇంజిన్‌ అంటే ఫ్యూయల్‌ ఎఫిషెన్సీకి మరొక పేరు" అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. 

1. కెమికల్‌ అడ్వాంటేజ్‌  - ఇంధనంలోనే తేడా
డీజిల్‌ ఫ్యూయల్‌ రసాయన పరంగా పెట్రోల్‌ కంటే భారంగా ఉంటుంది. ఒక లీటర్‌ డీజిల్‌లో సుమారు 10-15 శాతం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అంటే ప్రతి చుక్కలోనూ ఎక్కువ శక్తి దాగి ఉంటుంది. అందువల్ల అదే పరిమాణంలో పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్‌ వాహనం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఇది ఫ్యూయల్‌ ఎఫిషెన్సీకి మొదటి మూల కారణం.

2. మెకానికల్‌ పవర్‌ - కంప్రెషన్‌ ఇగ్నిషన్‌ సైకిల్‌
డీజిల్‌ ఇంజిన్‌ పని తీరు కూడా వేరుగా ఉంటుంది. ఇది స్పార్క్‌ ప్లగ్‌ ఆధారంగా కాకుండా, గాలి వేడి కారణంగా ఇంధనాన్ని దహనం చేస్తుంది. పెట్రోల్‌ ఇంజిన్‌లలో కంప్రెషన్‌ రేషియో సాధారణంగా 9:1 నుంచి 12:1 వరకు ఉంటుంది. కానీ డీజిల్‌ ఇంజిన్‌లలో అది 14:1 నుంచి 25:1 వరకు పెరుగుతుంది. అంటే గాలిని ఎక్కువగా కంప్రెస్‌ చేయడం వల్ల తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది థర్మల్‌ ఎఫిషెన్సీని పెంచుతుంది. సులభంగా చెప్పాలంటే... ఎక్కువ కంప్రెషన్‌ అంటే ఎక్కువ మైలేజ్‌.

3. లీన్‌ బర్న్‌ సిస్టమ్‌ - గాలి ఎక్కువ, ఫ్యూయల్‌ తక్కువ
డీజిల్‌ ఇంజిన్‌లు ఎప్పుడూ "లీన్‌ బర్న్‌" విధానంలో పని చేస్తాయి. అంటే గాలిని ఎక్కువగా తీసుకుని, ఫ్యూయల్‌ పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల ఫ్యూయల్‌ వృథా తగ్గి ఎఫిషెన్సీ పెరుగుతుంది. పెట్రోల్‌ ఇంజిన్‌లు పవర్‌ను కంట్రోల్‌ చేయడానికి గాలి ప్రవాహాన్ని తగ్గిస్తాయి (థ్రాటిల్‌ సిస్టమ్‌), దీనివల్ల "పంపింగ్‌ లాస్‌" అనే సమస్య వస్తుంది. డీజిల్‌ ఇంజిన్‌లో ఇది ఉండదు. అందుకే అది రోజువారీ డ్రైవింగ్‌లో మరింత ఎఫిషెంట్‌గా ఉంటుంది.

4. టార్క్‌ & డ్రైవింగ్‌ సౌలభ్యం
డీజిల్‌ ఇంజిన్‌ తక్కువ rpm లోనే ఎక్కువ టార్క్‌ ఇస్తుంది. అందువల్ల గేర్‌ మార్చే అవసరం తక్కువగా ఉంటుంది. కారు లేదా మరేదైనా వాహనం స్మూత్‌గా నడుస్తుంది, ఇంధనం తక్కువ ఖర్చవుతుంది. పెట్రోల్‌ ఇంజిన్‌ ఎక్కువ rpm కి వెళ్లే వరకు శక్తి ఇవ్వదు, దాంతో డ్రైవర్‌ ఎక్కువ యాక్సిలరేట్‌ చేయాల్సి వస్తుంది. డీజిల్‌ వాహనాలు అయితే తక్కువ వేగంలోనే శక్తిమంతమైన పర్ఫార్మెన్స్‌ ఇస్తాయి.

5. ఫ్యూయల్‌ ఎకానమీ విషయంలో డీజిల్‌ సత్తా
ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉన్న ఇంధనం, అధిక కంప్రెషన్‌ రేషియో ఉన్న ఇంజిన్‌ -  ఈ రెండు కలిసి డీజిల్‌ వాహనాలను ఫ్యూయల్‌ ఎఫిషెన్సీ లీడర్లుగా నిలిపాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు, హైబ్రిడ్‌ సాంకేతికతలు వచ్చినా, మైలేజ్‌ గురించి ఆలోచించే భారతీయ డ్రైవర్‌ మనసులో డీజిల్‌కే ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ రన్నింగ్‌ ఖర్చులు, ఎక్కువ లాంగ్‌-టర్మ్‌ లాభం... ఇవే డీజిల్‌ విజయ రహస్యాలు.

మొత్తం మీద డీజిల్‌ ఇంజిన్‌ రసాయనంగా, మెకానికల్‌గా, ప్రాక్టికల్‌గా కూడా పెట్రోల్‌ కంటే శక్తిమంతమైనది. అదే కారణంగా డీజిల్‌ వాహనాలు మైలేజ్‌లో ఎప్పుడూ ముందుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో నెలవారీగా ఎక్కువ ప్రయాణాలు చేసే డ్రైవర్లకు ఇది అత్యంత ఆర్థికమైన ఎంపికగా ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget