Maruti Brezza Finance Plan: కేవలం రూ.లక్షన్నరతో మారుతి బ్రెజ్జాను దర్జాగా కొనండి - బ్యాంక్ లోన్ ఇస్తుంది
Maruti Brezza On Bank Loan EMI: మన దేశంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్న మారుతి కార్లలో బ్రెజ్జా ఒకటి. మీరు ఈ కారును ఫైనాన్స్‌లోనూ తీసుకోవచ్చు, తక్కువ డౌన్ పేమెంట్ చేస్తే చాలు.

Maruti Brezza Price, Mileage And Features In Telugu: మంచి మైలేజీ ఇచ్చే కారు కావాలనుకున్న కస్టమర్, తన ఫస్ట్ ప్రిఫరెన్స్ మారుతి కార్లకే ఇస్తాడు. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన బ్రెజ్జా ఒక కాంపాక్ట్ SUV, దీని ధర రూ. 10 లక్షల రేంజ్‌లో ఉంది. మారుతి బ్రెజ్జా కారు పెట్రోల్‌తో పాటు CNG తోనూ నడుస్తుంది, ఈ రెండు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకు ఎక్కువ మైలేజీని ఇచ్చే కారు ఇది. దీని ఎక్స్-షోరూమ్ ధర (Maruti Brezza ex-showroom price) రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.14 లక్షల వరకు ఉంటుంది. అన్ని పన్నులు కలుపుకుని ఆన్-రోడ్ రేటు (Maruti Brezza on-road price) రూ. 10.47 లక్షల నుంచి ప్రారంభమై 17.23 లక్షల వరకు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర
మారుతి బ్రెజ్జా LXi (Petrol) మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 8.69 లక్షల రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో దీని ఆన్-రోడ్ ధర రూ. 10.47 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్-షోరూమ్ రేటు, రిజిస్ట్రేషన్, బీమా ప్రీమియం, ఇతర ఖర్చులు కలిపితే ఆన్-రోడ్ ధర వస్తుంది. ఈ కారును కొనాలని ఉన్నా, పూర్తి మొత్తం మీ దగ్గర లేదని చింతించాల్సిన అవసరం లేదు. ఈ కారును బ్యాంక్ లోన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు, డౌన్-పేమెంట్ చేయడానికి మీ దగ్గర కొంత డబ్బు ఉన్నా చాలు, మిగిలిన డబ్బును బ్యాంక్ ఇస్తుంది. ఈ రుణంపై బ్యాంక్ కొంత వడ్డీని వసూలు చేస్తుంది. బ్యాంక్ నుంచి పొందే రుణం మొత్తం, వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. కార్ లోన్‌ను వడ్డీతో కలిపి ఈజీ EMIల్లో బ్యాంక్‌కు తిరిగి చెల్లించవచ్చు.
ఫైనాన్షియల్ ప్లాన్
డౌన్ పేమెంట్‌గా మీరు కేవలం రూ. 1.47 లక్షలు చెల్లించారనుకుందాం. మిగిలిన రూ. 9 లక్షలు కార్ లోన్ రూపంలో వస్తాయి. దీనిపై బ్యాంక్ 9 శాతం వడ్డీ వసూలు చేస్తుందని భావిస్తే, EMI లెక్క ఇదిగో..
** 7 సంవత్సరాల రుణ కాల పరిమితిని ఎంచుకుంటే ప్రతి నెలా రూ. 14,480 EMI చెల్లించాలి.
** 6 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా సెట్ చేసుకుంటే నెలకు రూ. 16,223 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.
** 5 సంవత్సరాల టెన్యూర్ ఎంచుకుంటే మీ EMI రూ. 18,683 EMI అవుతుంది.
** 4 సంవత్సరాల్లో రుణం మొత్తం చెల్లించాలని భావిస్తే నెలకు రూ. 22,397 EMI బ్యాంక్‌కు కట్టాలి.
లోన్ టెన్యూర్ ఎక్కువగా ఉంటే నెలవారీ EMI తక్కువగా ఉన్నప్పటికీ, చెల్లించాల్సిన మొత్తం వడ్డీ ఎక్కువగా ఉంటుంది. మీకు ఎక్కువ ఆదాయం ఉంటే తక్కువ లోన్ టెన్యూర్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది.
మారుతి బ్రెజ్జా కొనాలంటే జీతం ఎంత ఉండాలి?
మీరు మారుతి బ్రెజ్జా బేస్ వేరియంట్‌ను రుణం తీసుకొని కొనుగోలు చేయాలనుకుంటే, మీ నెల జీతం/ఆదాయం రూ. 60-70 వేల మధ్య ఉండాలి. ఇతర EMIలు లేని పక్షంలో, ఈ జీతంతో 5 లేదా 6 లేదా 7 సంవత్సరాల టెన్యూర్ ఎంచుకోవచ్చు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన మారుతి బ్రెజ్జాను కొనేందుకు రుణం తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. బ్యాంకుల వివిధ విధానాల ప్రకారం EMI గణాంకాలలో తేడా ఉండవచ్చు.





















