అన్వేషించండి

KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?

Telangana Tallis statue | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్న కార్యక్రమానికి హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.

Telangana Govt invites KCR for unveiling of Telangana Tallis statue | సిద్దిపేట: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.

ఎర్రవెల్లి ఫాం హౌస్‌కు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఇదే అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడానికి మంత్రి, నేతల బృందం శనివారం నాడు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లింది. మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు వంశీధర్ రావు తదితరులు సాదర స్వాగతం పలికారు. తన నివాసానికి (Erravelli Farmhouse) వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి లంచ్ ఆతిథ్యమిచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గౌరవించారు.

KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?

ఉద్యమం జరిగిన రోజులు గుర్తుచేసుకున్న నేతలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్, కేసీఆర్ నెమరు వేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా, కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారని తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులు ఉన్నారు.

Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! 

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీలక గుర్తింపు

రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చింది. మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలకు తెలంగాణలో ఓ విశిష్టత, ప్రాముఖ్యత ఉన్నాయి. తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు సైతం గౌరవం దక్కింది. ఏపీలో తమకు నష్టం జరుగుతుందని తెలిసినా, ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పరిస్థితులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలు ఏకమై ఉద్యమించడంతో అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 

మూడు రోజులపాటు ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 7, 8, 9 తేదీలతో ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన వచ్చిన డిసెంబర్ 9న ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా ముగించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలో డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. తెలంగాణ తల్లి రూపం మార్చడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget