అన్వేషించండి

Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికే ఉచిత ఇంటి స్థలం, మార్గదర్శకాలివే!

Free House Flots: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అర్హత నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందించింది.

AP Government Key Guidelines For Free House Plots: ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. దారిద్ర్య రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వివిధ అర్హత నిబంధనలు పేర్కొంటూ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని.. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. జీవిత కాలంలో ఒకసారే  ఇంటి పట్టా ఇచ్చేలా గైడ్ లైన్స్ రూపొందించారు. ఇంటి పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా నిర్మాణం చేపట్టాలని సర్కారు తెలిపింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారులుగా ఉండకూడదని స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 1 నుంచి కొత్త పథకం

కాగా, రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారధి ఇటీవల స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలని ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 'అందరికీ ఇళ్లు' పథకం పేరుతో మహిళల పేరుతో ఇళ్లు కేటాయించనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఏజెన్సీల ద్వారా పేదల ఇళ్లు నిర్మించనుండగా.. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఆధార్, రేషన్ కార్డుకు ఫ్లాట్ అనుసంధానం చేయనున్నారు.

'వారిపై చర్యలు'

అటు, పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని.. వాటిని రెవెన్యూ సదస్సుల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తాం. రిజిస్ట్రేషన్ విలువల హేతుబద్ధీకరణ త్వరలోనే ఉంటుంది. గుంటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువే ఉంది. కొన్నిచోట్ల తగ్గిస్తే.. మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయి. నాలా పన్ను కూడా రేషనలైజ్ చేస్తున్నాం. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుంది. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించాం.' అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని.. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబును చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి హామీ ఇచ్చారని మంత్రి అనగాని చెప్పారు. వైసీపీ నిర్బంధాలకు వ్యతిరేకంగా నారా లోకేశ్ చేసిన 'యువగళం' పాదయాత్రకు సోమవారంతో రెండేళ్లు పూర్తైందని చెప్పారు. జగన్ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులన్నీ అధిగమించి లోకేశ్ పాదయాత్ర చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

Also Read: Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget