సెప్టెంబరు 18న కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు..ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది
మేషరాశి వారికి సవాలు చేసే సందర్భాలు ఎదురవుతాయి కానీ ప్రశాంతంగా ఉంటారు. నెల రోజుల పాటూ మీకు బాగా కలిసొచ్చే సమయం..
వృషభ రాశివారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి..ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేవద్దు. వ్యక్తిగత, వత్తి జీవితంలో ఇబ్బందులు తప్పవు..
మిథున రాశివారికి మంచి టైమ్ ప్రారంభమవుతోంది కానీ శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.. వ్యక్తిగత జీవతాన్ని తీర్చిదిద్దుకునే సమయం ఇది
కర్కాటక రాశివారి కష్టాలు తీరిపోతాయి..ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే
సింహ రాశివారు ఉద్యోగం మారాలన్న ఆలోచన ప్రస్తుతానికి వదిలేయండి..కష్టపడి పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు పొందుతారు.
కన్యారాశి ఉద్యోగులు వ్యాపారులకు కలిసొచ్చే సమయం. అయితే నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి
శుక్రుడు మీ రాశిలో సంచరించినంత సమయం మీకు పట్టిందల్లా బంగారమే. వృత్తి, ఉద్యోగం, వ్యక్తిగ జీవితంలో అన్నీ శుభ ఫలితాలే
వృశ్చిక రాశి వారికి తులా రాశిలో శుక్ర సంచారం కలిసొస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో లాభాలొస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది.
శుక్రుడు సంచరించే నెలరోజుల పాటూ ధనస్సు రాశివారికి శుభసమయం అనే చెప్పాలి. ఆర్థికంగా లాభపడతారు, ఉద్యోగులు, వ్యాపారులకు మంచి ఫలితాలున్నాయి
మకర రాశివారికి శుక్రుడి సంచారం పెద్దగా కలసిరాదు. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. వ్యక్తిగత జీవితంలో సహనంగా వ్యవహరించాల్సిన సమయం ఇది
కుంభ రాశి వారి ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం ఉండాలి. వృత్తి , ఉద్యోగాలలో పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి.
శుక్రుడు తులా రాశిలో సంచరించే సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు కానీ.. మీ ప్రవర్తనలో మార్పులు చేసుకోవాల్సిన సమయం ఇది. మీ తీరు ఎదుటివారిని ఇబ్బందిపెడుతుంది..