News
News
X

Car Security Tips: ఎలుకలు మీ కార్లను డ్యామేజ్ చేస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే, మళ్లీ కన్నెత్తి చూడవు!

ఒక్కోసారి ఎలుకలు చేసే పని చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంట్లో సామాన్లనే కాదు, కార్లనూ డ్యామేజ్ చేస్తుంటాయి. అయితే వీరి బారి నుంచి కార్లను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

FOLLOW US: 
 
క కస్టమరమర్ కొత్త మహీంద్రా స్కార్పియో N డెలివరీ తీసుకుని ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు కారు డోర్ ఓపెన్ చేసి చూస్తే షాక్! గేర్ బాక్స్ సహా ఇంటీరియర్ అంతా ముక్కలు ముక్కలు చేసేశాయి. ఇదొక్కటే కాదు, ఎలుకల మూలంగా చాలా వాహనాలు ధ్వంసం అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కార్లను ఇంట్లో కాకుండా ఓపెన్ ప్లేస్ లో పెట్టినప్పుడు ఎలుకలు కార్లలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి కారులోకి ఎలుకలు వెళ్తే అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రిక్ తీగలన్నింటినీ కొరికేస్తాయి. ఈ వైర్లు చాలా బలంగా ఉన్నా.. ఎలుకలు వీటిని ఈజీగా డ్యామేజ్ చేస్తాయి. తీగలతో పాటు ఇంటీరియర్ భాగాలనూ పూర్తిగా కొట్టేస్తాయి. చాలా నష్టాన్ని కలిగిస్తాయి. మళ్లీ రిపైర్ చేయించుకోవలంటే మీరు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే, ఆ డ్యామేజ్‌కు ఇన్సురెన్స్ వర్తిస్తుందో లేదో కూడా అనుమానమే. అంత నష్టం జరగకూడదంటే మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. వాహనాల్లో ఎలుకలు చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎలుకల నుంచి ఎలా రక్షణ పొందాలంటే?

⦿ వాహనాలను ఎలుకలు డ్యామేజ్ చేసిన తర్వాత బాధపడటం కంటే, ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇందుకోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

⦿ ప్రతిరోజూ మీ కారును నడపడం వల్ల ఎలుకలు మీ వాహనంలోకి తక్కువగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. సాధారణంగా, కారు పార్కింగ్ ప్రదేశంలో రోజుల తరబడి ఉంచడం మూలంగా ఎలుకలు చేరే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత తక్కువ సమయం పార్కింగ్ లో ఉంచడం మంచింది.   

News Reels

⦿ కార్లలోకి ఎలుకలు ప్రవేశించకుండా, ప్రవేశించినా చనిపోయేలా చేసే పలు రకాల స్ప్రేలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ స్ప్రేలు ఇంజిన్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.

⦿ మీ కారును నీడ ఉన్న ప్రదేశంలో  పార్క్ చేయకుండా ప్రయత్నించండి. ఎలుకలు సాధారణంగా చీకటి ప్రదేశాలలో ఉండేందుకు ఇష్టపడుతాయి. ఒక వేళ మీ కారులోకి ఎలుకలు చేరినట్లు మీకు అనిపిస్తే,  వెంటనే కారును ఎండలో పార్క్ చేసి బానెట్ తెరవండి. ఎలుకలు వాటంతట అవే వెళ్లిపోతాయి. 

⦿ కార్లలో ఎలాంటి తినుబండారాలు ఉంచకూడదు. ఒకవేళ ఆహార పదార్థాలు కారులో ఉంటే ఆ వాసన పసిగట్టి కార్లలోకి వెళ్లి ఫుడ్ తినడంతో పాటు కారులోపలి బాగాలను డ్యామేజ్ చేస్తాయి.  

⦿ ఒక్కోసారి మీ కారులోకి ఎలుకలు చేరినట్లు అయితే గట్టిగా హారన్ కొట్టాలి.  చాలా సేపు హారన్ మోగించడం వల్ల కారులో ఉన్న ఎలుకలు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.  

Read Also: మన ఆటోలు వాడుతున్న యూకే పోలీసులు, ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Read Also: టీవీఎస్ బాటలో హోండా కంపెనీ - 2024 వరకు సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ విడుదల!

Published at : 21 Oct 2022 08:01 PM (IST) Tags: rats Car Security Tips Car Protection Tips

సంబంధిత కథనాలు

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

టాప్ స్టోరీస్

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

IND vs BAN 1st ODI: భారత్ తో తొలి వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

IND vs BAN 1st ODI: భారత్ తో తొలి వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!