అన్వేషించండి

Monthly Horoscope for July 2024: మేషం, కన్యా, కుంభం, మీనం సహా ఈ 7 రాశులవారికి జూలై నెలంతా దశ తిరిగిపోతుంది!

Monthly Horoscope for July 2024: జూలై నెలలో ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి , ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి మిశ్రమ ఫలితాలున్నాయి..ఇక్కడ తెలుసుకోండి...

Your Monthly Horoscope for July 2024 by Zodiac Sign  

మేష రాశి

జూలై నెల మేషరాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటకు తిరుగుండదు. చేపట్టిన పనులన్నీ పూర్తిచేస్తారు. వృత్తి , వ్యాపారం, ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో కొన్ని నెలలుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి లాభాలొస్తాయి. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించండి.  

వృషభ రాశి

ఈ నెల ఈ రాశివారికి ఆదాయం  బావుటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న మార్పులుంటాయి. చేపట్టిన పనులు ధైర్యంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. 

మిథున రాశి

ఈ రాశివారికి జూలై నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీ మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది కానీ మనసులో ఏదో విషయంలో కలత ఉంటుంది. వ్యాపారులకు కలిసొచ్చే సమయం ఇది. శత్రువులపై విజయం సాధిస్తారు.  కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

కర్కాటక రాశి

కర్కాటక రాశి వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. శారీరక శ్రమ, అశాంతి పెరుగుతుంది. కుటుంబంలో , కార్యాలయంలో వ్యతిరేకతలు తప్పవు. మీ పేరు ప్రతిష్టలు తగ్గుతాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో నష్టపోతారు. వాహన నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

సింహ రాశి

సింహ రాశివారికి జూలై నెలలో మొదటి 15 రోజులు బావుంటుంది. ఉద్యోగంలో మార్పులు వస్తాయి, వ్యాపారంలో పెట్టిన నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. నెల రెండో భాగంలో అనుకోని ఖర్చులు, అనారోగ్య సమస్యలు, అనుకోని వివాదాలుంటాయి. విద్యార్థులకు మిశ్రమఫలితాలే ఉన్నాయి. 

కన్యా రాశి

జూలై నెలలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసినట్టైతే మంచి ఫలితం సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ పూర్తిచేస్తారు..విజయం సాధిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. అనవసర కోపం తగ్గించుకోవాలి 

తులా రాశి

జూలై నెల తులా రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నాకానీ మీదే పైచేయి. ఆదాయం బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనం సౌఖ్యం ఉంటుంది. పురోగతికి అవకాశాలున్నాయి..ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఈ నెలలో చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. 

Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారిక ఈ నెల ఆరంభం అంతంతమాత్రంగా ఉంటుంది కానీ ద్వితీయార్థం బావుంటుంది. మొదటి 15 రోజుల్లే ఏపని చేసినా దానివల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. జూలై 17 నుంచి పరిస్థితుల్లో మార్పులొస్తాయి. శ్రమపెరిగినా అందుకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిపరిస్థితి మెరుగుపడుతుంది.  

ధనస్సు రాశి

జూలై నెలలో ధనస్సు రాశివారికి గ్రహాల అనుగ్రహం లేదు. అనారోగ్య సమస్యలు, పూర్తిచేయాల్సిన పనుల్లో ఆటంకాలు, శారీరకశ్రమ, పని ఒత్తిడి తప్పదు. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపట్ల అశ్రద్ధ వద్దు. కుటుంబ సభ్యుల సహాయంతో వ్యాపారం మెరుగుపడుతుంది. ఈ నెలలో మీరు కొత్తగా ఏ పనీ ప్రారంభించకపోవడమే మంచిది. 

మకర రాశి

మకర రాశివారికి జూలై నెల ఆరంభం బాగానే ఉన్నప్పటికీ రానురాను ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.  

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

కుంభ రాశి

జూలై  నెలలో కుంభ రాశివారికి గ్రహసంచారం బావుంది. అన్నింటా విజయం మీదే. ఆరోగ్యం బావుటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ధైర్యంగా దూసుకెళతారు. నెల ద్వితీయార్థంలో ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. 

మీన రాశి

జూలై ఆరంభం మీనరాశివారికి సంతోషంగా మొదలవుతుంది. మొండిగా వ్యవహరించి అయినా కానీ అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసొస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది.  

ALSO READ: ఈ రాశులవారు ఒంటరితనాన్ని సౌకర్యవంతంగా ఫీలవుతారు..ఇందులో మీరున్నారా!

Note: ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget