డిసెంబరు 09 to 15 వారఫలాలు: ఆదాయం, ఆనందం, గౌరవం..ఈ రాశులవారికి ఈ వారం బాగా కలిసొస్తుంది
Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Astrology Predictions From December 09 - 15 : డిసెంబరు 09 సోమవారం to డిసెంబరు 15 ఆదివారం వరకూ వారఫలాలు
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం శుభవార్తలు అందుతాయి. చంద్రుని పూర్ణ దృష్టి వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీ రచనలు ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటాయి. మంగళ, బుధవారాల్లో అనవసర ఖర్చులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. పని పట్ల ఉదాసీనంగా ఉంటారు, ఆదాయానికి ఆటంకం ఏర్పడవచ్చు. మీ శత్రువులు మీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు. గురువారం నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఊపందుకుంటాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి.
కన్యా రాశి
కన్యారాశి వారికి వారం ప్రారంభం చాలా బాగుంటుంది. ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆదాయం కూడా మెరుగుపడుతుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. మంగళ, బుధవారాల్లో అంత మంచి ఫలితాలు పొందలేరు. ఎంత మంచి చేయాలనుకున్నా అడ్డంకులు ఎదురవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సమస్యలు పెరుగుతాయి. ఆదాయ వ్యవహారాలు కూడా బలహీనంగానే ఉంటాయి. వారాంతానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. ఎవరికీ సలహాలు ఇవ్వకండి.
Also Read: ఈ రాశులవారికి ఈ వారం నిరాశగా ఆరంభమై ఉత్సాహంగా పూర్తవుతుంది!
తులా రాశి
తులారాశి వారికి ఈ వారం శుభవార్తలు అందుతాయి. వారం ఆరంభంలో ఆనందంగా ఉంటారు. కార్యాలయంలో మీ హోదా పెరుగుతుంది. కొత్త పని వైపు ఆకర్షితులవుతారు. ఆర్థిక కొరత తీరుతుంది. మంగళ, బుధవారాలలో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. వివాదాస్పద విషయాలలో విజయం మీదే అవుతుంది. ప్రభావశీల వ్యక్తులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. గురు, శుక్రవారాల్లో మనసులో నిరాశ ఉండవచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈ వారం సంతోషంగా ఉంటారు. ఎవరి గురించి ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దు. ఎవరికైనా సహాయం చేసేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. చేసే పనిలో సంతృప్తి ఉంటుంది. శత్రువులను ఓడించడంలో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పనులకు సమయం విజయవంతంగా పూర్తిచేస్తారు. మంగళ, బుధవారాలు మీకు కలిసొస్తుంది. నూతన ఆస్తులు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు.
మకర రాశి
మకర రాశి వారు ఈ వారం ఆందోళనల నుంచి ఉపశమనం పొందుతారు ఉత్సాహంగా ఉంటారు. కొత్త పనులపై కాన్సన్ ట్రేట్ చేస్తారు. మంగళ, బుధవారాల్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు...ఈ రెండు రోజుల్లో ఖర్చులు పెరగొచ్చు లేదంటే ఆదాయం తగ్గొచ్చు. మనసులో ఏదో నిరుత్సాహం ఉంటుంది. వీకెండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. రుణ సంబంధ విషయాలలో దారులు తెరుచుకుంటాయి.
Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. ముందస్తు ప్రణాళికల నుంచి లాభాలు ఆర్జిస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. నూతన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ధార్మిక యాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. మంగళ, బుధవారాల్లో ఆదాయం, పనుల్లో వేగం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. గురు, శుక్రవారాలు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయానికి, అదనపు వ్యయానికి అంతరాయం ఏర్పడుతుంది. పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి.
మీన రాశి
ఈ వారం మీన రాశివారిని అదృష్టం వరిస్తుంది. నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు పూర్తిచేయడంపై సంపూర్ణ ఆసక్తితో ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన సొమ్ము చేతికందుతుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.