అన్వేషించండి

Mercedes-Benz: అరగంట ఛార్జింగ్‌తో 813 km ప్రయాణం - భూకంపం వచ్చినా బెదరని కారు!

Mercedes-Benz EQS 580 Celebration Edition: మెర్సిడెస్-బెంజ్, కొత్త సెలబ్రేషన్ ఎడిషన్ EQS 580ని లాంచ్‌ చేసింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కేవలం 31 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది & 813 km రేంజ్‌ ఇస్తుంది.

Mercedes-Benz EQS 580 Price, Mileage And Features: మెర్సిడెస్-బెంజ్, తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ సెడాన్ EQS 580 సెలబ్రేషన్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ పరిమిత ఎడిషన్. అంటే, ఈ ఎడిషన్‌లో కేవలం కొన్ని కార్లను మాత్రమే ఈ కంపెనీ తయారు చేసి అమ్ముతుంది. అట్రాక్టివ్‌ డిజైన్ & ఫీచర్లు మాత్రమే కాకుండా పనితీరు, లగ్జరీ విషయంలోనూ ఇది పూర్తిగా ప్రత్యేకమైన కారు.

మెర్సిడెస్-బెంజ్ EQS 580 సెలబ్రేషన్ ఎడిషన్‌ ఒక "డ్యూయల్ మోటార్ సెటప్ కలిగిన హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ సెడాన్". ఈ సెటప్ భారీగా 516 bhp పవర్ & 855 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది.

టాప్‌ స్పీడ్‌ ఎంత?
వేగం విషయంలో ఇది సూపర్‌ కార్‌. ఆక్సిలేటర్‌ తొక్కిపడితే కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. ఈ హై-పెర్ఫార్మెన్స్‌ లగ్జరీ కారు వేగం గంటకు 210 కి.మీ.. 4MATIC ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో తూటాలా దూసుకుపోతుంది. అన్ని రకాల వాతావరణాల్లోను రోడ్డుపై అద్భుతమైన పట్టు & స్థిరత్వంతో పరుగులు తీస్తుంది. దీని WLTP సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ రేంజ్ 813 కి.మీ., ఈ విభాగంలోని ఇంప్రెసివ్‌ EVల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది.

ఛార్జింగ్ సామర్థ్యం
ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఛార్జింగ్ సామర్థ్యం చాలా బాగుంది. DC ఫాస్ట్ ఛార్జర్ (200 kW) ఉపయోగించి ఇది కేవలం 31 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. 11 kW AC ఛార్జర్ ఉపయోగించి పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 6.25 గంటలు పడుతుంది. అంటే ఈ కారు చాలా తక్కువ ఛార్జింగ్ బ్రేక్‌లతో సుదూర ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటుంది.

ఇంటీరియర్ & రియర్‌ సీట్‌ ఎక్స్‌పీరియన్స్‌
మెర్సిడెస్-బెంజ్, ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో వెనుక సీట్ల సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మసాజ్ & ఎకస్ట్రా లంబర్ సపోర్ట్‌తో 38-డిగ్రీస్‌ రిక్లైనింగ్ రియర్‌ సీట్లు ఉన్నాయి. సీట్‌ కవర్లను నప్పా లెదర్‌తో తయారు చేశారు, దీంతో కారు ఇంటీరియర్  ప్రీమియం లుక్ & ఫీల్ ఇస్తాయి. ఇంకా.. థర్మోట్రానిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే & డ్రైవింగ్ అసిస్టెన్స్ ప్లస్ ప్యాకేజీ వంటి హై-టెక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

భద్రత & సాంకేతికత
భద్రత పరంగా EQS 580 ఏ విధంగానూ తక్కువగా చూడలేం. కారులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, యాక్టివ్ లేన్ అసిస్ట్ & స్టీరింగ్ అసిస్ట్, 360 డిగ్రీల కెమెరా & 21-అంగుళాల AMG క్లాస్ అల్లాయ్ వీల్స్ వంటి అధునాతన భద్రత ఫీచర్లు ఉన్నాయి. అంటే ఈ కారు కేవలం లగ్జరీ మోడల్‌ మాత్రమే కాదు, ఫుల్‌-ప్రూఫ్ సేఫ్టీ ప్యాకేజీ కూడా. EQS 580లో 5G-ఎనేబుల్డ్ కనెక్టివిటీ, సరౌండ్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, OTA అప్‌డేట్స్‌ & వాయిస్ కంట్రోల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ కారును టెక్-లోడెడ్ & ఫ్యూచర్-రెడీ ఎలక్ట్రిక్ సెడాన్‌గా నిలబెట్టాయి. 

కేవలం 50 యూనిట్లు
మెర్సిడెస్, ఈ సెలబ్రేషన్ ఎడిషన్‌ను చాలా ప్రత్యేకంగా చూస్తోంది, కేవలం 50 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే, భారతదేశం మొత్తంలో కేవలం 50 మంది మాత్రమే ఈ విలాసవంతమైన & టెక్నాలజీ-ఫుల్‌ EVని కొనుగోలు చేయగలరు. 

ధర
మెర్సిడెస్-బెంజ్ EQS 580 సెలబ్రేషన్ ఎడిషన్‌ ధర రూ. 1.30 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ 5 రంగులలో అందుబాటులో ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC gas blowout: కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లో అవుట్ - దడ పుట్టిస్తున్న మంటలు - ఆర్పకుంటే పెను ప్రమాదం
కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లో అవుట్ - దడ పుట్టిస్తున్న మంటలు - ఆర్పకుంటే పెను ప్రమాదం
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC gas blowout: కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లో అవుట్ - దడ పుట్టిస్తున్న మంటలు - ఆర్పకుంటే పెను ప్రమాదం
కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లో అవుట్ - దడ పుట్టిస్తున్న మంటలు - ఆర్పకుంటే పెను ప్రమాదం
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Dhurandhar OTT : ఓటీటీలోకి 1200 కోట్ల బ్లాక్ బస్టర్ 'ధురంధర్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి 1200 కోట్ల బ్లాక్ బస్టర్ 'ధురంధర్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
Embed widget