2025 మే తర్వాత 12 రాశులపై కేతువు ప్రభావం ఇలా ఉంటుంది!

Published by: RAMA

మేష రాశి

కేతువు సంచారం ఈ రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు అందిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగం, వ్యాపారం వృద్ధి చెందుతుంది.

వృషభ రాశి

కేతువు సంచారం మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది

మిథున రాశి

కేతువు సంచారం మీనరాశివారికి లాభాన్నిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలుంటాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవు.

కర్కాటక రాశి

కేతువు సంచారం సమయంలో మీ మాటతీరు మార్చుకోకుంటే అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. బాధ్యతల నిర్వహణ నుంచి తప్పుకోవద్దు. అనారోగ్య సమస్యలుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది

సింహ రాశి

కేతువు సంచారం మీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుంటాయి

కన్యా రాశి

కేతువు సంచారం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఆదాయం బావున్నా ఖర్చులు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు

తులా రాశి

కేతువు సంచారం సమయంలో మీ లక్ష్యాలను సాధిస్తారు. కళారంగంతో అనుబంధం ఉండేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవు.

వృశ్చి క రాశి

కేతువు సంచారం సమయంలో మీకు సమస్యలు తప్పవు. ఉద్యోగులు పనివిషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రత్యర్థులు అప్రమత్తంగా ఉన్నారు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. మాటతీరు మార్చుకోవాల్సిందే.

ధనస్సు రాశి

కేతువు సంచారం సమయంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబం నుంచి సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు

మకర రాశి

కేతువు సంచారం సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మరోసారి ఆలోచించండి.
ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు

కుంభ రాశి

కేతువు సంచారం మీకు అద్భుతంగా కలిసొస్తుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికి శుభసమయం. కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి.

మీన రాశి

కేతువు సంచారం మీకు మంచి చేస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారం వృద్ధి చేస్తారు. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మాట్లాడేటప్పుడు సంయమనం అవసరం.