News
News
వీడియోలు ఆటలు
X

Zodiac signs: ఈ రాశులవారి మనసులో ఏమున్నా ఠక్కున బయపెట్టేస్తారు, మీరున్నారా ఇందులో!

నోట్లో నూగింజ కూడా నానదు అనే సామెత వినే ఉంటారుకదా. అంటే అర్థం ఏంటంటే వాళ్ల మనసులో ఏ విషయం దాగదు, ఠక్కున బయటపెట్టేస్తారని అర్థం. ఈ ప్రవర్తనంతా మీ రాశి ప్రభావమే అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు

FOLLOW US: 
Share:

Zodiac signs: వ్యక్తుల మనస్తత్వం, ప్రవర్తనా విధానం, ఆలోచనా విధానం ఇవన్నీ వారి గ్రహస్థితిపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. వారు వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచనకూ గ్రహసంచారమే కారణం అంటారు. మీ జాతకంలో లగ్నం, గ్రహసంచారం ఆధారంగా ఫలితాల్లో కొన్ని మార్పులున్నప్పటికీ...మీ రాశి ఆధారంగా మీ మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పేస్తారు పండితులు. ఇందులో భాగంగా మనసులో మాటదాగని రాశులవారెవరో చూద్దాం..

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశివారికి మహా తొందర ఎక్కువ. అందరితోనూ అన్ని విషయాలను పంచుకోవాలి అనుకుంటారు. చెప్పాలనుకున్న విషయాన్ని మార్చి చెప్పరు మనసులో ఏముందో అదే బయటపెట్టేస్తారు. అందుకే ఈ రాశివారి మాటలకు ఎదుటివారు తొందరగా హర్ట్ అవుతారు. అయితే వీరికి తరచూ ఒకే రకమైన అభిప్రాయాలు, భావాలు ఉండవు..మారిపోతూ ఉంటాయి. 

Also Read: జ్యేష్ఠమాసం మొదలైంది - ఈ నెలలో ఎన్ని విశిష్ఠమైన రోజులున్నాయో తెలుసా!

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ రాశివారు ప్రేమను పంచడంలో ఫస్ట్ ఉంటారు. అందరి మంచీ కోరుకుంటారు..అందర్నీ తమవారే అనుకుంటారు. అందుకే  తమ మనసులో  విషయాలను తొందరగా బయటపెట్టేస్తారు. మాటలతో ఆకట్టుకోవడంలో ఈ రాశివారు దిట్ట. మాటతీరుతో ఎవ్వరినైనా పడేస్తారు. తమ చుట్టూ ఉన్నవారిని మాటలతో ఉత్సాహపరుస్తూ ఉంటారు. 

సింహ రాశి (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదాలు)

ఈ రాశివారు తొందరగా ఆకర్షితులవుతారు. ఈ రాశివారి  వ్యక్తిత్వం, ప్రవర్తన అందరకీ నచ్చుతుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ. తమ మనసులో విషయాలు తొందరగా బయటపట్టేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు.  వారు చెప్పింది విన్నవాళ్లు  మళ్లీ గుర్తుచేసిన తర్వాత అవునా అని ఆశ్చర్యార్థకంగా మొహం పెడతారట.

Also Read: గర్భాదానం (First Night) ఎందుకు జరిపిస్తారు, మంచి ముహూర్తంలో జరగకపోతే ఏమవుతుంది!

ధనస్సు రాశి (Sagitterius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదాలు)

ఈ రాశివారికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. వారి కుటుంబం, స్నేహితులు, తెలిసినవాళ్లు, తెలియని వాళ్లు ఇలా అందరితోనూ మాట్లాడుతూనే ఉంటారు. వారు తమను తాము ఇతరులతో వ్యక్తీకరించినప్పుడు గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటారు. ఏ విషయంపై అయినా లోతుగా అవగాహన ఉంటుంది.  ఏ విషయాన్ని మనసులో దాచుకోకుండా చెప్పేస్తారు.

కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కుంభరాశి వారు అందరకీ తొందరగా నచ్చేస్తారు. ఈ రాశివారు నిజాయితీ పరులు, చమత్కారులు అనిపించుకుంటారు. వీరిలో కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి..అయితే వాటిని అమలు చేసేలోగా ముందే బయటపెట్టేస్తారు. వీరి మనసులో కూడా ఏ విషయం దాగదు. అయితే ఈ రాశివారు చెప్పింది నిజమో అబద్ధమో అర్థంకాని స్థితిలో ఉంటారు వినేవారు. 

మనసులో ఏదీ దాచుకోకుండా బయటపెట్టడం మంచి అలవాటే కానీ కొన్ని సందర్భాల్లో ఇదే సమస్యలు కొనితెస్తుంది. మీరు ఎంత మంచివారు అన్నది కాదు మీరు చెబుతున్నది ఎవరితో, ఎలాంటి వారితో అన్నది గుర్తించాలి. లేదంటే ఆ తర్వాత పశ్చాత్తాప పడకతప్పదు...

గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 20 May 2023 02:40 PM (IST) Tags: zodiac signs Aries behavior Gemini Behavior Leo Behavior behavior based on zodiac signs

సంబంధిత కథనాలు

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి