అన్వేషించండి

Kia Carens Clavis EV: భారతదేశంలో చవకైన 3-రో ఎలక్ట్రిక్ MPV - 490 km రేంజ్‌ - ధర ఎంతంటే?

Kia Carens Clavis EV: కియా, కొత్త ఎలక్ట్రిక్ MPV Carens Clavis EVని భారతదేశంలో లాంచ్‌ చేసింది. ఇది రెండు బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది, 490 km వరకు రేంజ్‌ ఇస్తుంది.

Kia Carens Clavis EV Price, Range And Features In Telugu: కియా, తన మొట్టమొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ MPV కారెన్స్ క్లావిస్ EV ని రీసెంట్‌గా భారతదేశంలో విడుదల చేసింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ ధర (Kia Carens Clavis EV ex-showroom price) రూ. 17.99 లక్షలు & టాప్ వేరియంట్ ఎక్స్‌-షోరూమ్‌ ధరను రూ. 24.49 లక్షలుగా నిర్ణయించారు. ఇది, ఇటీవల విడుదల చేసిన ICE (ఇంజిన్ ఆధారిత) కారెన్స్ క్లావిస్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్.

బ్యాటరీ ఎంపికలు & డ్రైవింగ్‌ రేంజ్‌ 
కారెన్స్ క్లావిస్ EV ని రెండు బ్యాటరీ ఎంపికలతో (42 kWh & 51.4 kWh) లాంచ్‌ చేశారు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌ ‍(51.4 kWh)తో ఇది దాదాపు 490 కిలోమీటర్ల డ్రైవింగ్‌ రేంజ్‌ ఇస్తుంది. చిన్న బ్యాటరీ వేరియంట్ (42 kWh) దాదాపు 404 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. కియా, ఈ బ్యాటరీలకు 8 సంవత్సరాల వారంటీ ఇస్తోంది & రెండు AC ఛార్జర్ ఆప్షన్స్‌ కూడా అందిస్తోంది. 

కారెన్స్ క్లావిస్ EV 171 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది & 4-లెవెల్‌ రీజెనరేటివ్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఈ కారుకు అమర్చారు. అంటే.. ఆఫీస్‌కు డైలీ అప్‌ అండ్‌ డౌన్‌తో పాటు లాంగ్‌ డ్రైవ్స్‌ ప్లాన్‌ చేసేవాళ్లకు కూడా ఇది సూటబుల్‌ ఆప్షన్‌. 

డిజైన్ & ఎక్స్‌టర్నల్‌ అప్‌డేట్స్‌ 
క్లావిస్ EV, స్టాండర్డ్‌ కారెన్స్ మోడల్ నుంచి భిన్నంగా కనిపించేలా డిజైన్‌ను కొంచం మార్చారు. యాక్టివ్ ఏరో ఫ్లాప్‌లు, ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్ & కొత్త 17-అంగుళాల ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్‌తో ఈ ఎలక్ట్రిక్‌ MPVని అప్‌డేట్‌ చేశారు.

ఫీచర్లు & టెక్నాలజీలు
కారెన్స్ క్లావిస్ EV ని ఫీచర్‌-రిచ్‌గా తీర్చిదిద్దాహు. ఈ EVలో చాలా ప్రీమియం & స్మార్ట్ ఫీచర్లు అందించారు. ఇది V2L & V2V టెక్నాలజీతోనూ పని చేస్తుంది. అంటే, ఈ కారు ఒక పవర్‌హౌస్‌ లాంటింది. V2L అంటే వెహికల్-టు-లోడ్, ఈ EV బ్యాటరీ నుంచి ఛార్జింగ్‌ లైట్లు, హీటర్‌, పోర్టబుల్‌ కూలర్‌, మినీ రిఫ్రిజిరేటర్‌ వంటి ఇతర పరికరాలు & ఉపకరణాలను ఛార్జ్‌ చేసుకోవచ్చు లేదా నేరుగా పవర్‌ తీసుకోవచ్చు. V2V అంటే వెహికల్-టు-వెహికల్, ఈ EV నుంచి మరొక EVని కూడా ఛార్జ్‌ చేయవచ్చు. ఎక్కడైనా ఆగిపోయిన వేరే ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి లేదా జంప్-స్టార్ట్ చేయించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
 
ఇంకా... కొత్త ఫ్లోటింగ్ కన్సోల్, బాస్ మోడ్, పవర్డ్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3 అంగుళాల స్క్రీన్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేయడానికి 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ & కుటుంబ సభ్యుల భద్రత కోసం లెవల్ 2 ADAS, కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీ & 6 ఎయిర్‌ బ్యాగ్‌లు వంటి సాంకేతికతలు ఇందులో ఉన్నాయి.

క్లావిస్ EV మార్కెట్‌ పోటీలో నిలబడగలదా?
కారెన్స్ క్లావిస్ అనేది ICE-కన్వర్టెడ్ EV అయినప్పటికీ చాలా బలంగా కనిపిస్తుంది. దీని ధర BYD eMax 7 కంటే తక్కువ & భారతదేశంలో అత్యంత తక్కువ ధర 3-వరుసల సీట్ల EV. దీని ధర, ఫీచర్లు & పరిధిని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత EV విభాగంలో ఇది బలమైన పోటీదారుగా నిలబడగలదు. 

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget