Scooters Under 1 Lakh in India: రూ.లక్షలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - ఎలక్ట్రిక్ మోడల్స్ కూడా!
Best Scooties Under 1 Lakh in India: ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న స్కూటీల్లో రూ.లక్షలోపు కొన్ని బెస్ట్ స్కూటీలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Best Scooters Under 1 Lakh in India: భారతదేశంలో ద్విచక్ర వాహనాలు సిటీ ట్రాఫిక్‌లో అత్యంత సౌకర్యవంతమైన సాధనాలు. వీటిలో ముఖ్యంగా స్కూటీలు ఒక గొప్ప ఆప్షన్. ఎందుకంటే అవి మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి. మార్కెట్లో అనేక స్కూటర్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆన్ రోడ్ ధర రూ. లక్ష కంటే తక్కువగా ఉన్న స్కూటీలు ఏవో చూద్దాం.
టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ (TVS Scooty Pep Plus)
టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్, స్కూటీ జెస్ట్ మోడల్స్ రూపంలో అందుబాటులో ఉంది. పెప్ ప్లస్‌లో 87.8 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 5.4 బీహెచ్‌పీ, 6.5 ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేయగలదు. అయితే జెస్ట్ వేరియంట్ 7.71 బీహెచ్‌పీ, 8.8 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగల శక్తివంతమైన 110 సీసీ ఇంజన్‌ను కలిగి ఉంది. దీని ఆన్ రోడ్ ధర రూ. 83,342 నుండి ప్రారంభం అవుతుంది.
హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus)
భారతదేశంలో హీరో ప్లెజర్ ప్లస్, ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ 111 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఇది 8 బీహెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 89,124 నుంచి మొదలై రూ. 1.02 లక్షల వరకు వరకు ఉంటుంది.
హోండా డియో (Honda Dio)
కొత్త హోండా డియో మూడు విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. స్పోర్టీ హ్యాండ్లింగ్, సౌకర్యవంతమైన రైడ్ కారణంగా భారతీయ రైడర్లలో ఇది ఒక ప్రముఖ ఆప్షన్. హోండా డియోలో 110 సీసీ ఇంజన్ అందించారు. ఇది 7.75 బీహెచ్‌పీ పవర్, 9ఎన్ఎమ్ పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. హోండా డియో 110 ధర రూ. 89,227 నుంచి మొదలై రూ. 97,666 వరకు ఉంది.
హీరో జూమ్ (Hero Xoom)
హీరో జూమ్‌లో 110 సీసీ ఇంజన్ ఉంది. ఇది 8 బీహెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందిస్తుంది. హీరో జూమ్ ధర రూ. 91,054 నుంచి మొదలై రూ. 1.05 లక్షల వరకు ఉంది.
టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)
జూపిటర్‌కు సంబంధించి రెండు వేరియంట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. బేస్ మోడల్‌లో 110 సీసీ ఇంజన్ అందించారు. ఇది 7.77 బీహెచ్‌పీ పవర్, 8.8 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే మరింత శక్తివంతమైన 125 సీసీ యూనిట్ 8 బీహెచ్‌పీ పవర్, 10.5 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని 110 సీసీ మోడల్ ఆన్ రోడ్ ధర రూ.97,299 నుంచి ప్రారంభం అవుతుంది.
హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G)
హోండా యాక్టివా 6జీలో 109.5 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో అందించారు. ఇది 7.73 బీహెచ్‌పీ పవర్, 8.90 ఎన్ఎం పీక్ టార్క్ పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 93,116 నుండి మొదలై రూ. 1.00 లక్షల వరకు ఉంటుంది.
ఓలా ఎస్1ఎక్స్ (Ola S1X)
ఓలా ఎస్1ఎక్స్‌లో 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 151 కిలోమీటర్ల రేంజ్‌ను, గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?