నవంబరు 18 to 24 ఈ వారం మీ రాశిఫలాలు!
ఈ వారం మీకు కలిసొస్తుంది. ఆస్తులు కలిసొస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యల్ని తేలిగ్గా తీసుకోవద్దు
ఈ వారం శుభఫలితాలున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తులు కలిసొస్తాయి. ధార్మిక కార్యక్రమాలకు డబ్బులు ఖర్చుచేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ సలహాలు అందరకీ మంచి చేస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి సమయం అంత అనుకూలంగా లేదు..జాగ్రత్తపడండి
కొంత కాలంగా మీ కెరీర్లో ఉన్న ఆటంకాలు ఈ వారం తొలగిపోతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఫ్యూచర్ కోసం నూతన ప్రణాళికలు వేసుకుంటారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. కలల ప్రపంచంలోంచి బయటకు రండి . అనారోగ్య సమస్యలున్నాయి
ఈ వారంలో ఆరంభంలో పని ఒత్తిడి నుంచి దూరమవుతుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగం, వ్యాపారం, విద్యలో శుభఫలితాలున్నాయి. కళారంగం వారికి శుభసమయం. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి
ఈ వారం మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సమయానికి ముందే పూర్తి చేస్తారు. ఆస్తులు లేదా నూతన వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరోసారి ఆలోచించండి
ఈ వారం మీరు ఆస్తులు వృద్ధిపై ఆసక్తి చూపిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ శత్రువులు కూడా మిత్రులవుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..అప్పులు చేయొద్దు...
ఈ వారం ఓ శుభకార్యానికి హాజరవుతారు. నూతన విజయాలు సాధించేందుకు మంచి సమయం ఇది.ఉద్యోగం, వ్యాపారంలో శుభఫలితాలున్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. తప్పులను సమర్థించుకోవద్దు..పాఠాలు నేర్చుకోండి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త
ఈ వారం ప్రారంభం మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ ప్రవర్తన ప్రశంసలు అందుకుంటుంది. ఆరోగ్యం, ఆదాయం మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు కూడా మిత్రులవుతారు. ఇతరుల విషయాల్లో కల్పించుకోవద్దు.. కోపం తగ్గించుకోవాలి
గడిచిన వారం కన్నా ఈ వారం మీకు మెరుగైన ఫలితాలున్నాయి. బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారు. ఆదాయం , ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. సమయం వృధా చేయవద్దు.
ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక వృద్ధి సాధ్యం అవుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలుంటాయి. కుటుంబ పెద్దల మద్దతు మీకుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. కుటుంబ జీవితంలో వివాదసూచనలున్నాయి జాగ్రత్త...
ఈ వారం వృత్తి , వ్యాపారం, ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి కానీ వ్యక్తిగత జీవితంలో వివాదాలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. మీ బాధ్యతల పట్ల పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వారం మీ ఆదాయంతో పాటూ ఖర్చులు పెరుగుతాయి.