Danurmasam 2024 -2025: ధనుర్మాసం (2024-2025) ఎప్పటి నుంచి ప్రారంభం.. విశిష్టత ఏంటి!
Significance Of Dhanurmasam: కార్తీకమాసం సందడి ముగిసింది..మార్గశిరం మొదలైంది. ఈ నెల మధ్యనుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం విశిష్టత ఏంటి - వైష్ణవులకు ఎందుకంత ప్రత్యేకం..
Dhanurmasam Starting and Ending Dates: సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో సంక్రమణం అంటారు. మేషం నుంచి మీనం వరకూ ఒక్కో రాశిలో నెల రోజుల పాటూ సంచరిస్తాడు ఆదిత్యుడు. కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ కోవకే చెందుతాయి. నెలరోజులకు ఓ రాశిలోకి మారే సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన రోజునే ధనుస్సంక్రాంతి అని అంటారు. ఈ రోజు నుంచే ధనుర్మాసం ( Dhanurmasam 2024) ప్రారంభమవుతుంది.
ఈ ఏడాది డిసెంబరు 16 సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది... 2025 (New Year 2025) జనవరి 14 న సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు.. ఆ రోజే మకర సంక్రాంతి (Makar Sankranti 2025). సూర్య భగవానుడు ధనస్సు రాశిలో సంచరించే ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు.
సాధారణంగా తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు కానీ సౌరమానాన్ని అనుసరించి కూడా కొన్ని పండుగలు జరుపుకుంటారు. ధనుర్మాసం ఈ కోవకే చెందుతుంది. డిసెంబరు 16న ప్రారంభమైన ధనుర్మాసం జనవరి 14న గోదాదేవి కళ్యాణంతో(Sri Goda Ranganatha Kalyanotsavam 2025) పరిసమాప్తం అవుతుంది.
Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!
మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒకరోజుతో సమానం. అందులో భాగంగా ధనుర్మాసం దేవతలకు ప్రాతఃకాలం అని చెబుతారు పండితులు. అందుకే ఈ నెల రోజులు గోదాదేవి..శ్రీ మహావిష్ణువు మేలు కొలుపులో భాగంగా పాశురాలు ఆలపించి ప్రత్యేక పూజలు చేసింది. వేకువజామునుంచి విష్ణువును మేల్కొపితే వైకుంఠ ఏకాదశి (2025 Vaikuntha Ekadashi fasting date) రోజు స్వామివారు నిద్రలేచారు..అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగం ధనుర్మాసం..అందుకే ఈ నెల ఎంతో విశిష్టమైనది.
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన నెల అని అర్థం. ఈ నెల రోజులు దేశంలో 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో శ్రీ మహావిష్ణవుకి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఆండాళ్ పూజలు, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ఈ సందడంతా ధనుర్మాసంలోనే. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులూ సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలు వినియోగిస్తారు.
ధనుర్మాసంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది..ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ నెలరోజులు విష్ణువును పూజించి చక్కెర పొంగలి, పులగం , దధ్ధ్యోజనం నివేదించాలి.
Also Read: ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!
గోదాదేవి ఆచరించిన తిరుప్పావై వ్రతాన్ని భక్తులు అనసురిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వశిస్తారు. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన తర్వాతే శ్రీరంగం క్షేత్రానికి వెళ్లి శ్రీరంగనాథుడిలో ఐక్యం అయింది.
పరమాత్ముడిని చేరుకునేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు..మీరు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయనే మీకోసం దిగొస్తాడని గోదాదేవి చాటిచెప్పిన వ్రతమే ధనుర్మాసం..
ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు, బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైనట్టే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గులు సందడి చేస్తాయి. పంట చేతికొచ్చే సమయంకావడంతో లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ కళకళ్లాడుతూ తీర్చి దిద్దుతారు.
Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!