Best Hybrid SUVs: ₹30 లక్షల లోపు అందుబాటులో ఉన్న పాపులర్ హైబ్రిడ్ SUVలు - మైలేజ్‌లోనూ ఇవి తోపులు!
Best Hybrid Cars 2025: హైబ్రిడ్ టెక్నాలజీతో మెరుగైన మైలేజ్, తక్కువ ఎమిషన్‌ను కోరుకునేవారి కోసం ₹30 లక్షల లోపు అందుబాటులో ఉన్న పాపులర్ SUVల జాబితా మీకోసం!

Mileage-friendly Best Hybrid SUVs Under Rs 30 Lakh: పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆధారపడే రోజులు క్రమంగా ముగిసిపోతున్నాయి. మైలేజ్, ఇంధన పొదుపు, తక్కువ ఎమిషన్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ వాహనాలు న్యూ ట్రెండ్‌గా మారుతున్నాయి. పెట్రోల్‌తో పాటు బ్యాటరీనూతోనూ సపోర్ట్ పొందేలా హైబ్రిడ్ SUVలను డిజైన్ చేశారు. కొన్ని మోడళ్లలో EV మోడ్ (Electric-only mode) కూడా ఉంటుంది. ₹30 లక్షల లోపు బడ్జెట్‌లో భారతదేశం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ హైబ్రిడ్ SUVలు ఇవి:
1. Toyota Urban Cruiser Hyryder
ధర: ₹11.34 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్)
హైదరాబాద్/ విజయవాడలో ఆన్-రోడ్ ధర: దాదాపు ₹13.96 లక్షలు
ఇంజిన్: 1.5 లీటర్ TNGA ఆట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్
హైబ్రిడ్ రకం: పెట్రోల్ + ఎలక్ట్రిక్ మోటార్ (Strong Hybrid)
మైలేజ్:
EV మోడ్‌లో సర్టిఫైడ్ మైలేజ్: 27.97 kmpl
మైల్డ్ హైబ్రిడ్ మోడల్ సర్టిఫైడ్ మైలేజ్: సుమారు 21.12 kmpl
ఇంటీరియర్ హైలైట్స్: టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వెంట్‌సీట్స్, పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా
2. Maruti Suzuki Grand Vitara
ధర: ₹11.42 లక్షలు నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్)
హైదరాబాద్/ విజయవాడలో ఆన్-రోడ్ ధర: దాదాపు 14.15 లక్షలు
ఇంజిన్: 1.5 లీటర్ పెట్రోల్, మైల్డ్ & స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎంపికలు
హైబ్రిడ్ రకం:
మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్ + స్మాల్ బ్యాటరీ అసిస్టెన్స్)
స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్ మోటార్)
మైలేజ్:
మైల్డ్ హైబ్రిడ్ సర్టిఫైడ్ మైలేజ్: సుమారు 21.11 kmpl
స్ట్రాంగ్ హైబ్రిడ్ సర్టిఫైడ్ మైలేజ్: 27.97 kmpl
ఇంటీరియర్ హైలైట్స్: డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్, 9 అంగుళాల స్క్రీన్, హెడప్ డిస్‌ప్లే, అల్ట్రా క్వైట్ కేబిన్
3. Honda Elevate Hybrid (అతి త్వరలో లాంచ్ అవుతుంది)
ధర (అంచనా): ₹16 లక్షల నుంచి ₹19 లక్షల వరకు
హైదరాబాద్/ విజయవాడలో ఆన్-రోడ్ ధర: దాదాపు ₹20 లక్షలు (అంచనా ధర)
ఇంజిన్: 1.5 లీటర్ ఆట్కిన్సన్ సైకిల్ పెట్రోల్
హైబ్రిడ్ రకం: పెట్రోల్ + ఎలక్ట్రిక్ మోటార్ (Strong Hybrid)
మైలేజ్ (అంచనా): సుమారు 26.5 kmpl (Honda City Hybrid ఆధారంగా అంచనా)
ఇంటీరియర్ హైలైట్స్: ఆడాప్టివ్ క్రూయిజ్, లేన్ కీప్ అసిస్ట్, హోండా సెన్సింగ్ టెక్, డిజిటల్ క్లస్టర్
4. Toyota Innova Hycross (Base Hybrid Variants)
ధర: ₹19.95 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్)
హైదరాబాద్/ విజయవాడలో ఆన్-రోడ్ ధర: దాదాపు 25.24 లక్షలు
ఇంజిన్: 2.0 లీటర్ పెట్రోల్ + ఎలక్ట్రిక్ మోటార్ (Strong Hybrid)
హైబ్రిడ్ రకం: స్ట్రాంగ్ హైబ్రిడ్
సర్టిఫైడ్ మైలేజ్: – 23.24 kmpl (సర్టిఫైడ్)
ఇంటీరియర్ హైలైట్స్: 7/8 సీటర్ కాన్ఫిగరేషన్, పవర్ టేల్‌గేట్, ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్, లాంగ్ ట్రావెల్‌కి బెస్ట్
5. MG Hector Hybrid
ధర: ₹14.25 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్)
హైదరాబాద్/ విజయవాడలో ఆన్-రోడ్ ధర: దాదాపు 17.50 లక్షలు
ఇంజిన్: 1.5 లీటర్ టర్బో పెట్రోల్
హైబ్రిడ్ రకం: మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్ + 48V బ్యాటరీ)
సర్టిఫైడ్ మైలేజ్: సుమారు 15–16 kmpl
ఇంటీరియర్ హైలైట్స్: 14 అంగుళాల టచ్‌స్క్రీన్, మీ మూడ్‌కు అనుగుణంగా మార్చుకోగల క్యాబిన్ లైటింగ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద కేబిన్
ఎంచుకునే ముందు ఏం చూడాలి?
బడ్జెట్: ₹15–20 లక్షల మధ్య అయితే హైరైడర్, గ్రాండ్ విటారా బెస్ట్.
సైజు & స్పేస్: పెద్ద SUV కావాలంటే ఇన్నోవా హైక్రాస్ అనేది మంచి ఎంపిక.
టెక్ & సేఫ్టీ: టెక్నాలజీ పరంగా టయోటా ఉత్తమం (హోండా ఎలివేట్ హైబ్రిడ్ వచ్చే వరకు).
హైబ్రిడ్ రకం: స్ట్రాంగ్ హైబ్రిడ్ EV మోడ్‌ను సపోర్ట్ చేస్తుంది. మైల్డ్ హైబ్రిడ్‌లో తక్కువ బ్యాటరీ సపోర్ట్ మాత్రమే ఉంటుంది.
హోండా ఎలివేట్ హైబ్రిడ్ లాంచ్ అయితే, గేమ్‌చేంజర్‌గా మారొచ్చు.
మరిన్ని హైబ్రిడ్, EV కార్ల విషయాల్లో అప్‌డేట్స్ కావాలంటే, మీ ఫేవరెట్ ఆటో న్యూస్ పేజ్‌ను ఫాలో అవ్వండి!





















