బ్యాక్ పెయిన్ ఉన్నా బండి నడపొచ్చు! మంచి సస్పెన్షన్ ఇచ్చే బెస్ట్ బైక్‌లు, స్కూటర్లు ఇవే
బ్యాక్ పెయిన్ సమస్య ఉన్నవాళ్లు రోజూ 25–30 కి.మీ. ప్రయాణం చేయాలంటే ఏ బైక్ లేదా స్కూటర్ బెస్ట్? మంచి సస్పెన్షన్, కంఫర్ట్ ఇచ్చే వాహనాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Best Suspension Bikes India: ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో వెన్ను నొప్పి లేదా నడుము నొప్పి ఒకటి. బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ, రోజూ 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం తప్పనివాళ్లకు సరైన టూవీలర్ చాలా ముఖ్యం. సరిగ్గా సరిపోని బైక్ లేదా స్కూటర్ ఎంచుకుంటే నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లకు ఏ వాహనం సరిపోతుందో తెలుసుకోవడం అవసరం.
ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సాధారణంగా, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లకు స్కూటర్ కంటే బైక్ కొంచెం మంచిది. దీనికి కారణం బైక్‌లలో ఉండే పెద్ద వీల్స్, ఎక్కువ ట్రావెల్ ఉన్న సస్పెన్షన్, న్యూట్రల్ రైడింగ్ పొజిషన్. ఇవన్నీ కలిసి రోడ్డు మీద గుంటలు, స్పీడ్ బ్రేకర్లు నుంచి వచ్చే షాక్స్‌ను తగ్గిస్తాయి.
బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లకు సరైన బైక్‌లు
₹1.5 లక్షల బడ్జెట్‌లో, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లకు సరిపడే కొన్ని మంచి 125cc బైక్‌లు ఇవి.
Honda Shine 125
ఈ బైక్ సాఫ్ట్ సస్పెన్షన్, స్ట్రైట్ సీటింగ్ పొజిషన్‌కు ఇది ప్రసిద్ధి. రోజువారీ ప్రయాణానికి ఇది చాలా కంఫర్ట్ ఇస్తుంది. ఇంజిన్ స్మూత్‌గా పనిచేస్తూ, లాంగ్ రైడ్స్‌లో కూడా అలసట తగ్గిస్తుంది.
Hero Super Splendor / Hero Glamour
హీరో బైక్‌లు భారతీయ రోడ్లకు బాగా సెట్ అవుతాయి. సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్‌గా ఉండటం వల్ల నడుముపై ఒత్తిడి తగ్గుతుంది. మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం కూడా ప్లస్ పాయింట్.
TVS Raider 125
యువతకు స్టైల్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. రైడింగ్ పొజిషన్ స్పోర్టీగా ఉన్నా, సస్పెన్షన్ ట్యూనింగ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. నగర రోడ్లపై డైలీ కమ్యూట్‌కు ఇది సరిపోతుంది.
Hero Xtreme 125R
కొంచెం షార్ప్ లుక్ కావాలనుకునే వారికి ఈ బైక్ నచ్చుతుంది. సస్పెన్షన్ సెటప్ వల్ల రోడ్డుపై గుంతలు, గతుకులు ఎక్కువ ఇబ్బంది పెట్టవు.
స్కూటర్ కావాలంటే ఇవి బెస్ట్
కొంతమందికి గేర్ బైక్ ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం కొన్ని స్కూటర్ ఆప్షన్స్ ఉన్నాయి.
TVS Jupiter 110
సాఫ్ట్ సస్పెన్షన్, వెడల్పైన సీట్ వల్ల ఇది కంఫర్ట్‌లో ముందుంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు స్కూటర్ తీసుకోవాలనుకుంటే ఇది మంచి ఎంపిక.
Suzuki Access 125
పవర్‌తో పాటు కంఫర్ట్ ఇస్తుంది. సీటింగ్ పొజిషన్ నేరుగా ఉండటం వల్ల నడుముపై ఒత్తిడి తగ్గుతుంది.
Honda Activa 125
స్మూత్ రైడ్, నమ్మకమైన ఇంజిన్ దీని బలాలు. అయితే పెద్ద గుంటలపై బైక్ స్థాయిలో ఇది కంఫర్ట్ ఇవ్వదన్న విషయం గుర్తుంచుకోవాలి.
చివరిగా ఒక ముఖ్యమైన సూచన
మీరు ఏ వాహనం కొనాలన్నా తప్పకుండా లాంగ్ టెస్ట్ రైడ్ చేయాలి. కనీసం 5–10 కిలోమీటర్లు నడిపి చూడండి. మీ వెన్నెముకకు ఏది సూట్ అవుతుందో అప్పుడు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. అవసరమైతే సీట్ కుషనింగ్, హ్యాండిల్ పొజిషన్ లాంటి చిన్న మార్పులు చేసుకుంటే కంఫర్ట్ ఇంకా పెరుగుతుంది.
సరైన వాహనం ఎంపిక చేసుకుంటేనే, బ్యాక్ పెయిన్ ఉన్నా రోజువారీ ప్రయాణం సులభంగా, సంతోషంగా మారుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















