అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

వారఫలాలు (మే 22 నుంచి 28 ): ఈ వారం ఈ రాశులవారు ఆదాయాన్ని మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో ఉంటారు

Weekly Horoscope 22-28 May 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Weekly Horoscope 22 to 28 May 2023:  మే 22 సోమవారం నుంచి మే 28 ఆదివారం వరకూ ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి....

మేష రాశి

ఈ వారం మొదటి రెండు రోజుల్లో మేషరాశి వారు ఉన్నత విద్యా రంగాలలో వేగంగా ముందుకు సాగుతారు.  పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. దేవుడిపై భక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు మానసిక ఇబ్బందులు ఉండొచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ఆందోళన వెంటాడుతుంది. వారం చివర్లో మీకు మంచి జరుగుతుంది. అన్నీ శుభఫలితాలు పొందుతారు. చేపలకు ఆహారం వేయండి. 

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈ వారం స్థిరాస్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు సాగుతాయి. ఆస్తుల కొనుగోలు సమయంలో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. నూతనపెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. విదేశీ పెట్టుబడులు కలిసొస్తాయి. వారం మొదట్లో అనారోగ్య సమస్యలున్నాయి కానీ ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. కానీ ప్రేమ సంబంధాల్లో మాధుర్యం దెబ్బతింటుంది. చికిత్స అవసరం అవుతుంది. వారంలో రాబోయే రెండు రోజుల్లో, మీకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. తోబుట్టువులతో పరస్పర సామరస్యం నెలకొంటుంది. వినాయకుడిని ప్రార్థించండి మంచి జరుగుతుంది.

మిథున రాశి

ఈవారం మొదటి రెండు రోజుల్లో మిథున రాశి వారు వ్యాపార జీవితంలో మంచి వృద్ధిని సాధిస్తారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఓ సంస్థతో పరస్పర సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. దీని వల్ల రాబోయే బిజినెస్ బ్లూప్రింట్ గీయడంలో మంచి పురోగతి ఉంటుంది. ఈ వారం ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. సౌకర్యాల సమీకరణలో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వారాంతంలో ప్రయాణం చేయాల్సి రావొచ్చు. హనుమాన్ చాలీశా పఠించండి. 

Also Read: ఈ రాశులవారి మనసులో ఏమున్నా ఠక్కున బయపెట్టేస్తారు, మీరున్నారా ఇందులో!

కర్కాటక రాశి

ఈ వారం మొదటి రెండు రోజులు కర్కాటక రాశి వారు తమ ఆత్మీయులను కలుస్తారు. మీరు చెప్పాలి అనుకున్న విషయాన్ని  సూటిగా చెప్పగలుగుతారు. డబ్బు పెట్టుబడి పెట్టడానికి, విదేశీ పనుల్లో మంచి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు...ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చికిత్స అవసరం అవుతుంది. మీ ఆహారపు అలవాట్లను సరిచేసుకోండి. తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. ఉద్యోగులకు మంచి సమయం. వినాయకుడిని దర్శించుకోండి మీకు మంచి జరుగుతుంది.

సింహ రాశి

ఈ వారం మొదట్లో ఆదాయవనరులు మెరుగుపర్చుకునే పనిలో బిజీగా ఉంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేసేందుకు శ్రద్ధ వహించండి.  వ్యాపారులు, ఉద్యోగులు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అధ్యయన రంగాలలో పురోగతి సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. వారాంతంలో అనారోగ్య సమస్యలుంటాయి..జాగ్రత్త. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువవుతాయి. జీవిత భాగస్వామితో అనుకోని తగాదాలున్నాయి. శివాలయం సందర్శన ద్వారా ప్రశాంతత లభిస్తుంది. 

కన్యా రాశి

ఈ వారం కన్యారాశివారికి బాగా కలిసొస్తుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతోషం పెరుగుతుంది. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. టెక్నికల్ రంగాల్లో ఉన్నవారు సక్సెస్ అవుతారు. ఆరోగ్యం  బావుంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఈ వారం చివర్లో ఖర్చులు పెరుగుతాయి. పక్షులకు ఆహారం ఇవ్వండి.

తులా రాశి

ఈ వారం తులారాశి జాతకులు సాహిత్య, సినీ రంగాలలో ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. రచనా, పరిశోధనా రంగాలలో మీకు అవార్డులు వస్తూనే ఉంటాయి. ఉన్నత విద్య రంగాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు వస్తాయి... చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రెండురోజుల్లో ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి పొందుతారు. సంబంధిత అధికారుల మధ్య సమన్వయం ఉంటుంది. ఇంటా-బయటా గౌరవం పొందుతారు. హనుమంతుడిని దర్శించుకోవడం మంచిది. 

Also Read: జ్యేష్ఠమాసం మొదలైంది - ఈ నెలలో ఎన్ని విశిష్ఠమైన రోజులున్నాయో తెలుసా!

వృశ్చిక రాశి

ఈ వారం వృశ్చిక రాశి వారు తమ జీవనోపాధి రంగాలలో ముందుకు సాగడానికి కష్టపడతారు. పనిని మరింత మెరుగ్గా చేయడానికి సిద్ధంగా ఉండాలి...ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు కష్టపడాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. భార్యాపిల్లలతో సఖ్యత నెలకొంటుంది. వివాహితులకు అనుకూలమైన సమయం ఇది. హనుమాన్ చాలీసా పఠించండి. 

ధనుస్సు రాశి

ఇంటి సభ్యులకు సమయం కేటాయిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారులు,ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యంలో ప్రతికూల ప్రభావాల కారణంగా చికిత్స తీసుకోవాల్సి రావొచ్చు. కుటుంబ సభ్యులతో అనుకోని కలహ సూచన ఉంది జాగ్రత్త. వారం చివర్లో బావుంటుంది. ప్రేమికులకు శుభసమయం. వినాయకుడికి దూర్వారాలు సమర్పించండి. 

మకర రాశి 

ఈ వారంలో నిరుద్యోగులు బిజీబిజీగా ఉంటారు..కానీ..మీ ప్రయత్నాలు మరింత పెంచితేనే మంచి జరుగుతుంది. ఆర్ట్, ఫిల్మ్, టెక్నాలజీ రంగాల్లో వర్ధమాన మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారాంతంలో సంతోషంగా ఉంటారు. మీ సృజనాత్మక శక్తిని వెలికితీయండి. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలంగా పరిస్థితులు మారుతాయి. ఆరోగ్యం బావుంటుంది. తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది.  మూగజీవాలకు ఆహారం ఇవ్వండి. 

కుంభ రాశి 

ఈ వారం కుంభ రాశి వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కష్టపడతారు. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది.  విద్యార్ధులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరచేందుకు మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. వివాహితులు సంతోషంగా ఉంటారు. పాత లావాదేవీ వ్యవహారాలను పరిష్కరించడంలో పాక్షికంగా విజయం సాధిస్తారు. శివాలయానికి వెళ్లండి. 

మీన రాశి

ఈ వారం మీనరాశివారు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. సంతోషంగా ఉంటారు. ఆర్థికలాభాలుంటాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. విదేశీ పెట్టుబడులు కలిసొస్తాయి. హనుమాన్ శ్లోకం పఠించండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget