Citroen Basalt: సిట్రోయిన్ బసాల్ట్ vs మారుతి బాలెనో - బ్రెజా కార్లలో బెస్ట్ కారు ఏదో తెలుసా?
సిట్రోయిన్ తాజాగా విడుదల చేసిన బసాల్ట్ కూపే ఎస్‌యూవీ నేరుగా మారుతి సుజుకి బెలానో, బ్రెజా కార్లతో పోటీ పడుతుంది. ఈ కార్ల మధ్య ఉన్న ధర, ఫీచర్లు, ఇంజిన్ ఫర్ఫామెన్స్ తదితర అంశాల మద్య తేడాలు ఇవే..
Citroen Basalt Vs Baleno Vs Brezza: బసాల్ట్ కూపే ఎస్‌యూవీ ధరను కేవలం దాని ప్రారంభ ధర రూ. 7.99 లక్షలతో తీసుకువచ్చి సిట్రోయిన్ ఆశ్చర్యపరిచింది. ఈ కారు నేరుగా మారుతి సుజుకి బాలెనో, బ్రెజా కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. అంతే కాకుండా ఇది రూ. 10 లక్షల సెగ్మెంట్‌లో లభించే ఇతర కార్లతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఈ కారుని సంస్థ మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. ఈ సరికొత్త డిజైన్ కారుకి బాలెనో, బ్రెజా కార్లకు మధ్య కీలక తేడాలు ఇవే.
ధరలు:
బసాల్ట్ 1.2 లీటర్ నేచ్‌రల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 82 bhp శక్తిని విడుదల చేస్తుంది. ధర రూ. 7.99 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇక బాలెనో 90 bhp శక్తిని విడుదల చేసే 1.2 లీటర్ పెట్రోల్‌తో రూ. 6.66 లక్షల నుంచి రూ. 9.8 లక్షల మధ్య ఉంటుంది. ఇక బ్రెజా 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. బ్రెజా ధరలు రూ. 8.3 లక్షల నుంచి మొదలై రూ. 14 లక్షల వరకు ఉంటాయి.
గేర్‌బాక్స్
బాలెనో AMT గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇక బసాల్ట్ 5-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే వస్తుంది. మరోవైపు బ్రెజ్జా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. బసాల్ట్ దాని అత్యంత ఖరీదైన టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ కోసం దాదాపు రూ. 13 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో ఇతర SUVల కంటే కూడా సిట్రోయిన్ ధర చాలా చౌకగా ఉంటుంది.
ఫీచర్లు & కొలతలు
బసాల్ట్ టాప్ వేరియంట్‌లోనూ 360 డిగ్రీల కెమెరా, సన్‌రూఫ్ లేదా హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కోల్పోతుంది. అయితే బ్రెజాలో ఈ ఫీచర్లు అన్ని ఉంటాయి. ఇక బాలెనోలో 360 డిగ్రీ కెమెరాతో పాటు హెడ్స్-అప్ డిస్‌ప్లే కూడా ఉంది. బసాల్ట్ పొడవు 4.3 మీటర్లు కాగా, బ్రెజా బాలెనోతో పాటు 4మీ కంటే తక్కువగా ఉంది. సిట్రోయిన్ కస్టమర్లకు దగ్గరకు మరింత చేరువ అయ్యేందుకు తక్కువ ధరలో ఈ కారుని ఆఫర్ చేసిందని చెప్పవచ్చు. అయితే బసాల్ట్ ఇతర కీలక ఫీచర్లకు కోల్పోవడం కస్టమర్లకు కాస్త నిరాశే అని చెప్పాలి.
2021లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి సిట్రోయిన్‌కి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ రిజల్స్ట్‌ని ఒక కేస్ స్టడీగా తీసుకున్న సిట్రోయిన్ ఇప్పుడు పూర్తి సారిగా భారతీయ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మరో మోడల్‌ని ఇప్పుడు మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ నుంచి ప్రస్తుతం, C5 Aircross, C3, EC3, , C3 Aircross వంటి మోడల్స్ కొనుగోలుకి అందుబాటులో ఉన్నప్పటికీ వీటికి డిమాండ్ అంతగా లేదు. ఇప్పుడు బసాల్ట్‌తో మాస్ మార్కెట్‌లోని కస్టమర్లను ఆకట్టుకోవాలని సిట్రోయిన్ చూస్తోంది. దీంతో బసాల్ట్ కూపేపై భారీ ఆశలను పెట్టుకుంది.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి