Weekly Horoscope 27 February to 5 March 2023: ఈ వారం ఈ రాశులవారికి చాలా ముఖ్యమైనది అవుతుంది
Weekly Rasi Phalalu In Telugu : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Weekly Horoscope 27 February to 5 March 2023: ఈ వారం ఈ రాశులవారికి చాలా ముఖ్యమైనది అవుతుంది Weekly Horoscope 27 February to 5 March 2023 Weekly Horoscope predictions in Telugu, Arie, Leo, Libra and other Zodiac Signs Weekly Horoscope 27 February to 5 March 2023: ఈ వారం ఈ రాశులవారికి చాలా ముఖ్యమైనది అవుతుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/26/833c42d958b4746c264953c037f44ca21677351569450217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weekly Horoscope 27 February to 5 March 2023: వారఫలాలు 27 ఫిబ్రవరి నుంచి మార్చి 5 వరకు సాగే ఈ వారంలో ఈ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.. అన్ని విధాలుగా కలిసొస్తుంది. ఈ వారం లక్కీ రాశులేంటో చూద్దాం
మేష రాశి
ఈ వారం ఈ రాశివారు పాత పద్ధతులను విడిచిపెట్టి కొత్త సాంకేతికతను సద్వినియోగం చేసుకుని పనిచేయాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది, మీ వ్యాపారంపై దృష్టి పెట్టండి. యువత తమ సమయాన్ని వృధా చేయవద్దు. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేసేందుకు ప్లాన్ చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారు తమ పనితో పాటు సహోద్యోగుల పని విషయంలో కూడా సహాయం చేయండి. వృత్తి నిపుణులు ఈ వారం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు కష్టపడవలసి ఉంటుంది. యువతకు ఏదైనా చేయాలనే కొత్త ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలను చర్యలుగా మార్చేందుకు ఇదే సరైన సమయం. ఈ వారం కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఏదైనా వ్యసనానికి లోనై ఉంటే దాన్నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం జాగ్రత్త.
Also Read: రాశి మారనున్న శుక్రుడు, హోలీ తర్వాత నుంచి ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
సింహ రాశి
ఈ వారం ఈ రాశివారు ప్రతి రోజూ పనులను ప్లాన్ ప్రకారం పూర్తిచేసుకునేందుకు ప్రయత్నించాలి. మీ పనులను సజావుగా పూర్తిచేసుకోండి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది.. ఆలోచనలు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల నుంచి సహకారం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం మీకు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు...ఆందోళన అవసరం లేదు.
తులా రాశి
ఈ వారం ఈ రాశి ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. కంప్యూటర్ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి ఈ వారం మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చుదువులో మెరుగుపడేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో పిల్లల ప్రవర్తనలో వచ్చిన ప్రతికూల మార్పులకు కోపగించుకోకుండా ప్రేమతో వివరించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తృణధాన్యాలు, పండ్లను ఎక్కువ మోతాదులో తినాలి.
Also Read: గుండెల్లో ప్రేమను తెలిపే గుప్పెడు రంగు, వెన్నదొంగ చిలిపి ఆలోచనే హోలీ!
వృశ్చిక రాశి
ఈ వారం ఈ రాశివారికి చాలా ముఖ్యమైనది. పని చేసేటప్పుడు నియమాలు పాటించండి, ఈ వారం ఆర్థిక వ్యవహారాలు వేగవంతం అవుతాయి భారీ లాభాలకు అవకాశాలు ఉంటాయి. వ్యాపారులు సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే కాస్త ఓపికగా వ్యవహరించాలి. పూర్వీకుల పట్ల గౌరవం, వారి కృషిని దృష్టిలో ఉంచుకుని వారు చూపిన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. పెద్దగా హడావుడి, ఒత్తిడి ఉండదు. వ్యాపారానికి సంబంధించిన సంక్లిష్టమైన న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. యువత పని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. కుటుంబంలో కలిసి కూర్చుని మంచి చెడులను చర్చించుకోండి, ఇది మీ స్వంత లోపాలను మరియు ఇతరుల మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. చాలా కాలంగా ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)