Weekly Horoscope From December 09 - 15: ఈ రాశులవారికి ఈ వారం నిరాశగా ఆరంభమై ఉత్సాహంగా పూర్తవుతుంది!
Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Weekly Horoscope From December 09 - 15 In Telugu: డిసెంబరు 09 సోమవారం నుంచి డిసెంబరు 15 ఆదివారం వరకూ వారఫలాలు
మేష రాశి
వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ప్రలోభపెట్టే పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఎవరికీ తప్పుడు సలహాలు ఇవ్వొద్దు. కీర్తి, సంపద ప్రదర్శన చేసుకోవడం మానేయండి.ఈ వారంలో మంగళవారం మీకు కలిసొస్తుంది. మిమ్మల్ని బాధపెట్టినవారు వెనక్కు తగ్గుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. వారం చివరిలో అదనపు పని ఉండవచ్చు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. శనివారం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
మిథున రాశి
మిథునరాశి వారికి వారం ప్రారంభంలో శత్రువులు ఆధిపత్యం వహించవచ్చు. మీ ఆదాయంలో అడ్డంకులు ఉంటాయి. ఇతరుల సహాయం ఆశించినా ఫలితం దక్కదు. కొంతమంది కారణం లేకుండానే మీ పట్ల శత్రుత్వం కలిగి ఉంటారు. మంగళవారం నుంచి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ పని మెరుగుపడుతుంది. ఇతరులతో పరిచయం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. గురువారం , శుక్రవారం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు
Also Read: ధనుర్మాసం (2024-2025) ఎప్పటి నుంచి ప్రారంభం.. విశిష్టత ఏంటి!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో చంద్రుడు అనుకూలించడం వల్ల వ్యతిరేకతతో ప్రవర్తించే వారికి కూడా మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాలలో అడ్డంకులు తొలగిపోతాయి.. సమయం అనుకూలంగా ఉంటుంది. మంగళ, బుధవారాల్లో విచారంగా ఉంటారు. ఈ వారం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి. గురువారం , శుక్రవారం మంచి రోజులు. మీ ఆదాయం పెరుగుతుంది. కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
సింహ రాశి
ఈ వారం మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. పని పట్ల అజాగ్రత్త వలన నష్టం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యం వద్దు. వాహనంతో సమస్యలను ఎదుర్కోవచ్చు. వారం ఆరంభంలో కన్నా గడిచేకొద్దీ శుభ ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పని పట్ల ఉత్సాహం ఉంటుంది. శుభవార్తలు అందుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మీ పక్షం బలంగా ఉంటుంది. గురువారం, శుక్రవారం నిరాశగా ఉంటారు. శనివారం మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి వారం ప్రారంభంలో సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి.. ఆదాయం బలహీనంగా ఉంటుంది. కొన్ని ప్రణాళికలు విఫలం కావచ్చు. పనిలో నిరాసక్తత ఉంటుంది. మంగళవారం మీకు కలిసొస్తుంది..ఆ రోజు చేపట్టే పనులు పూర్తిచేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేయడంలో సంతోషం ఉంటుంది. కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది. గురువారం, శుక్రవారం ప్రయాణాలు చేస్తారు. ఊహించని ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. శనివారం మీకు కలిసొస్తుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!