సెప్టెంబరు 09 - 15 వార ఫలాలు

Published by: RAMA

మేష రాశి

ఈ వారం మేషరాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. ఆర్థికంగా లాభపడతారు. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి

వృషభ రాశి

ఈ రాశివారు ఈ వారం కష్టపడితనే ఫలితం అందుకుంటారు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొంతకాలం నిరాశ తప్పదు

మిథున రాశి

ఈ వారం మిమ్మల్ని పలకరించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయండి..అస్సలు వాయిదా వేయవద్దు. అనవసర భావోద్వోగాలకు అవకాశం ఇవ్వొద్దు

కర్కాటక రాశి

ఈ వారం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..అనవసర చర్చలతో సమయం వృధా చేసుకోవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

సింహ రాశి

ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి అడుగు ఆలోచనాత్మకంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మీ బాధ్యతలను నిర్వర్తించడంలో వాయిదా వేయవద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

కన్యా రాశి

ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఫ్యూచర్ పై ప్రభావం చూపిస్తాయి. కాస్త ఓర్పుగా వ్యవహరిస్తే చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

తులా రాశి

ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఇదే మంచి సమయం. అవసరం అయిన సమయంలో మీకు సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి

వృశ్చిక రాశి

సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది..శత్రువులపై విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు పెద్దలతో సంప్రదించాలి

ధనస్సు రాశి

ఈ వారం ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయండి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు కలిసొస్తాయి. భావోద్వేగాలకు దూరంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి

మకర రాశి

ఈ వారం మీకు శుభసమయం. మీ బాధ్యతలను మీరు సంపూర్ణంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందుకు కదులుతుంది

కుంభ రాశి

ఈ వారం చేయని తప్పులకు నిందలు పడాల్సి రావొచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు కుటుంబ సభ్యులను సంప్రదించాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు..

మీన రాశి

ఈ వారం మీన రాశివారికి అన్నింటా కలిసొచ్చే సమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆస్తులు వృద్ధి చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు