మేషం to మీనం డిసెంబరు 2024 మాస ఫలాలు!

Published by: RAMA

మేష రాశి

మీకు డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభ రాశి

ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కానీ ప్రారంభించిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండండి.

మిథున రాశి

ఈ నెలలో మిథున రాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. నెల మొదట్లో ఇబ్బందులు తప్పవు..రాను రాను పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగం మారాలంటే ఇదే మంచి సమయం

కర్కాటక రాశి

డిసెంబరు నెలలో ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచ బయటపడతారు. ఉద్యోగులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబంలో సంతోషం ఉంటుంది

సింహ రాశి

సింహ రాశివారికి ఈ నెలలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న టైమ్ కి పూర్తిచేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కన్యా రాశి

ఈ నెల కన్యారాశివారికి అన్నింటా అనుకూల సమయం. వృత్తి వ్యాపారాల్లో మెరుగుదల ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. ఆరోగ్యం బావుంటుంది.

తులా రాశి

డిసెంబర్ నెలలో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్తగా ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోని ఆదాయం చేతికందుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది

వృశ్చిక రాశి

మీకు ఈ నెల అన్నీ అనుకూల ఫలితాలే. గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో రాణిస్తారు. ఆస్తులు కొనుగోలు చేసేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ధనస్సు రాశి

ఈ నెల ధనస్సు రాశివారి ఆర్థిక పరిస్థితి ఊహించనంతగా మారిపోతుంది. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. కుటుంబంలో ఎప్పటి నుంచో వెంటాడుున్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

మకర రాశి

మకర రాశివారు ఈ నెలలో చేపట్టే ప్రతి పనిలోనూ ఆశించిన ఫలితం సాధిస్తారు. అనవసర విషయాలకు ఆగ్రహం తగ్గించుకోవాలి. ఉద్యోగం, వ్యాపారంలో శుభ ఫలితాలుంటాయి.

కుంభ రాశి

కుంభ రాశివారికి డిసెంబరు నెల ఆర్థికంగా కలిసొస్తుంది. ప్రతి చిన్న విషయానికి హడావుడి పడతారు. కుటుంబ వాతావరణంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీన రాశి

కొంత కాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి డిసెంబరు నెలలో ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది.